Share News

Rains: ఏలేరు ప్రాజెక్టుకు పెరుగుతున్న వరద.. ముంపులో ఆ గ్రామం..

ABN , Publish Date - Sep 27 , 2024 | 09:38 PM

ఏలేరు రిజర్వాయర్ క్యాచ్ మెంట్ ఏరియాలో రెండ్రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు ఏలేరు ప్రాజెక్టుకు పెద్దఎత్తున వరదనీరు చేరుతోంది. భారీ వానలకు జలాశయానికి గంటగంటకు వరద ఉద్ధృతి పెరుగుతోందని ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ ఎం.భాస్కరరావు తెలిపారు.

Rains: ఏలేరు ప్రాజెక్టుకు పెరుగుతున్న వరద.. ముంపులో ఆ గ్రామం..

కాకినాడ: ఏలేరు రిజర్వాయర్ క్యాచ్ మెంట్ ఏరియాలో రెండ్రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు ఏలేరు ప్రాజెక్టుకు పెద్దఎత్తున వరదనీరు చేరుతోంది. భారీ వానలకు జలాశయానికి గంటగంటకు వరద ఉద్ధృతి పెరుగుతోందని ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ ఎం.భాస్కరరావు తెలిపారు. వర్షాలకు ప్రస్తుతం ఏలేరుకు 5వేల క్యూసెక్కులు వదరనీరు వస్తుండగా.. జలాశయం రెండు గేట్లు ఎత్తి దిగువకు 5,350క్యూసెక్కులు విడుదల చేస్తున్నారు. భారీగా దిగువకు నీటిని విడుదల చేయడంతో కిర్లంపూడి మండలం వేలంక గ్రామం ఎస్సీ కాలనీ ముంపునకు గురైంది. దిగువ ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరిస్తున్నారు. మరింతగా వర్షాలు కురిస్తే ఇటీవల నెలకొన్న పరిస్థితులు పునరావృతం అవుతాయనే ఆందోళనలో స్థానిక ప్రజలు ఉన్నారు. వరదనీరు ఇళ్లల్లోకి చేరడంతో వేలంక ప్రజలు బిక్కుబిక్కుమంటూ కాలం వెళ్లదీస్తున్నారు.

Updated Date - Sep 27 , 2024 | 09:38 PM