Loksabha Elections: సార్వత్రిక ఎన్నికల్లో ఇవాళ కీలక ఘట్టం
ABN , Publish Date - Apr 18 , 2024 | 07:28 AM
సార్వత్రిక ఎన్నికల్లో ఇవాళ కీలక ఘట్టం చోటు చేసుకోనుంది. కాసేపట్లో ఎన్నికల నోటిఫికేషన్ జారీ కానుంది. నోటిఫికేషన్ జారీ తర్వాత నామినేషన్ల ప్రక్రియ ప్రారంభం కానుంది. ఈ నెల 25 వరకూ నామినేషన్ల స్వీకరణ కార్యక్రమం ఉండనుంది. సెలవు దినాలు మినహా మిగిలిన రోజుల్లో ఉదయం 11 నుంచి నామినేషన్లను అధికారులు స్వీకరిస్తారు.
అమరావతి: సార్వత్రిక ఎన్నికల్లో (Loksabha Polls) ఇవాళ కీలక ఘట్టం చోటు చేసుకోనుంది. కాసేపట్లో ఎన్నికల నోటిఫికేషన్ (Election Notification) జారీ కానుంది. నోటిఫికేషన్ జారీ తర్వాత నామినేషన్ల ప్రక్రియ ప్రారంభం కానుంది. ఈ నెల 25 వరకూ నామినేషన్ల స్వీకరణ కార్యక్రమం ఉండనుంది. సెలవు దినాలు మినహా మిగిలిన రోజుల్లో ఉదయం 11 నుంచి నామినేషన్లను అధికారులు స్వీకరిస్తారు. పార్లమెంట్ స్థానాలకు కలెక్టరేట్‌లలో, అసెంబ్లీ స్థానాలకు ఆయా నియోజకవర్గ ప్రధాన కేంద్రాల్లో నామినేషన్ల (Nominations) స్వీకరణ కార్యక్రమం ఉంటుంది.
ధనుంజయ్.. ఫటాఫట్ సెటిల్‌మెంట్!
నామినేషన్ వేసే అభ్యర్థితో పాటు మరో నలుగురికి మాత్రమే ఆర్వో కార్యాలయం లోపలికి అనుమతి ఇవ్వనున్నారు. నామినేషన్ వేసే అభ్యర్థుల ఊరేగింపుతో పాటు దాఖలు చేసే ప్రాంతంలో పూర్తిగా అధికారులు వీడియో రికార్డింగ్ చేయనున్నారు. అన్ని అసెంబ్లీ నియోజకవర్గాలలో హెల్ప్ డెస్క్ లు ఏర్పాటు చేయడం జరిగింది. రేపు, ఈనెల 22, 25 తేదీలు మంచి రోజులు కావడంతో ఎక్కువ నామినేషన్‌లు వేసే అవకాశం ఉంది. ఇప్పటికే ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులంతా ప్రచారంలో దూసుకెళుతున్నారు. ఎన్నికల షెడ్యూల్‌కు ముందు నుంచే ప్రచారం ప్రారంభమైంది.