AP News: ఎన్టీఆర్ జిల్లా అంతటా144 సెక్షన్, పోలీస్ యాక్ట్ సెక్షన్ 30 అమలు: సీపీ
ABN , Publish Date - May 20 , 2024 | 02:40 PM
Andhrapradesh: ఎన్టీఆర్ జిల్లా మొత్తం 144 సెక్షన్, పోలీసు యాక్ట్ సెక్షన్ 30 అమలులో ఉందని సీపీ పీహెచ్‌డీ రామకృష్ణ వెల్లడించారు. సోమవారం మీడియాతో మాట్లాడుతూ.. పెట్రోలు బంకుల్లో లూజ్ పెట్రోల్ అమ్మకాలపై నిషేధం విధించామన్నారు. బాణాసంచా తయారీదారులకు, షాపులకు నోటీసులు ఇస్తున్నామని తెలిపారు. స్ట్రాంగ్ రూంలకు రెండు కిలోమీటర్ల దూరం వరకూ రెడ్ జోన్ ఉందన్నారు.
విజయవాడ, మే 20: ఎన్టీఆర్ జిల్లా (NTR District) మొత్తం 144 సెక్షన్, పోలీసు యాక్ట్ సెక్షన్ 30 అమలులో ఉందని సీపీ పీహెచ్‌డీ రామకృష్ణ (CP PHD Ramakrishna) వెల్లడించారు. సోమవారం మీడియాతో మాట్లాడుతూ.. పెట్రోలు బంకుల్లో లూజ్ పెట్రోల్ అమ్మకాలపై నిషేధం విధించామన్నారు. బాణాసంచా తయారీదారులకు, షాపులకు నోటీసులు ఇస్తున్నామని తెలిపారు. స్ట్రాంగ్ రూంలకు రెండు కిలోమీటర్ల దూరం వరకూ రెడ్ జోన్ ఉందన్నారు. రెడ్ జొన్‌లో డ్రోన్‌లు ఎగురవేసినా, నిబంధనలు అతిక్రమించినా చట్టపరమైన చర్యలుంటాయని హెచ్చరించారు. సోషల్ మీడియాలో ఫేక్ న్యూస్ వ్యాపింపచేస్తే చట్టపరమైన చర్యలుంటాయని తెలిపారు. స్ట్రాంగ్ రూం వద్ద సీఆర్పీఎఫ్ బలగాలు, సివిల్ పోలీసులు, ఏపీఎస్పీతో మూడంచెల సెక్యూరిటీ ఉందని సీపీ చెప్పారు.
AP Elections 2024: మంత్రి ధర్మానకు టెన్షన్.. సీన్ రివర్స్ అయినట్టేనా..!?
కౌంటింగ్ రోజు సెంటర్‌కు వంద మీటర్ల దూరంలో పార్కింగ్ ఉంటుందని.. ఫేషియల్ రికగ్నేషన్ సీసీ కెమెరాలు ఏర్పాటు చేశామన్నారు. కలెక్టర్ ఇచ్చిన పాసులు ఉన్న వారికే స్ట్రాంగ్ రూంలకు వెళ్ళే అవకాశం ఉంటుందని స్పష్టం చేశారు. డైనమిక్ చెక్ పోస్టులు కూడా ఏర్పాటు చేశామన్నారు. ఫైర్, సెక్యూరిటీకి సంబంధించి పూర్తి ఏర్పాటు చేశామని.. కొందరిని బైండోవర్ చేశామని తెలిపారు. కౌంటింగ్ ప్రశాంతంగా జరిపేందుకు అన్ని చర్యలు తీసుకున్నామని చెప్పారు. జిల్లాలో ఎక్కడా గొడవలు, దాడులు జరిగే అవకాశం లేదని.. అయినప్పటికీ అలెర్ట్‌గా ఉన్నామని సీపీ పీహెచ్‌డీ రామకృష్ణ పేర్కొన్నారు.
ఇవి కూడా చదవండి....
Delhi Liquor Case: కవిత జ్యుడీషియల్ రిమాండ్‌ను జూన్3 వరకు పొడిగింపు
Devineni Uma: కంచర్లపాలెం పోలీసులు తగిన మూల్యం చెల్లించుకోక తప్పదు
Read Latest AP News AND Telugu News