Share News

Rajamahendravaram: ధవళేశ్వరం బ్యారేజీ గేటుకు అడ్డంగా నాటు పడవ..

ABN , Publish Date - Jul 21 , 2024 | 09:49 PM

ధవళేశ్వరం కాటన్ బ్యారేజీ(Dowleswaram Barrage) ఒకటో నంబర్ గేటు వద్ద ప్రవాహానికి అడ్డంగా నాటుపడవ ఇరుక్కుపోయింది. దీన్ని బయటకు తీసేందుకు 24 గంటలుగా అధికారులు చేసిన ప్రయత్నాలన్నీ విఫలం అయ్యాయి.

Rajamahendravaram: ధవళేశ్వరం బ్యారేజీ గేటుకు అడ్డంగా నాటు పడవ..

రాజమహేంద్రవరం: ధవళేశ్వరం కాటన్ బ్యారేజీ(Dowleswaram Barrage) ఒకటో నంబర్ గేటు వద్ద ప్రవాహానికి అడ్డంగా నాటుపడవ ఇరుక్కుపోయింది. దీన్ని బయటకు తీసేందుకు 24 గంటలుగా అధికారులు చేసిన ప్రయత్నాలన్నీ విఫలం అయ్యాయి. గత మూడ్రోజులపాటు కురిసిన భారీ వర్షాలకు పడవ కొట్టుకొచ్చింది. ఎగువ ప్రాంతాల్లో భారీ వానలకు వరద ఉద్ధృతి పెరుగుతోంది. రేపు(సోమవారం) ఒకటో ప్రమాద హెచ్చరిక స్థాయికి వరద ప్రవాహం చేరుకునే అవకాశం ఉంది.


ప్రవాహానికి నాటు పడవ అడ్డుపడడంతో బ్యారేజీ గోడను వరద నీరు వేగంగా తాకుతోంది. బోటు యజమాని నిర్లక్ష్యం వల్లే గాయిత్రి ఇసుక ర్యాంపు నుంచి పడవ కొట్టుకువచ్చినట్లు తెలుస్తోంది. గోదావరి వరద ఉద్ధృతిపై జలవనరుల శాఖ అధికారులు బోటు యజమానులకు సరైన హెచ్చరికలు జారీ చేయకపోవడం వల్లే ఇలా జరిగినట్లు మత్స్యకారులు చెప్తున్నారు.

Updated Date - Jul 21 , 2024 | 09:49 PM