Share News

Tirumala Controversy: జగన్ పాపాలు ముందే తెలిసుంటే 11 సీట్లు వచ్చేవి కావు

ABN , Publish Date - Sep 22 , 2024 | 09:02 PM

తిరుమల లడ్డూల తయారీకి వాడిన నెయ్యిలో జంతువుల కొవ్వు కలిపారన్న విషయం తెలిసినప్పటి కడుపు రగిలిపోతోందని సీఎం చంద్రబాబు ఆవేదన వ్యక్తం చేశారు.

Tirumala Controversy: జగన్ పాపాలు ముందే తెలిసుంటే 11 సీట్లు వచ్చేవి కావు

అమరావతి: తిరుమల లడ్డూల తయారీకి వాడిన నెయ్యిలో జంతువుల కొవ్వు కలిపారన్న విషయం తెలిసినప్పటి మనసు ప్రశాంతంగా లేదని సీఎం చంద్రబాబు ఆవేదన వ్యక్తం చేశారు. అమరావతిలో ఇవాళ ఆయన మాట్లాడుతూ.. తిరుమల విషయంలో జగన్ చేసిన పాపాలు ప్రజలకు ముందే తెలిసి ఉంటే, 11 సీట్లు కూడా గెలిచేవారు కాదని విమర్శించారు. మాజీ సీఎం జగన్ కరుడుగట్టిన నేరస్థుడిలా ఆలోచిస్తున్నాడని అన్నారు. చేసిన తప్పుకు క్షమాపణలు కోరకపోగా ఎదురు దాడి చేసే ఆలోచనలు ఉగ్రవాదులకే వస్తాయని ఆక్షేపించారు.


"అబద్ధాలకు హద్దే లేదన్నట్లుగా ప్రధానికి లేఖ రాస్తావా? చేయరాని తప్పులు చేసి నాపై విషం కక్కుతావా ? నేరం చేసి, ఆ తప్పులు కాయమన్నట్లుగా వ్యవహరిస్తున్నారు. తెలివి ఉన్న వారెవ్వరైనా రూ.320కే కిలో నెయ్యి కొనుగోలు చేస్తారా. నిబంధనలు అన్నీ తారుమారు చేసి వ్యవస్థను భ్రష్టు పట్టిస్తారా ? ఇలాంటి వారు రాజకీయాలు చేస్తుంటే, వారికి సమాధానాలు చెప్పాలంటే మాకే సిగ్గుగా ఉంది. స్వామి పవిత్రతను ఎవ్వరూ మలినం చేయలేరు. టీటీడీ పవిత్రత కాపాడటం కూటమి బాధ్యత. మొత్తం ప్రక్షాళన చేసి, శ్రీ వేంకటేశ్వరుడి ఆలయానికి పూర్వ వైభవం తెద్దాం. ఇప్పటికే ఆగస్టు 15న జరిగిన తప్పుకు యాగం చేశారు. సెప్టెంబర్ 23 నుంచి మహా శాంతి యాగం నిర్వహిస్తాం. రేపు ఉదయం 6 గంటల నుంచి ఈ యాగం ప్రారంభమవుతుంది. శ్రీవారి విమాన ప్రాకారం దగ్గర యాగశాలలో శాంతియాగం జరుపుతారు. ఇందులో ముగ్గురు ఆగమ సలహాదారులు, 8 మంది అర్చకులు పాల్గొంటారు. ఆ తరువాత పంచగవ్య సంప్రోక్షణ చేస్తారు. దేవదేవుడి పవిత్రతను కాపాడటంలో కూటమి ప్రభుత్వం ఎప్పుడూ ముందుంటుంది." అని చంద్రబాబు స్పష్టం చేశారు.

CM Chandrababu: తిరుమల లడ్డూ నెయ్యి కల్తీపై సిట్ ఏర్పాటు: సీఎం చంద్రబాబు

Updated Date - Sep 22 , 2024 | 09:13 PM