Share News

Minister Nara Lokesh : విద్యావ్యవస్థ ప్రక్షాళన

ABN , Publish Date - Dec 08 , 2024 | 04:09 AM

రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం సమూలంగా విద్యావ్యవస్థను ప్రక్షాళన చేస్తుంద ని విద్యాశాఖ మంత్రి లోకేశ్‌ అన్నారు. శనివారం బాపట్లలో జరిగిన ఉపాధ్యాయులు, తల్లిదండ్రుల ఆత్మీయ సమావేశం (పీటీఎం)లో పాల్గొన్నారు.

Minister Nara Lokesh : విద్యావ్యవస్థ ప్రక్షాళన

  • ప్రభుత్వ బడుల్లో స్టాన్‌ఫర్డ్‌ ప్రమాణాలు

  • ఆరు నెలల్లో మెగా డీఎస్సీ ద్వారా టీచర్‌ పోస్టుల భర్తీ

  • సంక్రాంతి ముందే వచ్చినట్లుంది

  • మెగా పీటీఎం కార్యక్రమంలో మంత్రి లోకేశ్‌

బాపట్ల, డిసెంబరు 7(ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం సమూలంగా విద్యావ్యవస్థను ప్రక్షాళన చేస్తుంద ని విద్యాశాఖ మంత్రి లోకేశ్‌ అన్నారు. శనివారం బాపట్లలో జరిగిన ఉపాధ్యాయులు, తల్లిదండ్రుల ఆత్మీయ సమావేశం (పీటీఎం)లో పాల్గొన్నారు. ‘ఇక్కడి వాతావరణం నాకు చిన్నప్పటి రోజులను గుర్తుకుతెస్తోంది. చిన్నప్పుడు ఇలాంటి సమావేశాలకు అమ్మే వచ్చేవారు. నాన్న అప్పటికే సీఎం కాబట్టి ఆయనకు సమయం ఉండేది కాదు. ఇక్కడి వాతావరణం చూస్తుంటే సంక్రాంతి పండగ ముందే వచ్చినట్లు అనిపిస్తోంది. మనందరి మధ్య బలమైన బంఽధాన్ని పీటీఎం ఏర్పరిచింది. అది విద్యావ్యవస్థలో మెరుగైన ఫలితాలను తీసుకురానుంది’’ అని మంత్రి అన్నారు. పిల్లల్లో తనకు దేవు డు కనబడతాడని, అందరూ తన కుమారుడు దేవాన్ష్‌ లాగే కనబడతారని వ్యాఖ్యానించారు. మెగా పీటీఎం తొలి అడుగు మాత్రమేనని, ఏ రాష్ట్రంలో జరగనివిధంగా ఒకేసారి 71 లక్షల మంది తల్లిదండ్రులు, 1,88,266 మంది ఉపాఽధ్యాయులు, 50 వేలకు పైగా ప్రజాప్రతినిధులు పాల్గొనడం ఓ చరిత్రగా నిలిచిపోతుందన్నారు. ఎప్పుడూ లేని విధంగా రిపోర్టు కార్డు కూడా తయారు చేసి 5 స్టార్‌ రేటింగ్‌లో స్కూల్‌ ఏ స్థానంలో ఉందో తెలుసుకోవడంతోపాటు విద్యార్థి ప్రొగ్రెస్‌ రిపోర్టును కూడా ఎసెస్‌ చేసే విధంగా చూస్తున్నామని లోకేశ్‌ తెలిపారు. ప్రభుత్వ బడుల్లో స్టాన్‌ఫర్డ్‌ స్థాయి ప్రమాణాలను తీసుకొస్తామన్నారు.

Untitled-4 copy.jpg

ఆడ, మగ సమానమే..

‘‘ఇంట్లో ఎవరన్నా ఏడుస్తుంటే...అమ్మాయిలాగా ఏడవొద్దు అంటారు. ఇది తప్పు. ఆడ, మగ ఇద్దరూ సమాన మే. మార్పు మన ఇంట్లో నుంచే మొదలవ్వాలి. ఏ నిర్ణయమైనా అందరితో కలిసి చర్చించిన తర్వాతే తీసుకుంటాం. గత ప్రభుత్వంలో లాగా అర్ధరాత్రి నిర్ణయాలు ఉండవు. డ్రగ్స్‌, గంజాయికి బానిస అవ్వడం వల్ల ఓ తరం నాశనమయ్యే ప్రమాదం ఉంది. అందుకే డ్రగ్స్‌పై యుద్ధం చేస్తున్నాం. ప్రభుత్వ పాఠశాలలకు పూర్వ వైభవం తీసుకురావడానికి కృషి చేస్తాను’’

- నారా లోకేశ్‌

Updated Date - Dec 08 , 2024 | 04:11 AM