Share News

CM Chandrababu: ప్రధాని మోదీతో సీఎం చంద్రబాబు భేటీ

ABN , Publish Date - Dec 25 , 2024 | 05:36 PM

CM Chandrababu: 2025-26 ఆర్థిక సంవత్సరానికి గాను వార్షిక బడ్జెట్‌ను కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ ఫిబ్రవరి 1వ తేదీన పార్లమెంట్‌కు సమర్పించనున్నారు. ఈ నేపథ్యంలో రాష్ట్రానికి సంబంధించిన వివిధ అంశాలను సీఎం చంద్రబాబు కేంద్రం దృష్టికి తీసుకు వెళ్తున్నారు.

CM Chandrababu: ప్రధాని మోదీతో సీఎం చంద్రబాబు భేటీ
AP CM ChandraBabu Meeting With PM Modi

న్యూఢిల్లీ, డిసెంబర్ 25: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడి న్యూఢిల్లీ పర్యటన బిజీ బిజీగా సాగుతోంది. అందులోభాగంగా ప్రధాని నరేంద్ర మోదీతో సీఎం చంద్రబాబు భేటీ అయ్యారు. ఈ సందర్భంగా రాష్ట్ర పరిస్థితులతోపాటు ఏపీ అభివృద్ధికి సంబంధించిన అంశాలను ఈ సందర్భంగా ప్రధాని దృష్టికి సీఎం చంద్రబాబు తీసుకు వెళ్లినట్లు తెలుస్తోంది. వచ్చే ఏడాది ఫిబ్రవరి 1వ తేదీన పార్లమెంట్‌లో కేంద్ర వార్షిక బడ్జెట్‌ను ప్రవేశపెట్టనున్నారు. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రయోజనాలకు సంబదించిన అంశాలతో పాటు కేంద్ర ప్రభుత్వ పథకాలకు రాష్ట్ర ప్రభుత్వ వాటా, నిధుల కేటాయింపులపై ప్రధానితో సీఎం చంద్రబాబు సమగ్రంగా చర్చించినట్లు సమాచారం.

అలాగే అమరావతి నిర్మాణానికి గత మధ్యంతర బడ్జెట్‌లో రూ.15 వేల కోట్లు ఆర్థిక సాయాన్ని ప్రతిపాదించారని.. దీనిని వేగవంతం చేయాలని ఈ సమావేశంలో ప్రధాని మోదీని సీఎం చంద్రబాబు కోరినట్లు తెలుస్తోంది. విశాఖపట్నం రైల్వే జోన్ శంకుస్థాపన కార్యక్రమానికి ప్రధాని మోదీని సీఎం చంద్రబాబు ఆహ్వానించారు. ఇక ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జీవనాడి పోలవరం ప్రాజెక్ట్ నిర్మాణానికి సహకారం అందించడంతోపాటు వరద సెస్‌కు అనుమతి ఇవ్వాలని ప్రధాని మోదీకి సీఎం చంద్రబాబు విజ్ఞప్తి చేశారు.


AP-CM-CBN.jpg

ఇక రాష్ట్రంలో చేపట్టనున్న నూతన ప్రాజెక్టులకు ఆర్ధిక సహాయ సహకారాన్ని సైతం ఈ సందర్బంగా ప్రధానికి సీఎం వివరించారు. మరోవైపు ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌తో సైతం సీఎం చంద్రబాబు భేటీ కానున్నారు. ఇంకోవైపు ఇప్పటికే కేంద్ర మంత్రులు అమిత్ షా, జేపీ నడ్డా, అశ్వినీ వైష్ణవ్‌లతో సీఎం చంద్రబాబు సమావేశమయ్యారు.

Also Read: కేంద్ర మంత్రులతో సీఎం చంద్రబాబు ప్రత్యేక భేటీ


AP-CM-CBN-With-Central-MIni.jpg

2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి వార్షిక బడ్జెట్‌ను ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్.. వచ్చే ఏడాది ఫిబ్రవరి 1వ తేదీన పార్లమెంట్‌లో ప్రవేశపెట్టనున్నారు. ఈ నేపథ్యంలో రాష్ట్ర విభజనతో ఆంధ్రప్రదేశ్‌ తీవ్ర నష్టం పోయిందని.. ఈ నేపథ్యంలో రాజధాని అమరావతి, పోలవరం ప్రాజెక్ట్‌తోపాటు ఇతరత్ర అంశాలను కేంద్ర మంత్రుల దృష్టికి సీఎం చంద్రబాబు తీసుకు వెళ్తున్నారు. ఆ క్రమంలో కేంద్ర మంత్రులతో సీఎం చంద్రబాబు వరుసగా సమావేశమవుతున్నారు.

Also Read: ఎన్డీయే నేతల సమావేశంలో ఈ అంశాలపై కీలక చర్చ

Also Read: దాని వెనుకనున్న మతలబేంటో సీఎం బయటపెట్టాలి

For AndhraPradesh News And Telugu News

Updated Date - Dec 25 , 2024 | 08:10 PM