Share News

Purandeshwari: జమిలి ఎన్నికలపై మంచి ఆశతో ఉన్నాం..

ABN , Publish Date - Sep 19 , 2024 | 11:58 AM

Andhrapradesh: జమిలి ఎన్నికలపై పార్లమెంట్‌లో రాజ్యాంగ సవరణ జరగాల్సి ఉందని ఎంపీ దగ్గుబాటి పురందేశ్వరి అన్నారు. పార్లమెంటు, అసెంబ్లీ ఎన్నికల తర్వాత వంద రోజులకు స్థానిక ఎన్నికలు జరుగుతాయన్నారు. అభివృద్ధికి అవరోధం లేకుండా ఉండేందుకే జమిలి ఎన్నికలు అని స్పష్టం చేశారు.

Purandeshwari: జమిలి ఎన్నికలపై మంచి ఆశతో ఉన్నాం..
MP Daggubati Purandeshwari

రాజమండ్రి, సెప్టెంబర్ 19: దేశంలో జమిలి ఎన్నికలకు (Jamili Elections) కేంద్ర కేబినెట్ (Central Cabinet) ఆమోద ముద్ర వేసిన విషయం తెలిసిందే. ఈ పరిణామంపై ఏపీ బీజేపీ అధ్యక్షురాలు, ఎంపీ దగ్గుబాటి పురంధేశ్వరి (AP BJP president and MP Daggubati Purandheswari) స్పందించారు. గురువారం మీడియాతో మాట్లాడుతూ.. జమిలి ఎన్నికలపై పార్లమెంట్‌లో రాజ్యాంగ సవరణ జరగాల్సి ఉందన్నారు. పార్లమెంటు, అసెంబ్లీ ఎన్నికల తర్వాత వంద రోజులకు స్థానిక ఎన్నికలు జరుగుతాయని ఆమె చెప్పారు.

Kadambari Jethwani: హోంమంత్రి అనితను కలవనున్న నటి కాదంబరి జెత్వానీ.. ఎందుకంటే?



అభివృద్ధికి అవరోధం లేకుండా ఉండేందుకే జమిలి ఎన్నికలు అవసరమని ఆమె స్పష్టం చేశారు. దేశంలో ఒకేసారి ఎన్నికలు జరిగితేనే అభివృద్ధి సాధ్యమవుతుందని పురందేశ్వరి అభిప్రాయపడ్డారు. జమిలి ఎన్నికలపై మంచి ఆశతో ఉన్నామన్నారు. దేశ క్షేమాన్ని దృష్టిలో ఉంచుకొని జమిలి ఎన్నికలపై కాంగ్రెస్ ఆలోచన చేయాలన్నారు. విదేశాలకు వెళ్లి కాంగ్రెస్ దేశ గౌరవాన్ని భంగం చేస్తోందని ఈ సందర్భంగా దగ్గుబాటి పురందేశ్వరి విమర్శలు గుప్పించారు.


కేంద్ర కేబినెట్ గ్రీన్ సిగ్నల్..

కేంద్ర ప్రభుత్వం జమిలీ ఎన్నికలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. వన్ నేషన్ వన్ ఎలక్షన్‌పై మాజీ రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ నేతృత్వంలోని కమిటీ ఇచ్చిన నివేదికను కేబినెట్ నిన్న (బుధవారం) ఆమోదించింది. రానున్న శీతాకాల సమావేశాల్లో పార్లమెంటు ఉభయ సభల్లో బిల్లు ప్రవేశపెట్టనుంది. కేంద్ర సర్కార్ వన్‌ నేషన్‌ - వన్‌ ఎలక్షన్‌ ప్రతిపాదన కోసం రామ్‌నాథ్‌ కోవింద్‌‌ సహా 8 మంది సభ్యులతో కూడిన కమిటీని ఏర్పాటు చేసింది. ఇందులో లోక్‌సభ, రాష్ట్ర అసెంబ్లీలు, స్థానిక సంస్థలకు ఒకేసారి ఎన్నికలు నిర్వహించే అవకాశాలపై కమిటీ సభ్యులతో రామ్‌నాథ్ కోవింద్ చర్చించారు. ఎన్నికలకు సంబంధించి అన్ని పార్టీల అభిప్రాయాలను, రాష్ట్రాల సవాళ్లను కమిటీ పరిశీలించింది. సుదీర్ఘ చర్చోపచర్చల అనంతరం రామ్‌నాథ్‌ కోవింద్‌ కమిటీ ఇచ్చిన నివేదిక ఆధారంగా కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది.

Nandigam Suresh: హత్య కేసులో మాజీ ఎంపీ నందిగం సురేష్ పేరు


ప్రతిపక్షాల విమర్శలు..

కాగా... దేశంలో జమిలి ఎన్నికలకు కేంద్ర క్యాబినెట్‌ ఆమోదం తెలపడాన్ని కాంగ్రెస్‌, ఇతర ప్రతిపక్ష పార్టీలు తీవ్రంగా విమర్శించాయి. ఈ విధానం ఆచరణాత్మకం కాదని, రాజ్యాంగానికి, ప్రజాస్వామ్యానికి, సమాఖ్య విధానానికి వ్యతిరేకమని కాంగ్రెస్‌ అధ్యక్షుడు ఖర్గే విమర్శించారు. మోదీ ప్రభుత్వం అసలు సమస్యల నుంచి ప్రజల దృష్టిని మరల్చడానికి ప్రయత్నిస్తోందని మండిపడ్డారు. జమిలి విధానాన్ని దేశం అంగీకరించబోదని పేర్కొన్నారు. ‘ఒక దేశం.. ఒకేసారి ఎన్నికలు’ అంశం బీజేపీ మరో చౌకబారు ఎత్తుగడ అని టీఎంసీ ఎంపీ డెరెక్‌ ఒబ్రెయిన్‌ విమర్శించారు.


ఇవి కూడా చదవండి...

Waqf Amendment Bill: నేడు వక్ఫ్ సవరణ బిల్లుపై జేపీసీ భేటీ.. త్వరలో పార్లమెంటులో బిల్లు ఆమోదం!

CM Chandrababu: నేడు ఏయే శాఖలపై సీఎం చంద్రబాబు సమీక్ష చేయనున్నారంటే..

Read LatestAP NewsAndTelugu News

Updated Date - Sep 19 , 2024 | 12:19 PM