Share News

RK Roja: ఆర్కే రోజాపై పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు

ABN , Publish Date - Nov 30 , 2024 | 04:11 PM

వైసీపీ నేత, మాజీ మంత్రి ఆర్కే రోజాపై కర్నూలు మూడో పట్టణ పోలీస్ స్టేషన్‌లో దళిత సంఘాలు ఫిర్యాదు చేశాయి. ఉమ్మడి గుంటూరు జిల్లాలోని బాపట్లలో సూర్యలంక బీచ్‌లో దళితుడిని ఆర్కే రోజా అవమానించిందని ఆయా సంఘాలు ఆరోపించాయి.

RK Roja: ఆర్కే రోజాపై పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు
Ex Minister RK Roja

కర్నూలు, నవంబర్ 30: ఉమ్మడి గుంటూరు జిల్లా బాపట్లలోని సూర్యలంక బీచ్‌లో ఉద్యోగితో చెప్పులు మోయించిన వ్యవహారంలో మాజీ మంత్రి, వైసీపీ నేత ఆర్కే రోజాపై దళిత సంఘాలు పోలీసులకు ఫిర్యాదు చేశాయి. శనివారం కర్నూలు నగరంలోని 3వ పట్టణ పోలీస్ స్టేషన్‌లో ఆమెపై ఫిర్యాదు చేశాయి. దీంతో ఆమెపై పోలీసులు కేసు నమోదు చేసినట్లు తెలుస్తుంది. గతేడాది అంటే.. 2023, ఫిబ్రవరిలో బాపట్ల జిల్లా సూర్యలంక బీచ్‌ను మంత్రి పర్యాటక శాఖ మంత్రి ఆర్కే రోజా సందర్శించారు. ఈ సందర్బంగా మనోహర్ అనే ఉద్యోగి.. ఆమె చెప్పులు పట్టుకున్నారు. ఈ నేపథ్యంలో దళితులను అవమానించారంటూ ఆమెపై పోలీస్ స్టేషన్‌లో దళిత సంఘాలు ఫిర్యాదు చేశాయి.

Also Read: రాహుల్ గాంధీ స్వాతిముత్యం


roja.jpgపర్యాటక మంత్రిగా...

గత వైఎస్ జగన్ ప్రభుత్వంలో ఆర్కే రోజా.. పర్యాటక శాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టారు. ఆ క్రమంలో గతేడాది బాపట్లలోని సూర్యలంక బీచ్‌‌కు వెళ్లారు. పర్యాటక శాఖ రిసార్ట్స్‌ వద్ద మంత్రికి అధికారులు స్వాగతం పలికి బీచ్‌ వద్దకు తీసుకెళ్లారు. ఆమె సముద్రపు నీటిలోకి దిగే ముందు ఒడ్డున చెప్పులు విడిచారు. అయితే వాటిని జాగ్రత్తగా చూడాలంటూ రోజా వ్యక్తిగత సహాయకుడు.. సిబ్బందిని ఆదేశించారు. దీంతో స్థానిక పర్యాటక శాఖకు చెందిన రిసార్ట్స్‌ ఉద్యోగి శివనాగరాజు మంత్రి చెప్పులను కొద్దిసేపు చేతితో మోసి అనంతరం పక్కన పెట్టారు. ఆ తర్వాత బీచ్‌ నుంచి తిరిగొచ్చిన మంత్రి ఆర్కే రోజా.. చెప్పులు వేసుకుని రిసార్ట్స్‌కు వెళ్లారు. అందుకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. దీంతో రోజా వ్యవహారంపై నెటిజన్లు విమర్శలు గుప్పిస్తున్నారు. మనమింకా ప్రజాస్వామ్య పాలనలో ఉన్నామా? లేకపోతే దొరల రాజ్యంలోఉన్నామా? అని రోజాపై నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.


తీరుతో తీవ్ర వివాదాస్పదం..

అదీకాక మంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత ఆర్కే రోజా తీరు తీవ్ర వివాదాస్పదంగా మారిన సంగతి తెలిసిందే. తిరుమలలో కొలువు తీరిన శ్రీవారిని ఆమె పలుమార్లు దర్శించుకున్నారు. అనంతరం ఆనంద నిలయం వెలుపల మీడియాతో ఆర్కే రోజా మాట్లాడుతూ.. ప్రతిపక్ష పార్టీల అధినేతలపై రాజకీయ విమర్శలు చేశారు. దీంతో తిరుమలలో రోజా రాజకీయాలు మాట్లాడడంపై శ్రీవారి భక్తుల నుంచే కాకుండా.. సర్వత్ర విమర్శలు సైతం వ్యక్తమైన సంగతి తెలిసిందే.


చర్యలు శూన్యం.. కానీ కొత్త..

కానీ గత ప్రభుత్వం ఆర్కే రోజాపై ఎటువంటి చర్యలు చేపట్టలేదు. ఈ నేపథ్యంలో టీటీడీ కొత్త పాలక మండలి ఇటీవల కొలువు తీరింది. తొలి సమావేశంలోనే.. తిరుమలలో రాజకీయాలు మాట్లాడ కూడదంటూ.. కీలక నిర్ణయం తీసుకుంది. ఓ వేళ అలా చేస్తే.. కఠిన చర్యలు తీసుకుంటామని టీటీడీ పాలక మండలి స్పష్టం చేసింది.


అలాగే పలు ఆలయాల సందర్శనకు వెళ్లి.. అధికార దర్పన్ని సైతం ఆమె ప్రదర్శించేవారనే విమర్శలు సైతం ఉన్నాయి. ఇక ఉత్తరాది పుణ్య క్షేత్ర దర్శనాలకు వెళ్లిన సమయంలో అయితే ఆర్కే రోజా.. పూల దండలు వేసుకుని పడవల్లో విహరిస్తున్న వీడియోలు సైతం సోషల్ మీడియాలో హల్ చల్ చేసిన విషయాన్ని నెటిజన్లు గుర్తు చేస్తున్నారు.

For AndhraPradesh News And Telugu News

Updated Date - Nov 30 , 2024 | 04:48 PM