Minister Anitha: శ్రీవారిని దర్శించుకున్న హోం మంత్రి అనిత..
ABN , Publish Date - Jun 23 , 2024 | 01:09 PM
తిరుమల: తెలుగుదేశం నాయకురాలు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర హోంమంత్రి వంగలపూడి అనిత ఆదివారం ఉదయం తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. అనంతరం మంత్రి మీడియాతో మాట్లాడుతూ.. చీరాలలో దారుణమైన ఘటన చోటు చేసుకుందని.. సంఘటన జరిగిన 48 గంటల్లోనే నిందితులను పట్టుకున్నామని చెప్పారు.
తిరుమల: తెలుగుదేశం నాయకురాలు (TDP Leader), ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర హోంమంత్రి (Andhra Pradesh State Home Minister) వంగలపూడి అనిత (Vangalapudi Anita) ఆదివారం ఉదయం తిరుమల (Tirumala) శ్రీవారిని దర్శించుకున్నారు. అనంతరం మంత్రి మీడియాతో మాట్లాడుతూ.. చీరాలలో (Chirala) దారుణమైన ఘటన చోటు చేసుకుందని.. సంఘటన జరిగిన 48 గంటల్లోనే నిందితులను పట్టుకున్నామని చెప్పారు. రాష్ట్రంలో ఇలాంటి ఘటనలు పునరావత్తం కాకుండా చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.
గంజాయి (Cannabis), డ్రగ్స్ (Drugs)ను నిర్ములించే విధంగా రాష్ట్ర వ్యాప్తంగా ప్రత్యేక డ్రైవ్ నిర్వహిస్తామని హోంమంత్రి వంగలపూడి అనిత పేర్కొన్నారు. 100 రోజుల్లో గంజాయి, డ్రగ్స్‌ని పూర్తిగా నిర్ములించే విధంగా చర్యలు తీసుకుంటామన్నారు. గత ప్రభుత్వ హయాంలో తిరుమలలో భక్తులు చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నారని, కూటమి ప్రభుత్వ (Kutami Govt.) హయాంలో భక్తులకు మెరుగైన సౌకర్యాలు కల్పిస్తామని..హోం మంత్రి అనిత స్పష్టం చేశారు.
ఈ వార్తలు కూడా చదవండి..
అమెరికాలో కాల్పులు.. బాపట్ల జిల్లా యువకుడి మృతి
ప్రభుత్వ ఉపాధ్యాయురాలు ఆత్మహత్య
మహిళ హత్య కేసును 48 గంటల్లో చేధించిన పోలీసులు
రైతులకు రేవంత్‌రెడ్డి సర్కార్ గుడ్ న్యూస్..
8వ తరగతి చదువుతున్న విద్యార్థి అదృశ్యం
రెడ్ బుక్ అలర్ట్..! ఎవరు ముందు?
Read Latest AP News and Telugu News
Read Latest Telangana News and National News
Read Latest Chitrajyothy News and Sports News