AP News: టీడీపీలో చేరనున్న కరోనా మందు ఆనందయ్య
ABN , Publish Date - Apr 06 , 2024 | 11:33 AM
Andhrapradesh: కరోనా విపత్కర పరిస్థితుల్లో కరోనా మందును పంపిణీ చేసి లక్షలాది మంది ప్రాణాలు కాపాడిన డాక్టర్ ఆనందయ్య రాజకీయాల్లోకి అడుగుపెట్టనున్నారు. ఆయన టీడీపీ పార్టీలో చేరేందుకు సిద్ధమయ్యారు. అందులో భాగంగా కాసేపటి క్రితమే టీడీపీ అధినేత చంద్రబాబును కలిసేందుకు డాక్టర్ ఆనందయ్య జిల్లాకు వచ్చారు.
పశ్చిమగోదావరి, ఏప్రిల్ 6: కరోనా విపత్కర పరిస్థితుల్లో కరోనా మందును పంపిణీ చేసి లక్షలాది మంది ప్రాణాలు కాపాడిన డాక్టర్ ఆనందయ్య (Krishnapatnam Doctor Anandayya) రాజకీయాల్లోకి అడుగుపెట్టనున్నారు. ఆయన టీడీపీ పార్టీలో (TDP) చేరేందుకు సిద్ధమయ్యారు. అందులో భాగంగా కాసేపటి క్రితమే టీడీపీ అధినేత చంద్రబాబును (TDP Chief Chandrababu Naidu) కలిసేందుకు డాక్టర్ ఆనందయ్య జిల్లాకు వచ్చారు. టీడీపీ అధినేత సమక్షంలో ఆయుర్వేదం పారంపర్య సంఘం ప్రతినిధులు తెలుగుదేశం కండువా కప్పుకోనున్నారు.
Pawan Kalyan: పవన్ కోసం ఇల్లు సిద్ధం.. ఎక్కడంటే..
ఆనందయ్య నేపథ్యం ఇదీ...
కాగా.. డాక్టర్ ఆనందయ్య పేరు ఏపీ ప్రజలకు సుపరిచితమే. కరోనా సెకండ్ వేవ్‌లో ఆయన తయారు చేసిన మందు ఎలాంటి ఫలితాలనిచ్చిందో తెలిసిందే. నెల్లూరు జిల్లా కృష్ణపట్నంకు చెందిన బొణిగి ఆనందయ్య.. కరోనా నివారణకు వన మూలికలతో మందును తయారు చేశారు. కరోనా విపత్కర పరిస్థితుల్లో ఆనందయ్య మందు ఎంతోమందిలో ఆశలు కల్పించిందనడంలో సందేహంలేదు. ఆనందయ్య మందు కోసం పెద్ద సంఖ్యలో కరోనా రోగులు తరలివచ్చారు కూడా. అయితే ఈ మందుపై శాస్త్రీయ అధ్యయనం అవసరమంటూ పంపిణీని కొన్నిరోజుల పాటు నిలిపివేసిన ఏపీ ప్రభుత్వం.. ఆ తరువాత మందు పంపిణీకి అనుమతినిచ్చింది. అయితే కరోనా మందు కోసం జనం పోటెత్తడంతో కృష్ణపట్నం పరిసర ప్రాంతాల్లో కోవిడ్ కేసులు భారీగా నమోదు అయ్యాయి. దీంతో కృష్ణపట్నం ఎవరూ రావొద్దంటూ నేరుగా ఆయా జిల్లాలకే మందు పంపిణీ జరిగేలా చూశారు ఆనందయ్య. అయితే కరోనా వ్యాధింని తగ్గించేది కానప్పటికీ దాని వల్ల ఎలాంటి దుష్ట్రభావాలు లేకపోవడంతో ఆనందయ్య మందును పంపిణీ చేసేందుకు ప్రభుత్వం కూడా ముందుకు వచ్చింది.
ఇవి కూడా చదవండి...
AP Politics: ఎన్నికల వేళ జగన్‌కు నాన్‌స్టాప్ షాక్‌లే.. వైసీపీ నుంచి ఎమ్మెల్యే జంప్..!
మాస్టర్ ప్లాన్.. పాక్ ఉగ్రవాదులపై ‘రా’ గురి!
మరిన్ని ఏపీ వార్తల కోసం...