Share News

CPI NS Narayana : ఇద్దరు సీఎంల భేటీ శుభపరిణామం

ABN , Publish Date - Jul 08 , 2024 | 03:08 AM

రెండు తెలుగు రాష్ర్టాల మధ్య నెలకొన్న విభజన సమస్యల పరిష్కారానికి ఏపీ సీఎం చంద్రబాబునాయుడు, తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి భేటీ కావడం శుభపరిణామమని సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ అన్నారు.

CPI NS Narayana : ఇద్దరు సీఎంల భేటీ శుభపరిణామం

  • సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ

అనంతపురం, జూలై 7(ఆంధ్రజ్యోతి): రెండు తెలుగు రాష్ర్టాల మధ్య నెలకొన్న విభజన సమస్యల పరిష్కారానికి ఏపీ సీఎం చంద్రబాబునాయుడు, తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి భేటీ కావడం శుభపరిణామమని సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ అన్నారు. అనంతపురంలోని సీపీఐ జిల్లా కార్యాలయంలో నారాయణ ఆదివారం మీడియాతో మాట్లాడారు. ఒకే వేదికపై ఇద్దరు ముఖ్యమంత్రులు రెండు రాష్ర్టాలు ఎదుర్కొంటున్న అనేక సమస్యలకు పరిష్కారమార్గాలను అన్వేషించాలన్నారు.

ఆస్తులు, అప్పులు, ఆర్థిక పురోగతి, స్వావలంబనతోనే తెలుగు రాష్ర్టాల ప్రగతికి నాంది అవుతుందని చెప్పారు. ఇక కేంద్ర ప్రభుత్వం ప్రజావ్యతిరేక విధానాలను తీసుకొస్తూ... చట్టాలు, పౌరుల హక్కులను కాలరాస్తోందని దుయ్యబట్టారు. కార్పొరేట్‌ సంస్థల కొమ్ముకాస్తూ కార్మికుల కనీస హక్కులను సైతం కాలరాస్తున్నారన్నారు. ఇదే క్రమంలో ఐఏఎస్‌, ఐపీఎ్‌సలకు చురకలంటించారు.

రాజకీయ నేతల కబంధహస్తాల్లో చిక్కుకుని ప్రజల్లో విశ్వసనీయత కోల్పోవద్దని హితవు పలికారు. రెండు తెలుగు రాష్ర్టాల్లో కొందరు ఐఏఎస్‌, ఐపీఎస్‌ అధికారులు జైల్లో ఉండే పరిస్థితిని ఎదుర్కొంటుండటం దారుణమన్నారు. కాగా, రాష్ట్ర విభజన నేపథ్యంలో ఇచ్చిన హామీల్లో భాగంగా... వెనుకబడిన ఉత్తరాంధ్ర, రాయలసీమ జిల్లాలకు బుందేల్‌ఖండ్‌ తరహా ప్యాకేజీ అమలు చేయాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ.. కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు.

Updated Date - Jul 08 , 2024 | 03:08 AM