TTD: శ్రీవారి ఆలయ ప్రతిష్టకు భంగం కలిగేలా రమణ దీక్షితులు వ్యాఖ్యలు: వేణుగోపాల దీక్షితులు
ABN , Publish Date - Feb 22 , 2024 | 12:25 PM
Andhrapradesh: శ్రీవారి ఆలయంలో మార్పులు చేస్తున్నారంటూ రమణ దీక్షితులు చేసిన వ్యాఖ్యలు బాధాకరమని ఆలయ ప్రధాన అర్చకులు వేణుగోపాల దీక్షితులు అన్నారు. గురువారం మీడియాతో మాట్లాడుతూ.. రమణదీక్షితులు పూర్తి అవాస్తవాలు మాట్లాడారన్నారు. శ్రీవారి ఆలయంలో మార్పులు చేస్తున్నారంటూ అబద్దాలు చెప్పారన్నారు.
తిరుమల, ఫిబ్రవరి 22: శ్రీవారి ఆలయంలో (Tirumala Srivari Temple) మార్పులు చేస్తున్నారంటూ రమణ దీక్షితులు (Ramana dikshitulu) చేసిన వ్యాఖ్యలు బాధాకరమని ఆలయ ప్రధాన అర్చకులు వేణుగోపాల దీక్షితులు (Tirumala chief priests Venugopala Dikshitulu) అన్నారు. గురువారం మీడియాతో మాట్లాడుతూ.. రమణ దీక్షితులు పూర్తి అవాస్తవాలు మాట్లాడారన్నారు. శ్రీవారి ఆలయంలో మార్పులు చేస్తున్నారంటూ అబద్దాలు చెప్పారన్నారు. ఆలయంలో 10 ఏళ్ల క్రితం అభివృద్ధి పనులు చేశారని.. ఆలయ ప్రతిష్టకు భంగం వాటిల్లేలా రమణ దీక్షితులు వ్యాఖ్యలు ఉన్నాయని విమర్శించారు. భక్తులు ఎవరు అవాస్తవాలను నమొద్దని కోరారు. ఆలయానికి రాకుండానే రమణ దీక్షితులు, ఆయన కొడుకు జీతం తీసుకుంటున్నారన్నారు. వీడియోలో ఉన్నది రమణదీక్షితులే అని.. ఈవో ధర్మారెడ్డిపై (EO Dharmareddy) రమణ దీక్షితులు వ్యాఖ్యలు పూర్తిగా అవాస్తవమని చెప్పుకొచ్చారు. హిందువుని రమణ దీక్షితులు అన్యమతస్థుడుగా చిత్రీకరించడం బాధాకరమని వేణుగోపాల దీక్షితులు వ్యాఖ్యలు చేశారు.
వారి ప్రమేయం ఉండదు: కృష్ణశేషాచల దీక్షితులు
శ్రీవారి ఆలయ కైంకర్యాల అంశంలో అధికారులు, పాలకమండలి ప్రమేయం ఉండదని ఆలయ ప్రధాన అర్చకులు కృష్ణశేషాచల దీక్షితులు స్పష్టం చేశారు. స్వామి కైంకర్యాల్లో ఎటువంటి మార్పులు లేదన్నారు. సకాలంలో కైంకర్యాలు నిర్వహిస్తున్నామని తెలిపారు. ఆలయంలో ఎటువంటి తవ్వకాలు జరగడం లేదని చెప్పారు. భక్తులు ఎవరు రమణ దీక్షితులు వ్యాఖ్యలను నమోద్దని కృష్ణశేషాచల దీక్షితులు వినతి చేశారు.
మరిన్ని ఏపీ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి...