-
-
Home » Andhra Pradesh » Elections » Chandrababu and Pawan Kalyan Election campaign in joint West Godavari district Live Updates vrv
-
Chandrababu-Pawan: మా ప్రభుత్వం వచ్చాక తాట తీస్తాం.. వైసీపీకి బాబు, పవన్ స్ట్రాంగ్ వార్నింగ్
ABN , First Publish Date - Apr 10 , 2024 | 06:35 PM
ఏపీలోని ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో ఎన్నికల ప్రచారం ఊపందుకుంది. ఉమ్మడిగా తణుకులో నిర్వహించిన బహిరంగ సభకు తెలుగుదేశం అధినేత చంద్రబాబు, జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ హాజరయ్యారు. ఈ క్రమంలో జగన్ ప్రభుత్వంపై ఇరువురు నేతలు ఘాటు విమర్శలు చేశారు.
Live News & Update
-
2024-04-10T22:00:24+05:30
వాలంటీర్లు రాజకీయాలకు దూరంగా ఉండాలి
వాలంటీర్లు రాజకీయం చేయవద్దు.. ప్రజా సేవ చేయండి
రాజకీయం చేస్తే ఇబ్బందుల్లో పడతారు
వాలంటీర్లు అయిదు వేలు కావాలా.. పదివేలు కావాలా తేల్చుకోవాలి
నిన్నటివరకు వాలంటీర్లు తన పక్షం అనుకున్నాడు
ఇప్పుడు వారు మా వైపు వచ్చారు.. లేదా తటస్థంగా ఉన్నారు
నిడదవోలులో ప్రజాగళం సభలో చంద్రబాబు
-
2024-04-10T22:00:15+05:30
నిడదవోలులో ముగిసిన ప్రజాగళం సభ
వైసీపీ ప్రభుత్వంపై ఘాటు విమర్శలు చేసిన బాబు, పవన్
వైసీపీని ఓడించి అధికారంలోకి వస్తామని ధీమా
అధికారంలోకి వచ్చిన వెంటనే ఇచ్చిన హామీలన్నీ నెరవేరుస్తామన్న ఇద్దరు నేతలు
-
2024-04-10T21:45:55+05:30
సంక్షేమ కార్యక్రమాలు కొనసాగిస్తాం
జగన్ సింగిల్‌గా వస్తున్నాడంటున్నాడు
అతను సింగిల్‌గా రావడం లేదు.. ఆయన శవాలతో వస్తున్నాడు
జగన్ పాలన నచ్చక వైసీపీ ఎమ్మెల్సీలు రాజీనామా చేసి మా దగ్గరకు వస్తున్నారు
నేను, పవన్ అన్యోన్యంగా ఉన్నాం
జగన్ కుల రాజకీయాలు చేస్తున్నాడు
అదే సమయంలో మత రాజకీయాలు చేస్తున్నామంటున్నాడు
మత రాజకీయాల జోలికి జగన్ వస్తే, గట్టిగా జవాబు చెప్పాల్సి వస్తుంది
జగన్ రెడ్డి పెట్టిన సంక్షేమ కార్యక్రమాలు ఆగిపోవు
ఇంకా మెరుగైన రీతిలో అమలుచేస్తాం
నిడదవోలులో చంద్రబాబు కామెంట్లు
-
2024-04-10T21:45:41+05:30
జగన్ వల్ల వెంటిలేటర్‌పై ఏపీ
జగన్ చేసిన అప్పులకు, విధ్వంసానికి రాష్ట్రం వెంటిలేటర్‌పై ఉండాల్సి వచ్చింది.
రాష్ట్రంలో గాడి తప్పిన పరిపాలనను దారిలో పెట్టే శక్తి, యుక్తి ఎన్‌డీఏకు ఉంది
జగన్ గొడ్డలి వేటుకు బలి కానివారు ఎవరూ లేరు
జాబ్ రావాలంటే మేము రావాలి, కూటమి రావాలి
ఎస్సీలు ఆలోచించుకోవాలి..
జగన్ మళ్ళీ వస్తే అందరిని చంపి, డోర్ డెలివరీ చేస్తారు
నిడదవోలులో చంద్రబాబు కామెంట్లు
-
2024-04-10T21:45:15+05:30
పవన్‌పై చంద్రబాబు ప్రశంసలు
మడమ తిప్ఫని నాయకుడు పవన్ కళ్యాణ్
ఎన్ని ఆటుపోట్లు సృష్టించినా గట్టిగా నిలబడిన నాయకుడు పవన్ కళ్యాణ్
నిడదవోలులో టీడీపీ గుర్తులేదు
అసెంబ్లీ అభ్యర్థిగా జనసేన, ఎంపీ అభ్యర్థిగా బీజేపీలు పోటీ పడుతున్నాయి
అదే పరిస్థితి కొన్నిచోట్ల బీజేపీ, జనసేనలకు ఉంది
-
2024-04-10T21:30:47+05:30
జగన్ కుల, మత రాజకీయాలు చేస్తున్నాడు
జగన్ రెడ్డి కుల రాజకీయాలు చేస్తున్నాడు
కులాల మధ్య చిచ్చు పెట్టే ప్రయత్నం చేస్తున్నాడు
అలాగే మత రాజకీయాలు చేస్తున్నాడు
మత రాజకీయాలు చేస్తే జగన్ అడ్రస్ గల్లంతు అవుతుందని హెచ్చరిస్తున్నా
అలాగే ప్రాంతాల మధ్య చిచ్చు పెట్టి రాజకీయాలు చేస్తున్నాడు
నిడదవోలు ప్రజాగళం సభలో చంద్రబాబు
-
2024-04-10T21:30:46+05:30
మా కాంబినేషన్ సూపర్ హిట్
మొదటిసారిగా మూడు పార్టీల అధ్యక్షులం ఇక్కడ మాట్లాడుతున్నాం
మూడు పార్టీల తరపున సింహగర్జన చేస్తున్నాం
నిడదవోలు దద్దరిల్లిపోయింది
జగన్‌కు ఇక నిద్ర పట్టదు
జగన్‌ను ఇంటికి పంపడానికి సిద్ధమా
జగన్ సిద్ధం సిద్ధం అంటూ ఎక్కడో తిరుగుతున్నాడు
అతన్ని ఓడించడానికి మీరు సిద్ధమా
మా మూడు పార్టీల కాంబినేషన్ సూపర్ హిట్
నిడదవోలులో చంద్రబాబు కామెంట్లు
-
2024-04-10T21:30:25+05:30
బాగుపడ్డది వాళ్లు మాత్రమే
ఈ రాష్ట్రంలో బాగుపడ్డది ఒక జగన్ మాత్రమే
ఈ రాష్ట్రాన్ని ఈ నలుగురే పరిపాలిస్తున్నారు
వారు సాయిరెడ్డి, సుబ్బారెడ్డి, సజ్జల, పెద్దిరెడ్డి
వీరు మాత్రమే రాష్ట్రంలో బాగుపడ్డారు
నిడదవోలు ప్రజాగళం సభలో చంద్రబాబు
-
2024-04-10T21:30:01+05:30
సీనియర్ ఎన్టీఆర్‌పై చంద్రబాబు ప్రశంసలు
సంక్షేమ పథకాలకు ఆద్యుడు ఎన్టీఆర్
అన్నివర్గాలకు సంక్షేమ ఫలాలు అందించిన నేత ఎన్టీఆర్
మెరుగైన సంక్షేమ ఫలాలు అందించే బాధ్యత నాది
నిడదవోలు ప్రజాగళం సభలో చంద్రబాబు
-
2024-04-10T21:15:18+05:30
వైసీపీ ప్రభుత్వంపై పవన్ ఘాటు విమర్శలు
రాష్ట్రాన్ని అయిదుగురు తమ గుప్పెట్లో పెట్టుకుని బెదిరిస్తున్నారు
చంద్రబాబు సంస్థాగత నిర్మాణం ఉన్నా..
సైజు తగ్గించుకుని.. మేము కలిసి పోటీ చేస్తున్నాం
రౌడీ రాజ్యం పోవాలంటే సమిష్టిగా పోరాడక తప్పదు
నిడదవోలులో పవన్ కళ్యాణ్ కామెంట్లు
-
2024-04-10T21:15:06+05:30
నిడదవోలుకు పవన్ హామీలు
అధికారంలోకి వచ్చిన వెంటనే నిడదవోలు సమస్యలు వెంటనే పరిష్కరిస్తాం
జగన్ పాలనలో నిడదవోలు నియోజకవర్గంలో గుంతలమయంగా మారాయి
అధికారంలోకి వచ్చిన మూడు నెలల్లోనే రోడ్లను నిర్మిస్తాం
ఒక్క వైసీపీ మంత్రి సమస్యల గురించి మాట్లాడరు
ఏమైనా అంటే నన్ను, చంద్రబాబుని, పురందేశ్వరిని వ్యక్తిగతంగా విమర్శిస్తారు
వచ్చేది బలమైన ప్రభుత్వం
బూతులు తిట్టిన వైసీపీ నాయకుల తాట తీసి కూర్చోబెడతాం
-
2024-04-10T21:15:04+05:30
వైసీపీ తాట తీస్తా
మా ప్రభుత్వం వచ్చాక తాట తీస్తా
వైసీపీకి పవన్ కళ్యాణ్ స్ట్రాంగ్ వార్నింగ్
ఎదురించేవాడు లేకపోతే బెదరించేవాడిదే రాష్ట్రం
రౌడీ రాజ్యం పోవాలి.. రామ రాజ్యం రావాలి
మా ఆశలను పక్కన పెట్టి ప్రజాకాంక్షల కోసమే పొత్తు
నిడదవోలు ప్రజాగళం సభలో పవన్ కళ్యాణ్
-
2024-04-10T21:00:12+05:30
నిడదవోలులో ప్రారంభమైన బాబు- పవన్ సభ
భారీగా తరలివచ్చిన టీడీపీ-జనసేన కార్యకర్తలు
సభలో పాల్గొన్న ఏపీ బీజేపీ అధ్యక్షురాలు పురందేశ్వరి
తొలిసారిగా ఒకే వేదికపై నుంచి ప్రసంగించనున్న ముగ్గురు నేతలు
-
2024-04-10T21:00:11+05:30
రాష్ట్రాన్ని అనేక మార్లు ప్రకృతి వైపరీత్యాలు కుదిపేసాయి
అన్నిటి కన్నా వైసీపీ వైపరీత్యాం ప్రమాదకరమైనది
ఒకప్పుడు అభివృద్ధి పథంలో ఉండే రాష్ట్రం ఇప్పుడు అప్పుల ఊబిలో కూరుకుపోయింది
రాజధాని లేని రాష్ట్రంగా మిగిలిపోయింది
రాష్ట్రంలో ఏ వర్గానికి జగన్ పాలనలో మేలు జరగలేదు
ఖచ్చితంగా రాష్ట్రానికి మార్పు అవసరం
మే 13వ తేదీన మన సత్తా వైసీపీకి చూపించాలి
నిడదవోలు సభలో పురందేశ్వరి వ్యాఖ్యలు
-
2024-04-10T19:30:16+05:30
ముగిసిన తణుకు బహిరంగసభ
భారీగా తరలివచ్చిన టీడీపీ, జనసేన కార్యకర్తలు
వైసీపీ ప్రభుత్వంపై నిప్పులు చెరిగిన బాబు, పవన్
మరికాసేసట్లో నిడదవోలులో జరిగే బహిరంగ సభలో పాల్గొననున్న బాబు, పవన్
-
2024-04-10T19:15:49+05:30
అందరూ డబ్బున్న వారి గురించి,
పేదల గురించి మాట్లాడుతున్నారు..
అదే సమయంలో మధ్య తరగతి వారి గురించి ఆలోచించాలి..
వారి బాధలు నాకు తెలుసు
ఉద్యోగుల సీపీయస్ సమస్య పరిష్కారం కష్టమని నాకు తెలుసు..
కానీ అధికారంలోకి వచ్చిన ఏడాదిలో ఆ సమస్యకు ఒక పరిష్కారం ఆలోచిస్తాం
తణుకు సభలో పవన్ కళ్యాణ్
-
2024-04-10T19:00:47+05:30
వైసీపీ ప్రభుత్వంపై పవన్ ఘాటు విమర్శలు
వైసీపీ పాలనలో తణుకు అవినీతి నేలగా మారిపోయింది
పంటకు మొలకలు వస్తున్నాయని రైతులు అంటే,
వారిని చీత్కారంగా మాట్లాడిన మంత్రి కారుమూరి
అన్నం పెట్టిన రైతును ఏడిపించిన మంత్రి,
అతని కొడుకు ఈ ఎన్నికల్లో తుడిచిపెట్టుకుపోవాలి
పోలవరం ప్రాజెక్టు గురించి అడిగితే ఇరిగేషన్ మంత్రి డ్యాన్సులు చేస్తాడు
బూతులు తిట్టే మంత్రి, డ్యాన్సులు చేసే మంత్రి వైసీపీలో ఉన్నారు
తణుకు సభలో పవన్ కళ్యాణ్
-
2024-04-10T19:00:43+05:30
ఎన్నికలు జరుగుతున్నాయి కాబట్టే
నేను, పవన్ కళ్యాణ్ స్వేచ్ఛగా తిరగగలుగుతున్నాం
అయిదేళ్ల పాలనలో మమ్మల్ని ఎన్ని ఇబ్భందులు పెట్టాడో అందరికీ తెలుసు
వచ్చేనెల 13వ తేదీన మీరు ఇచ్చే తీర్పుతో తాడేపల్లి జగన్ కోట బద్దలుకావాలి
ఆయన పాలన అంతం కావాలి
జగన్ రెడ్డి ఫేక్ ఫెలో
ఎన్నికల ముందు ఆయన ఎవరినైనా కలిసాడా.. పరదాల చాటునే వెళ్ళాడు
జగన్ వస్తున్నాడంటే పారిశ్రామిక వేత్తలు పారిపోతారు..
నేను వస్తున్నానంటే, పారిశ్రామిక వేత్తలు వస్తారు
తణుకు బహిరంగ సభలో చంద్రబాబు
-
2024-04-10T19:00:42+05:30
నేను అందుకే తగ్గాను
నేను చాలా వరకు తగ్గాను
ఆంధ్రప్రదేశ్ బాగుపడాలనే నేను తగ్గాల్సి వచ్చింది
టికెట్ల కేటాయింపులో ఎందుకు తగ్గానంటే
రాష్ట్రాన్ని బాగు చేసే అనుభవశాలి కావాలనే
నా నోటి నుంచి పలికే అర్హత లేదు ఇక్కడ మంత్రికి
ఎంత అహంకారం.. ఎంత పొగరు ఇక్కడ మంత్రికి
అతన్ని తణుకు గోస్తనీ నదిలో కలిపేయాలి
తణుకు సభలో పవన్ కళ్యాణ్
-
2024-04-10T19:00:06+05:30
వాలంటీర్లు కంగారు పడొద్దు
వాలంటీర్లు మీరు కంగారు పడవద్దు.. ఆ వ్యవస్థ కొనసాగుతుంది
వాలంటీర్లు రాజీనామాలు చేయవద్దు.. మీకు అండగా ఉంటాం.
అవసరమయితే పది వేలు కాదు..
లక్ష రూపాయలు సంపాదించే మార్గం చూపిస్తా
కారుమూరి మామూలోడు కాదు..
ముదురు.. మహా ముదురు..
840 కోట్ల టీడీ ఆర్ బాండ్లు పేరుతో దోచుకున్నాడు
తణుకులో జనసేన కార్యకర్తలపై దాడి చేసారు
అదే పవన్ కళ్యాణ్ కన్నెర్ర చేస్తే, ఆయన ఎక్కడ ఉంటాడో తెలీదు
ధాన్యం తడిసిపోయిందని రైతులు అంటే ఎర్రిపప్పా అంటాడు
ఆ ఎర్రిపప్ప మంత్రికి రైతులు బుద్ది చెప్పాలి
తణుకు బహిరంగ సభలో చంద్రబాబు
-
2024-04-10T19:00:01+05:30
జగన్ పాలన పోవాలనే టికెట్ల కేటాయింపులో కొన్ని త్యాగాలు చేశాం
అనకాపల్లి టికెట్‌ను మా అన్నయ్య నాగబాబు త్యాగం చేశారు
జగన్ మాట్లాడితే క్లాస్ వార్ అని మాట్లాడతాడు
క్లాస్ వార్ అంటే, డబ్బున్న వారు పేదవారిని దోచుకోవడం
ఇక్కడ దోచుకున్న డబ్భుతో మంత్రి కారుమూరి హైదరాబాద్ బాలా నగర్ లో ఫ్యాక్థరీలు పెట్టాడు
తణుకు సభలో పవన్ కళ్యాణ్
-
2024-04-10T18:45:41+05:30
మేము వచ్చిన వెంటనే మెగా డీఎస్సీ ఫైలుపై మొదటి సంతకం పెడతాం
పేదల ఆస్తులు దొంగిలించిన ఏకైక నాయకుడు జగన్
జగన్ అయిదేళ్ల కాలంలో అప్పులు పెరిగాయి..
ఏ ఒక్కరు బాగుపడలేదు.. జగన్ మాత్రం బాగుపడ్డాడు
అధికారం అంటే దోచుకోవడమే అని జగన్ అనుకున్నాడు
తణుకు బహిరంగ సభలో చంద్రబాబు
-
2024-04-10T18:45:25+05:30
నాకు అనుభవం ఉంది.. పవన్ కళ్యాణ్ కు పవర్ ఉంది.
మన రాష్ట్రంలో అగ్నికి వాయువు తోడైంది.
రాష్ట్రానికి ఇక అన్ని మంచి రోజులే
రాష్ట్రాన్ని కాపాడుకోవడానికి మూడు పార్టీలు కలిసాయి.
జెండాలు వేరయినా.. అజెండా ఒక్కటే.. జగన్ ను భూస్థాపితం చేయడమే
ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లాలోని తణుకులో ఎన్డీఏ ఎన్నికల ప్రచారం
-
2024-04-10T18:45:01+05:30
జగన్ పై చంద్రబాబు ఘాటు విమర్శలు
జగన్ ముద్దులు పెట్టాడు.. హగ్గులిచ్చాడు..
ఇప్పుడు గుద్దులే గుద్దులు.. పిడి గుద్ధులు
ప్రతి ఇల్లు, ప్రతీ పౌరుడిని అడుగుతున్నా
అభివృద్ధి కావాలా సంక్షోభం కావాలా
దగా పథకాలు కావాలా.. దోపిడి లేని పథకాలు కావాలో మహిళలు ఆలోచించాలి
దళితులకు ఇన్నోవాలు ఇచ్చా, వారిని పారిశ్రామిక వేత్తలుగా తీర్చిదిద్దా
ఇక్కడ ఉన్న మంత్రి గోనెసంచులు ఇవ్వలేని పౌరసరఫరాల మంత్రి
తణుకు బహిరంగ సభలో చంద్రబాబు
-
2024-04-10T18:45:00+05:30
ఆ మాట చెప్పిన మొదటి వ్యక్తి చంద్రబాబు
చీకటి పాలనను అంతం చేయడానికి ఓట్లు చీలకూడదని చెప్పిన మొదటి వ్యక్తి పవన్ కళ్యాణ్
యువత కన్నెర్ర చేస్తే జగన్ లండన్‌కు పారిపోతాడు.
జగన్ చేతిలో చిప్ప పట్టుకుని ఎక్కడికి పోతాడో ఇప్పుడే చెప్పను.. పవన్ కళ్యాణ్, నేను చేసి చూపిస్తాం.
2014 నుంచి 2019 వరకు ఏం జరిగిందో అర్థం చేసుకోండి
ఇప్పుడు ఏం జరుగుతుందో తెలుసుకోండి
తణుకు బహిరంగ సభలో చంద్రబాబు