Share News

Madanapalle fire accident: పది ప్రత్యేక బృందాలుగా విడిపోయి విచారణ.. నిజాలు బయటపడతాయా?

ABN , Publish Date - Jul 23 , 2024 | 12:25 PM

Andhrapradesh: మదనపల్లి సబ్ కలెక్టర్ కార్యాలయంలో జరిగిన అగ్ని ప్రమాద సంఘటనపై విచారణ ముమ్మరంగా కొనసాగుతోంది. పోలీసులు10 ప్రత్యేక బృందాలుగా విడిపోయి విచారణలు చేపట్టారు. ఒక్కో బృందంలో టీం లీడర్‌గా డీఎస్సీ స్థాయి అధికారి ఉన్నారు. మదనపల్లి రెవిన్యూ డివిజన్‌కు సంబంధించి మొత్తం 11 మండలాల్లోని తాసిల్దార్ కార్యాలయాల్లో డిప్యూటీ తాసిల్దార్‌ల పర్యవేక్షణలో రికార్డుల తనిఖీలు చేపట్టారు.

Madanapalle fire accident: పది ప్రత్యేక బృందాలుగా విడిపోయి విచారణ.. నిజాలు బయటపడతాయా?
Madanapalli fire incident

అన్నమయ్య జిల్లా, జూలై 23: మదనపల్లి సబ్ కలెక్టర్ కార్యాలయంలో జరిగిన అగ్ని ప్రమాద సంఘటనపై (Madanapalli fire incident) విచారణ ముమ్మరంగా కొనసాగుతోంది. పోలీసులు10 ప్రత్యేక బృందాలుగా విడిపోయి విచారణలు చేపట్టారు. ఒక్కో బృందంలో టీం లీడర్‌గా డీఎస్సీ స్థాయి అధికారి ఉన్నారు. మదనపల్లి రెవిన్యూ డివిజన్‌కు సంబంధించి మొత్తం 11 మండలాల్లోని తాసిల్దార్ కార్యాలయాల్లో డిప్యూటీ తాసిల్దార్‌ల పర్యవేక్షణలో రికార్డుల తనిఖీలు చేపట్టారు. 22ఏ కి సంబంధించిన రికార్డులన్నింటిని ఆయా మండలాల నుంచి మదనపల్లి సబ్ కలెక్టర్ కార్యాలయానికి తీసుకువస్తున్నట్లు గుర్తించారు.

Union Budget 2024-25: ఉద్యోగాల కల్పన కోసం బడ్జెట్‌లో కీలక ప్రకటన


ఇప్పటికే సీనియర్ అసిస్టెంట్‌గా పని చేస్తున్న గౌతం తేజను పోలీసులు అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. మాజీ మంత్రి పెద్దిరెడ్డి వీర విధేయుడుగా ముద్రపడ్డ, గతంలో మదనపల్లి ఆర్డీవోగా పనిచేసిన మురళిని కూడా పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లు సమాచారం. ఈరోజు ఇద్దరు ముగ్గురు కీలక వ్యక్తులపై కేసులు నమోదు చేసే అవకాశాలు ఉన్నట్లు సమాచారం. విచారణలో భాగంగా రాష్ట్ర రెవెన్యూ, విద్యుత్, ఫైర్ శాఖలకు సంబంధించిన ముఖ్య అధికారులు మరికొద్దిసేవట్లో మదనపల్లికి రానున్నారు.

Budget 2024: ఏపీకి కేంద్రం గుడ్ న్యూస్.. అమరావతికి రూ. 15 వేల కోట్లు..


మదనపల్లి సబ్ కలెక్టర్ కార్యాలయంలో అగ్ని ప్రమాదం జరిగిన చోట అడిషనల్ ఎస్పీ రాజకుమార్ సీన్‌ను రీ కన్స్ట్రక్షన్ చేశారు. మదనపల్లి రెవిన్యూ డివిజన్ పరిధిలోని 11 మండలాల తహసిల్దార్ కార్యాలయాలల్లో సోమవారం అర్ధరాత్రి వరకు ప్రత్యేక బృందాల తనిఖీలు నిర్వహించాయి. 22 ఏ ఫైల్స్ అన్నింటినీ కూడా ప్రత్యేక అధికారులు సీజ్ చేసి తీసుకెళ్లారు. దీంతో అక్రమాలు పాల్పడిన అధికారుల గుండెల్లో గుబులు నెలకొంది.


ఇవి కూడా చదవండి..

Hyderabad: స్మిత సబర్వాల్‌ పోస్ట్‌ కలకలం.. నగరంలో దివ్యాంగుల నిరసన

Madanapalle Fire Accident: మదనపల్లి అగ్నిప్రమాద ఘటనపై సీన్ రీ కన్‌స్ట్రక్షన్

Read Latest AP News And Telugu News

Updated Date - Jul 23 , 2024 | 12:40 PM