Share News

Anantha Sriram: ఎన్నో జన్మల పుణ్యఫలం రామమందిర దర్శనం

ABN , Publish Date - Jan 22 , 2024 | 05:42 PM

ఎన్నో జన్మల పుణ్యఫలం అయోధ్య రాముని భవ్య మందిర దర్శనమని సినీ గేయ రచయిత అనంత శ్రీరామ్ ( Anantha Sriram ) తెలిపారు.

Anantha Sriram: ఎన్నో జన్మల పుణ్యఫలం రామమందిర దర్శనం

ఏలూరు జిల్లా: ఎన్నో జన్మల పుణ్యఫలం అయోధ్య రాముని భవ్య మందిర దర్శనమని సినీ గేయ రచయిత అనంత శ్రీరామ్ ( Anantha Sriram ) తెలిపారు. సోమవారం నాడు నూజివీడులో రామభక్తుల సంబురాల మహోత్సవంలో ముఖ్య అతిథిగా అనంత శ్రీరామ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ... 500 ఏళ్ల పోరాటం, వందేళ్ల న్యాయ పోరాటం, లక్షలాది రామ భక్తుల ప్రాణదానాలు, కరసేవకుల త్యాగాల ఫలితంగా రాముడికి భవ్య రామ మందిరం నిర్మించుకున్నామని తెలిపారు. ప్రభాత భానుడి కాంతులు విరజిమ్మే బాల రాముని విగ్రహా ప్రాణప్రతిష్ఠ అపురూప ఘట్టానికి రెండు కళ్లతో దర్శించుకోవడం నిజంగా మన పూర్వజన్మ సుకృతమని చెప్పారు. మతాలు, వర్ణాలు, వర్గాలకు ఆతీతంగా రాముని సేవను చేసుకోవాలని అనంత శ్రీరామ్ తెలిపారు.

Updated Date - Jan 22 , 2024 | 05:43 PM