Share News

ప్రజల భాగస్వామ్యంతోనే స్వర్ణాంధ్రః2047

ABN , Publish Date - Oct 10 , 2024 | 01:43 AM

రాజమహేంద్రవరం సిటీ, అక్టోబరు9: ప్రజల భాగస్వామ్యంతోనే స్వర్ణాంధ్రః2047 ప్రణాళికలు రూపకల్పన చేయాలని రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక సినిమాటోగ్రఫీశాఖ మంత్రి కందుల దుర్గేష్‌ అన్నారు. రాజమహేంద్రవరం శ్రీవెంకటేశ్వరా ఆనం కళాకేంద్రంలో బుధవారం వికసిత్‌ భారత్‌, స్వర్ణాంధ్రః2047, 2024-25 టూ 2028-2029 జిల్లా విజన్‌ ప్లాన్‌పై ప్రముఖుల సలహాలు, సూచనలకోసం ఏర్పాటుచేసిన కార్యక్రమానికి మంత్రి ముఖ్యఅతిఽథిగా

ప్రజల భాగస్వామ్యంతోనే స్వర్ణాంధ్రః2047
స్వర్ణాంధ్ర -2047 కార్యక్రమంలో మాట్లాడుతున్న మంత్రి దుర్గేష్‌

పేదరికాన్ని పారద్రోలేలా ప్రణాళికలు సిద్ధంకావాలి

2047 ప్రణాళికతోపాటు 2024-2029

జిల్లా విజన్‌ ప్లాన్‌ కార్యక్రమంలో మంత్రి కందుల దుర్గేష్‌

రాజమహేంద్రవరం సిటీ, అక్టోబరు9: ప్రజల భాగస్వామ్యంతోనే స్వర్ణాంధ్రః2047 ప్రణాళికలు రూపకల్పన చేయాలని రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక సినిమాటోగ్రఫీశాఖ మంత్రి కందుల దుర్గేష్‌ అన్నారు. రాజమహేంద్రవరం శ్రీవెంకటేశ్వరా ఆనం కళాకేంద్రంలో బుధవారం వికసిత్‌ భారత్‌, స్వర్ణాంధ్రః2047, 2024-25 టూ 2028-2029 జిల్లా విజన్‌ ప్లాన్‌పై ప్రముఖుల సలహాలు, సూచనలకోసం ఏర్పాటుచేసిన కార్యక్రమానికి మంత్రి ముఖ్యఅతిఽథిగా హాజరయ్యారు. దీనికి మంత్రితోపాటు జిల్లా కలెక్టర్‌ పి.ప్రశాంతి, రాజమహేంద్రవరం రూరల్‌, సిటీ, రాజానగ రం ఎమ్మెల్యేలు గోరంట్ల బుచ్చయ్యచౌదరి, ఆదిరెడ్డి శ్రీనివాస్‌, బత్తుల బలరామకృష్ణ హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రి దుర్గేష్‌ మాట్లాడు తూ దేశ, రాష్ట్రస్థాయిలో ప్రణాళికలు రూపొందించేటప్పుడు క్షేత్రస్థాయి ప్రజల భాగస్వామ్యం ఎంతో అవసరమని, ఆ దిశగా వివిధ రంగాలకు సంబంధించి దేశస్థాయిలో వికసిత్‌ భారత్‌, రాష్ట్రస్థాయిలో స్వర్ణాంధ్రః 2047 రూపకల్పనకు అవసరమైన ప్రణాళికలను రూపొందించే క్రమంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలన్నారు. వికసిత్‌ భారత్‌, స్వర్ణాంధ్ర ః2047 పేరుతో నవంబరు 1న రాష్ట్రవ్యాప్తంగా విజన్‌పత్రం రూపకల్పన దిశగా క్షేత్రస్థాయిలో పరిగణలోకి తీసుకున్న అంశాలపై జిల్లా స్థా యిలో సమీక్షించి రాష్ట్రానికి పంపడం జరుగుతుందన్నారు. విజనరీ ఉన్న నాయకుడు సీఎం చంద్రబాబు అని, ఆయన విజన్‌-2020 రూపకల్పన చేసి ఉమ్మడి ఆంధ్ర రాష్ట్రాన్ని అభివృద్ధి చేశారని గుర్తుచేశారు. రాష్ట్ర డిప్యూటీ సీఎం పవన్‌కల్యాణ్‌ నేతృత్వంలో ప్రభుత్వం ఈనెల 14 నుంచి 21వ తేదీ వరకు పల్లె పండుగ కార్యక్రమాన్ని నిర్వహిస్తోందని, గత గ్రామసభల్లో క్షేత్రస్థాయిలో నిర్ణయించిన పనులను ప్రాధాన్యత క్రమంలో చేపట్టడం జరుగుతుందన్నారు. 2047నాటికి 15 శాతం వృద్ధిరేటు సాధించాలన్నారు. రానున్న ఐదేళ్లలో ఏయే అంశాలపై లక్ష్యసాధన చేయాలనేది ఇప్పటినుంచే ప్రణాళికలు సిద్ధంచేయాలన్నారు. కలెక్టర్‌ ప్రశాంతి మాట్లాడుతూ స్వర్ణాంధ్రః2047 విఽధి విధానాల మేరకు మండలస్థాయిలో కార్యక్రమాలను క్రోడీకరించుకొని జిల్లాస్థాయిలో ప్రణాళికలు రూపొందించడం జరుగుతుందన్నారు. ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్యచౌదరి మాట్లాడు తూ రాష్ట్ర అభివృద్ధికి ప్రజల సహకారం ఎంతో అవసరమన్నారు. సహజ వనరులను, మానవ వనరులను సక్రమంగా వినియోగించుకోవాలన్నా రు. సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు మాట్లాడుతూ రాష్ట్రంలో అన్ని జిల్లాలు అభివృద్ధి లక్ష్యంగా అన్ని రంగాల్లో క్షేత్రస్థాయి నుంచి జిల్లా స్థాయి వరకు ప్రతి ఒక్కరిని భాగస్వామ్యం కావాలన్నారు. ఎమ్మెల్యే బత్తుల బలరామకృష్ణ మాట్లాడుతూ విద్య, వైద్య, వ్యాపార రంగాల్లో అభివృద్ధి సాధించాలన్నారు. ఈ కార్యక్రమంలో పలువురు తమ సలహాలు ఇచ్చారు.

Updated Date - Oct 10 , 2024 | 01:43 AM