Fact Check: ఏబీఎన్ న్యూస్ పేరుతో నకిలీ ట్విట్టర్ ఖాతా
ABN , Publish Date - Apr 26 , 2024 | 06:21 PM
ప్రజలకు నిరంతరం వార్తా సమాచారాన్ని అందించే ఎబిఎన్ ఆంధ్రజ్యోతి.. ట్విట్టర్ ఖాతా ద్వారా ఎప్పటికప్పుడు తాజా వార్తలను ప్రజలకు అందిస్తోంది. @abntelugutv ఐడి ద్వారా ఎబిఎన్ వాస్తవ ట్విట్టర్ ఖాతా పనిచేస్తోంది. ఇది వెరిఫైడ్ అకౌంట్ బ్లూటిక్ కలిగి ఉంటుంది. కేవలం బ్లూటిక్ కలిగిన ఎబిఎన్ తెలుగు టీవీ ట్వి్ట్టర్ అకౌంట్‌లో పోస్ట్ చేసే వార్తా సమాచారం మాత్రమే అధికారికమైనదిగా గమనించాలి. @ABNNewsLive పేరుతో ఉన్న ట్విట్టర్ ఖాతాకు ఆంధ్రజ్యోతి యాజమాన్యానికి ఎటువంటి సంబంధం లేదు.
ప్రజలకు నిరంతరం వార్తా సమాచారాన్ని అందించే ఎబిఎన్ ఆంధ్రజ్యోతి.. ట్విట్టర్ ఖాతా ద్వారా ఎప్పటికప్పుడు తాజా వార్తలను ప్రజలకు అందిస్తోంది. @abntelugutv ఐడి ద్వారా ఎబిఎన్ వాస్తవ ట్విట్టర్ ఖాతా పనిచేస్తోంది. ఇది వెరిఫైడ్ అకౌంట్ బ్లూటిక్ కలిగి ఉంటుంది. కేవలం బ్లూటిక్ కలిగిన ఎబిఎన్ తెలుగు టీవీ ట్విట్టర్ అకౌంట్‌లో పోస్ట్ చేసే వార్తా సమాచారం మాత్రమే అధికారికమైనదిగా గమనించాలి.
@ABNNewsLive పేరుతో ఉన్న ట్విట్టర్ ఖాతాకు ఆంధ్రజ్యోతి యాజమాన్యానికి ఎటువంటి సంబంధం లేదు. ఎబిఎన్ న్యూస్ లైవ్ పేరుతో ఉన్న ట్విట్టర్ ఖాతా నకిలీది. ఈ ఐడి ద్వారా పోస్టు చేసే వార్తలతో ఎబిఎన్‌కు ఎలాంటి సంబంధం లేదు. అందులో పోస్టు చేసే కంటెంట్‌తో ఎబిఎన్ యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. కొంతమంది ప్రజలను తప్పుదారి పట్టించేందుకు, ఛానల్ విశ్వసనీయతను దెబ్బతీసేందుకు చేస్తున్న చర్యలుగానే భావించాల్సి ఉంటుంది. ఈ ఐడి ద్వారా తప్పుడు వార్తలను, సమాచారాన్ని పోస్టు చేస్తున్నారు.
AP Election 2024: చంద్రబాబు భార్య భువనేశ్వరి టార్గెట్‌గా ‘డీప్ ఫేక్’ ప్రచారం.. విషయం ఏంటంటే?
బరి తెగింపు
ప్రస్తుతం ఎన్నికల సమయం కావడంతో ప్రజలను తప్పుదోవ పట్టించేందుకు కొందరు దిగజారి ప్రవర్తిస్తున్నారు. సోషల్ మీడియా యుగంలో ప్రజలు సామాజిక మాద్యమాల్లో వస్తున్న వార్తలను చూసి వాటిని ఇతరులకు ఫార్వర్డ్ చేస్తున్న పరిస్థితుల్లో ఇలాంటి తప్పుడు వార్తలతో ప్రజలను తప్పుదోవ పట్టించేందుకు కొందరు ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది. ఇలా ఫేక్ అకౌంట్లతో తప్పుడు సమాచారాన్ని వ్యాప్తి చేయడం వెనుక ప్రధానంగా ఓ రాజకీయ పార్టీకి చెందిన నేతల ప్రమేయం ఉన్నట్లు తెలుస్తోంది.
ప్రజల్లో ఎబిఎన్ ఛానల్ ఇమేజ్‌ను తక్కువ చేసి చూపించేందుకు, ఒక తప్పుడు వార్తను నిజమని నమ్మించేందుకు ఫేక్ ఐడిలతో కొందరు దిగజారి ప్రవర్తిస్తున్నట్లు ఇలాంటి చర్యలు స్పష్టం చేస్తున్నాయి. ట్విట్టర్‌లో ఎబిఎన్ వార్తలను ఫాలో అయ్యేవాళ్లు @abntelugutv పేరుతో ఉన్న ట్విట్టర్ ఖాతాను మాత్రమే అనుసరించాలని కోరుచున్నాము. వెరిఫైడ్ అకౌంట్ కాకుండా ఎబిఎన్ పేరుతో ఇతర ఫేక్ ఖాతాల నుంచి వస్తున్న వార్తా సమాచారంతో ఎబిఎన్‌కు ఎలాంటి సంబంధం లేదు.
ఎబిఎన్ విశ్వసనీయతను దెబ్బతీసే కుట్రలో భాగంగా నకిలీ ఐడీల ద్వారా తప్పుడు వార్తలను పోస్టు చేస్తున్న వాళ్లపై క్రిమినల్ చర్యలు తీసుకుంటామని హెచ్చరిస్తున్నాము. ఇలాంటి ఫేక్ ఐడీలతో పోస్టులు చేస్తున్నవారిపై సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేస్తామని తెలియజేస్తున్నాము.
AP Elections 2024: ఎన్నికల బరి నుంచి కొడాలి నాని ఔట్!?
మరిన్ని వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
ALSO Read Andhra Pradesh News and Telugu News