Share News

AP Assembly: ఏపీపీఎస్సీ గ్రూప్-1 పరీక్షలపై అసెంబ్లీలో కీలక చర్చ

ABN , Publish Date - Jul 23 , 2024 | 11:36 AM

Andhrapradesh: ఏపీ అసెంబ్లీ సమావేశాలు రెండో రోజు ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా ఏపీపీఎస్సీ గ్రూప్ వన్ పరీక్షలపై అసెంబ్లీలో కీలక చర్చ జరిగింది. రాజమండ్రీ రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి ప్రశ్నపై చర్చ మొదలైంది. ఏపీపీఎస్సీ అక్రమాలపై విచారణకు నియమించిన కమిటీ నివేదిక ఆధారంగా సీబీఐ విచారణకు ఆదేశం ఇచ్చే అంశాన్ని పరిశీలిస్తామని ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ తెలిపారు.

AP Assembly: ఏపీపీఎస్సీ గ్రూప్-1 పరీక్షలపై అసెంబ్లీలో కీలక చర్చ
AP Assembly Session

అమరావతి, జూలై 23: ఏపీ అసెంబ్లీ సమావేశాలు (AP Assembly Session) రెండో రోజు ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా ఏపీపీఎస్సీ గ్రూప్ వన్ పరీక్షలపై అసెంబ్లీలో కీలక చర్చ జరిగింది. రాజమండ్రీ రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి ( MLA Gorantla Buchaiah Chowdary) ప్రశ్నపై చర్చ మొదలైంది. ఏపీపీఎస్సీ (APPSC) అక్రమాలపై విచారణకు నియమించిన కమిటీ నివేదిక ఆధారంగా సీబీఐ విచారణకు ఆదేశం ఇచ్చే అంశాన్ని పరిశీలిస్తామని ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ తెలిపారు.

TS Assembly: గట్టి కౌంటర్‌కు కాంగ్రెస్ రెడీ.. నేటి నుంచే తెలంగాణ అసెంబ్లీ


ఆగస్టు 31లోపు కమిటీ నివేదిక ఇవ్వాలని ఆదేశించారన్నారు. రిపోర్ట్ వచ్చిన తరువాత సభ్యులు కోరిన విధంగా సీఎం ఆదేశాలు తీసుకుని సీబీఐ ఎంక్వైరీకి సిఫార్సు చేసే అంశాన్ని పరిశీలిస్తామన్నారు. దీనిపై అధికారంలోకి వచ్చిన వెంటనే మంత్రి లోకేష్ ఒక విచారణ కమిటీ నియమించారన్నారు. దీనిపై ఇప్పటికే అధికారులు విచారణ చేపట్టారని మంత్రి పయ్యావుల వెల్లడించారు.

Union Budget 2024: తెలుపు, ఊదా రంగు చీరకట్టులో నిర్మలమ్మ


ఏపీపీఎస్సీని ప్రక్షాళన చేయాలి: కొలికపూడి

ఏపీపీఎస్సీను సొంత జాగీరుగా వాడుకున్నారని తిరువూరు ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు ఆగ్రహం వ్యక్తం చేశారు. పోస్టుల వారీగా డబ్బులు దండుకున్నారని ఆరోపించారు. గ్రూపు- 2 లో కూడా అదే జరిగిందన్నారు. కోర్టులను తప్పుదారి పట్టించే పనులు చేశారని తెలిపారు. నిరుద్యోగుల జీవితాలతో ఆటలాడుకున్న వారిపై ఎటువంటి చర్యలు తీసుకుంటారని ప్రశ్నించారు. ఏపీపీఎస్సీని పూర్తి స్థాయిలో ప్రక్షాళన చేయాలని ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు కోరారు.

Hyderabad: దివ్యాంగులకు స్మతా సబర్వాల్‌ క్షమాపణ చెప్పాల్సిందే..


సీబీఐ ఎంక్వైరీకి ధూళిపాళ్ల పట్టు...

ఏపీపీఎస్సీకి మాజీ డీజీ గౌతం సవాంగ్, పీఎస్‌ఆర్ ఆంజనేయులు ఇద్దరు కలిసి ఇష్టం వచ్చిన వాళ్ళను ఎంపిక చేశారని ఎమ్మెల్యే ధూళ్ళిపాళ్ళ నరేంద్ర అన్నారు. ఏపీపీఎస్సీ నిబద్ధతపై కూడా సందేహాలు ఉన్నాయన్నారు. మాన్యువల్ వెరిఫికేషన్ జరిగినప్పుడు అవకతవకలు జరిగాయన్నారు. సీనియర్ ఆఫీసర్ల పాత్ర ఉండటంతో దీనిపై సీబీఐ ఎంక్వైరీ జరగాల్సిందే అని పట్టుబట్టారు. ఇష్టం వచ్చినట్టు తమకు కావాల్సిన వారికి ఉద్యోగాలు ఇచ్చేందుకు నిబంధనలు మార్చారన్నారు. దోషులను ఎవరిని కూడా వదిలి పెట్టవద్దని ధూళిపాళ్ల నరేంద్ర డిమాండ్ చేశారు.


ఇవి కూడా చదవండి..

Madanapalle Fire Accident: మదనపల్లి అగ్నిప్రమాద ఘటనపై సీన్ రీ కన్‌స్ట్రక్షన్

Budget 2024: ఏపీకి కేంద్రం గుడ్ న్యూస్.. అమరావతికి రూ. 15 వేల కోట్లు..

Read Latest AP News And Telugu News

Updated Date - Jul 23 , 2024 | 11:37 AM