Share News

AP Elections: స్ట్రాంగ్ రూమ్‌లను పరిశీలించిన కలెక్టర్ ఢిల్లీరావు

ABN , Publish Date - May 14 , 2024 | 01:31 PM

Andhrapradesh: జిల్లాలోని విజయవాడ పార్లమెంటు , ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల ఈవీఎంలను అధికారులు స్ట్రాంగ్ రూమ్‌లోకి తరలించారు. ఈ సందర్భంగా నోవా, నిమ్రా కాలేజీల్లో ఉన్న స్ట్రాంగ్ రూమ్‌లను కలెక్టర్ ఢిల్లీరావు పరిశీలించారు. అనంతరం కలెక్టర్ మీడియాతో మాట్లాడుతూ.. 27 స్ట్రాంగ్ రూంలు 4 బిల్డింగులలో ఏర్పాటు చేశామన్నారు. అన్ని నియోజకవర్గాల స్ట్రాంగ్ రూమ్‌లకు సీల్ వేయడం జరుగుతుందన్నారు.

AP Elections: స్ట్రాంగ్ రూమ్‌లను పరిశీలించిన కలెక్టర్ ఢిల్లీరావు
Collector Delhi Rao inspected the strong rooms

ఎన్టీఆర్ జిల్లా, మే 14: జిల్లాలోని విజయవాడ పార్లమెంటు , ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల ఈవీఎంలను అధికారులు స్ట్రాంగ్ రూమ్‌లోకి తరలించారు. నోవా, నిమ్రా కాలేజీల్లో ఉన్న స్ట్రాంగ్ రూమ్‌లను (Strong Room) కలెక్టర్ ఢిల్లీరావు (Collector Dellhi Rao) మంగళవారం పరిశీలించారు. అనంతరం కలెక్టర్ మీడియాతో మాట్లాడుతూ.. 27 స్ట్రాంగ్ రూంలు 4 బిల్డింగులలో ఏర్పాటు చేశామన్నారు. అన్ని నియోజకవర్గాల స్ట్రాంగ్ రూమ్‌లకు సీల్ వేయడం జరుగుతుందన్నారు. వెంటిలేటర్లు, విండోలు అన్నీ సీల్ చేసినట్లు తెలిపారు. రెండు లాక్‌లు ఉంటాయని‌.. ఒక లాక్ కలెక్టర్ ప్రతినిధి వద్ద, ఒక లాక్ ఆర్‌ఓ వద్ద ఉంటాయన్నారు. సెంట్రల్ ఆర్ముడ్ పోలీస్ ఫోర్స్, స్టేట్ పోలీస్ ఫోర్స్ కంట్రోల్ భద్రతలో ఉంటుందని చెప్పారు.

Indigo Flight: శంషాబాద్‌ ఎయిర్‌పోర్టులో నిలిచిన ఇండిగో విమానం...


ప్రతీరోజూ ఇద్దరు ఎంఆర్ఓలు, రిటర్నింగ్ అధికారులు పర్యవేక్షిస్తారన్నారు. అన్నిరకాల ఫైర్ సేఫ్టీ జాగ్రత్తలు తీసుకున్నామని తెలిపారు. పోలింగ్ (AP Elections 2024) 80.11% వరకూ వచ్చిందని అంచనా వేశామన్నారు. జగ్గయ్యపేటలో 90% దగ్గరలో పోలింగ్ జరిగినట్టు తెలిసిందన్నారు. పోలింగ్ ప్రశాంతంగా ముగిసేలా ప్రజలు సహకరించారన్నారు. జూన్ 4న కౌంటింగ్‌కు ఎటువంటి ఇబ్బంది లేకుండా అన్ని రకాల చర్యలు తీసుకుంటామని కలెక్టర్ ఢిల్లీ రావు వెల్లడించారు.


ఇవి కూడా చదవండి...

AP Elections 2024: కూటమికే పట్టం..!! చంద్రబాబు ధీమా

Loksabha Elections 2024: ముచ్చటగా మూడోసారి అక్కడి నుంచి బరిలోకి..

Read Latest AP News And Telugu News

Updated Date - May 14 , 2024 | 01:47 PM