Share News

Tirumal Laddu: లడ్డూ వివాదంలో వైసీపీ నేతల కంగారు.. కవరింగ్ కోసం యత్నాలు..

ABN , Publish Date - Sep 23 , 2024 | 07:38 PM

ఓ వైపు కల్తీ నెయ్యి వ్యవహారంలో వాస్తవాలు బయటపెట్టే ప్రయత్నం జరుగుతుండగా.. వైసీపీ నేతలు విచిత్ర ప్రకటనలు చేయడం పలు అనుమానాలకు తావిస్తోంది. గత రెండు రోజులుగా వైసీపీ నాయకులు లడ్డూ వివాదంపై రకరకాల ప్రకటనలు..

Tirumal Laddu: లడ్డూ వివాదంలో వైసీపీ నేతల కంగారు.. కవరింగ్ కోసం యత్నాలు..
YS Jagan

తిరుమల లడ్డూ వివాదంపై విచారణ కోసం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్‌)ను ఏర్పాటుచేస్తున్నట్లు ప్రకటించింది. కోట్లాది మంది భక్తుల విశ్వాసాలతో ముడిపడి ఉన్న అంశం కావడంతో.. లడ్డూ వివాదంలో వాస్తవాలను నిగ్గు తేల్చేందుకు ప్రభుత్వం దృష్టిపెట్టింది. తిరుమల లడ్డూ తయారీ కోసం ఉపయోగించే నెయ్యిలో జంతు వ్యర్థాలు, కొవ్వు పదార్థాలు, కొన్ని రకాల నూనెలు కలిశాయని గుజరాత్‌లోని ఎన్‌డీడీబీ తన నివేదికలో స్పష్టం చేసింది. దేశ వ్యాప్తంగా భక్తుల ఆందోళన నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం సైతం ఈ విషయాన్ని సీరియస్‌గా తీసుకుంది. ఓ వైపు కల్తీ నెయ్యి వ్యవహారంలో వాస్తవాలు బయటపెట్టే ప్రయత్నం జరుగుతుండగా.. వైసీపీ నేతలు విచిత్ర ప్రకటనలు చేయడం పలు అనుమానాలకు తావిస్తోంది. గత రెండు రోజులుగా వైసీపీ నాయకులు లడ్డూ వివాదంపై రకరకాల ప్రకటనలు ఇస్తున్నారు. నెయ్యిలో కల్తీ జరగలేదని కొందరు, కల్తీ నెయ్యిని లడ్డూ తయారీకి ఉపయోగించలేదని మరికొందరు నేతలు చెబుతున్నారు. వైసీపీ అధినేత జగన్ సైతం రాజకీయాలకు తిరుమల శ్రీవారిని వాడుకుంటున్నారని ఆరోపించారు. లడ్డూ తయారీకి ఉపయోగించిన నెయ్యిలో జంతు వ్యర్థాలు కలిశాయని, దీంతో కల్తీ జరిగిందని ల్యాబ్ రిపోర్టు వచ్చిన తర్వాత ప్రభుత్వం స్పందించింది. అప్పటివరకు ఏపీ ప్రభుత్వం కానీ, ఇతర పార్టీల నాయకులు స్పందించలేదు. తిరుమల లడ్డూలో ఉపయోగించిన నెయ్యి కల్తీ జరిగిందనే విషయాన్ని ఎన్‌డీడీబీ స్పష్టం చేసిన తర్వాత ప్రభుత్వం సమగ్ర దర్యాప్తునకు ఆదేశించింది. ఈ దర్యాప్తు జరిగేవరకు ఆగకుండా వైసీపీ నేతలు విభిన్న ప్రకటనలతో ప్రజలను గందరగోళంలో నెట్టే ప్రయత్నం చేయడం వెనుక కారణాలు ఏమిటనే చర్చ జరుగుతోంది.

Tirumala: తిరుమలలో ముగిసిన మహా శాంతి యాగం


వైసీపీ నేతల కంగారు..

వైసీపీ ప్రభుత్వ హయాంలోనే నెయ్యిలో కల్తీ జరిగిందని నివేదిక వచ్చినప్పటి నుంచి ఆ పార్టీ నేతలు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. కోట్లాది మంది భక్తుల మనోభావాలకు సంబంధించిన విషయం కావడంతో శ్రీవారి భక్తులు తమ ఆవేదనను వ్యక్తం చేస్తున్నారు. తిరుమల పవిత్రను కాపాడాల్సిన వ్యక్తులు నిర్లక్ష్యంగా వ్యవహారించడంతోనే ఈ ఘటన జరిగిందనే చర్చ జరుగుతోంది. అసలు విషయంపై దర్యాప్తు జరగాల్సిన వేళ ప్రజలను తప్పుదోవ పట్టిస్తూ వైసీపీ నేతలు మాట్లాడటం ద్వారా పొరపాటు జరిగినట్లు పరోక్షంగా అంగీకరిస్తున్నారనే ప్రచారం ఉంది. ఏది ఏమైనప్పటికీ జరిగిన తప్పిదానికి బాధ్యులను గుర్తించి చట్టప్రకారం శిక్షించాల్సిన సమయంలో వైసీపీ లడ్డూ వివాదానికి రాజకీయ రంగు పులుముతుందనే విమర్శలు వస్తున్నాయి.

Big Breaking: ముంబై నటి జెత్వానీ కేసులో కీలక పరిణామం


దర్యాప్తు సంస్థలపై విమర్శలు..

లడ్డూ వివాదంపై రాష్ట్రప్రభుత్వం ఏర్పాటు చేసే సిట్‌పై తమకు నమ్మకం లేదంటూ వైసీపీ నేతలు బహిరంగంగా ప్రకటిస్తున్నారు. సమగ్ర విచారణ చేసి వాస్తవాలను సిట్ బయటపెట్టినా అవ్వన్నీ అవాస్తవాలని ప్రజలను నమ్మించేందుకు వైసీపీ ముందునుంచే ప్లాన్ చేసిందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ ప్లాన్‌లో భాగంగానే దర్యాప్తు అధికారుల నైతికత, ఆత్మస్థైర్యం దెబ్బతినేలా వైసీపీ నేతలు వ్యాఖ్యలు చేస్తున్నారనే అభిప్రాయాన్ని కొందరు వ్యక్తం చేస్తున్నారు. లడ్డూ వివాదంపై దర్యాప్తు వేళ వైసీపీ నేతల కంగారు దేనికి సంకేతం. పూర్తిస్థాయిలో విచారణ జరిగితే తమ బండారం బయటపడుతుందని భయపడుతున్నారనే చర్చ జరుగుతోంది. సిట్ విచారణ తర్వాత కల్తీ నెయ్యి వివాదంపై ఓ క్లారిటీ వచ్చే అవకాశం మాత్రం ఉంది.


AP News: మాజీ మంత్రి అనిల్‌ కుమార్‌పై సొంత బాబాయ్ ఫైర్

మరిన్ని వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Read More Latest Telugu News Click Here

Updated Date - Sep 23 , 2024 | 07:52 PM