CM ChandraBabu: ఢిల్లీకి సీఎం చంద్రబాబు
ABN , Publish Date - Nov 14 , 2024 | 06:34 PM
ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు రేపు దేశ రాజధాని ఢిల్లీకి బయలుదేరి వెళ్లనున్నారు. వెలగపూడి సచివాలయం నుంచి గన్నవరం ఎయిర్ పోర్ట్ చేరుకుంటారు. అక్కడి నుంచి ఆయన న్యూఢిల్లీ బయలుదేరి వెళ్లనున్నారు.
అమరావతి, నవంబర్14: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఢిల్లీ పర్యటన ఖరారు అయింది. శుక్రవారం మధ్యాహ్నం 1.00 గంటకు సీఎం చంద్రబాబు ఢిల్లీ బయలు దేరి వెళ్లనున్నారు. అందుకోసం వెలగపూడిలోని సచివాలయం ఎదురుగా ఉన్న హెలి ప్యాడ్ నుంచి హెలికాఫ్టర్‌లో గన్నవరం విమానాశ్రయానికి చేరుకోనున్నారు. అక్కడి నుంచి ప్రత్యేక విమానంలో ఆయన ఢిల్లీకి వెళ్లనున్నారు.
Also Read: క్రిమినల్ మెంటాలిటీ ఉన్న వ్యక్తి రాజ్యాన్ని ఏలితే..
సాయంత్రం 3:45 గంటలకు సీఎం చంద్రబాబు ఢిల్లీ చేరుకుంటారు. ఈ ఢిల్లీ పర్యటనలో భాగంగా పలువురు కేంద్ర మంత్రులతో ఆయన భేటీ కానున్నారు. ఈ సందర్బంగా రాష్ట్రాభివృద్ధికి సంబంధించిన పలు కీలక అంశాలపై వారితో ఆయన చర్చించనున్నారు.
Also Read: జైలులో నా గదిలో సీసీ కెమెరాలు.. ఆ నాటి చేదు ఘటనలు గుర్తు చేసిన
అలాగే ఢిల్లీలోని బీజేపీ పెద్దలతో సైతం ఆయన సమావేశం కానున్నారు. ఇక శనివారం ఢిల్లీ నుంచి మహారాష్ట్రకు సీఎం చంద్రబాబు బయలుదేరి వెళ్లనున్నారు. మహారాష్ట్ర అసెంబ్లీకి జరగనున్న ఎన్నికల ప్రచారంలో సీఎం చంద్రబాబు పాల్గొనున్నారు. ఎన్డీయే తరఫున ఆయన ఎన్నికల ప్రచారం నిర్వహించనున్నారు.
Also Read: రఘురామపై సీఎం చంద్రబాబు ప్రశంసలు
మహారాష్ట్రలో ఎలాగైనా అధికారాన్ని నిలుపుకోవాలని మహాయుతీ కూటమి వ్యూహాత్మకంగా అడుగులు వేస్తుంది. దీంతో బీజేపీ, బీజేపీ సంకీర్ణ ప్రభుత్వంలోని భాగస్వామ్య పక్ష పార్టీల అధినేతలు మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల వేళ.. సూడిగాలి ప్రచారం నిర్వహిస్తున్నారు.
Also Read: వైసీపీ సభ్యులపై మంత్రి నారా లోకేశ్ ఫైర్
మరోవైపు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి సైతం మహారాష్ట్రలో ఎన్నికల ప్రచారం నిర్వహించిన సంగతి తెలిసిందే. ఈ ఎన్నికల్లో మహాయుతీని చావు దెబ్బ కొట్టాలంటూ మహా వికాస్ అఘాడీ భాగస్వామ్య పక్షాలు తమదైన శైలీలో ముందుకు వెళ్తున్నాయి.
ఇక మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు నవంబర్ 20వ తేదీన జరగనున్నాయి. మొత్తం 288 అసెంబ్లీ స్థానాలకు ఒకే విడతలో ఎన్నికలు జరగనున్నాయి. మహారాష్ట్రలో రెండు కూటముల మధ్య రసవత్తర పోరు జరుగుతుంది. ఎన్సీపీ (శరద్ పవార్), శివసేన (ఉద్దవ్ ఠాక్రే), కాంగ్రెస్ పార్టీలు కలగలిసి మహా వికాస్ అఘాడీగా ఏర్పాటయ్యాయి.
అలాగే ఎన్సీపీ (అజిత్ పవార్), శివసేన (షిండే), బీజేపీ కలిసి మహాయుతీగా అవతరించింది. దీంతో మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో ఏ పార్టీకి ఓటరు పట్టం కడతాడనేది నవంబర్ 23వ తేదీన తెలిపోనుంది.
For AndhraPradesh News And Telugu News...