TTD: వైకుంఠ ద్వారం గుండా శ్రీవారిని దర్శించుకున్న భక్తుల సంఖ్య ఎంతంటే?
ABN , Publish Date - Jan 02 , 2024 | 11:48 AM
Andhrapradesh: వైకుంఠ ఏకాదశిని పురస్కరించుకుని డిసెంబర్ 23 నుంచి పది రోజుల పాటు వైకుంఠ ద్వారాలను టీటీడీ తెరిచే ఉంచింది. వైకుంఠ ద్వారం గుండా గత పది రోజులుగా పెద్ద సంఖ్యలో భక్తులు స్వామి వారిని దర్శించుకున్నారు. పదిరోజుల్లో వైకుంఠ ద్వారాల గుండా స్వామివారిని దర్శించుకున్న భక్తుల సంఖ్య, హుండీ ఆదాయ వివరాలను టీటీడీ ఈవో ధర్మారెడ్డి...
తిరుమల, జనవరి 2: వైకుంఠ ఏకాదశిని పురస్కరించుకుని డిసెంబర్ 23 నుంచి పది రోజుల పాటు వైకుంఠ ద్వారాలను టీటీడీ తెరిచే ఉంచింది. వైకుంఠ ద్వారం గుండా గత పది రోజులుగా పెద్ద సంఖ్యలో భక్తులు స్వామి వారిని దర్శించుకున్నారు. పదిరోజుల్లో వైకుంఠ ద్వారాల గుండా స్వామివారిని దర్శించుకున్న భక్తుల సంఖ్య, హుండీ ఆదాయ వివరాలను టీటీడీ ఈవో ధర్మారెడ్డి మంగళవారం మీడియాకు వెల్లడించారు.
శ్రీవారి ఆలయంలో వైకుంఠ ద్వారాలు తెరిచిన 10 రోజుల్లో దాదాపు 6లక్షల 47వేల 452 మంది భక్తులు శ్రీవారిని దర్శించుకున్నారని ఈవో తెలిపారు. గత ఏడాది కంటే ఈ ఏడాది అదనంగా 40వేల మంది భక్తులు శ్రీవారిని దర్శించుకున్నారన్నారు. అలాగే శ్రీవారి హుండీ ద్వారా రూ.40.10 కోట్లు ఆదాయం లభించిందని చెప్పారు. 17.81 లక్షల మంది భక్తులు అన్నప్రసాదాన్ని స్వీకరించారని.. 35.60 లక్షల లడ్డులను భక్తులకు విక్రయించినట్లు తెలిపారు. 2లక్షల 13వేల మంది భక్తులు శ్రీవారికి తలనీలాలు సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారని టీటీడీ ఈవో ధర్మారెడ్డి వెల్లడించారు.
మరిన్ని ఏపీ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి...