Tirupati: రాష్ట్రమంతా ఆడుదాం అంధ్రా.. కానీ తిరుపతిలో మాత్రం..
ABN , Publish Date - Feb 04 , 2024 | 10:51 AM
మైదానాలు లేని పాఠశాలలు ఉండకూడదు అన్న ప్రభుత్వ ఆదేశాలను ప్రభుత్వ అధికారులే పట్టించుకోకపోవడం గమనార్హం. నాలుగు గోడల బోధనే కాకుండా విద్యార్థుల శారీరక వ్యాయామానికి..
మైదానాలు లేని పాఠశాలలు ఉండకూడదు అన్న ప్రభుత్వ ఆదేశాలను ప్రభుత్వ అధికారులే పట్టించుకోకపోవడం గమనార్హం. నాలుగు గోడల బోధనే కాకుండా విద్యార్థుల శారీరక వ్యాయామానికి, వికాసానికి ప్లే గ్రౌండ్స్ చాలా అవసరం. ఈ క్రమంలోనే టీటీడీ తీసుకున్న నిర్ణయంపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. టీటీడీకి చెందిన ఎస్వీ హై స్కూల్ క్రీడా మైదానంలో అనేక నిర్మాణాలు చేపట్టడాన్ని పలువురు తప్పుబడుతున్నారు. ఆడుదాం ఆంధ్ర అని రాష్ట్రమంతా ఆటల పోటీలు పెట్టి తిరుపతిలో క్రీడా మైదానం లేకుండా చేస్తున్నారని మండిపడుతున్నారు. ప్రభుత్వ తీరును ఎండగడుతూ ఉద్యమానికి పిలుపునిచ్చారు.
దీంతో.. ఈ రోజు క్రీడా మైదానం వద్దకు ఎస్వీఎస్ స్కూల్ పూర్వ విద్యార్థులు చేరుకుంటున్నారు. క్రీడా మైదానాన్ని కాపాడుకోవడానికి కార్యాచరణకు సిద్ధమవుతున్నారు. 2.75 ఎకరాల విస్తీర్ణంలో విస్తరించి ఉన్న ఈ ప్లేగ్రౌండ్ గతంలో జిల్లా స్థాయి క్రీడా ఈవెంట్‌లను నిర్వహించింది. అయితే.. రోడ్డు నిర్మాణం కోసం మైదానంలో కొంత భాగం, ప్రైవేటు ఫంక్షన్లు, ఎగ్జిషన్ల కోసం మరికొంత భాగాన్ని కేటాయించారు. దీంతో హై స్కూల్ మైదానంలో విద్యార్థులు ఆడుకునే పరిస్థితి లేకుండా పోయింది.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి.