AP Elections: హైదరాబాద్‌లో ఆంధ్ర ఓటర్ల కోసం.. క్యూ కడుతున్న నేతలు
ABN , Publish Date - Apr 26 , 2024 | 04:30 PM
ఆంధ్రప్రదేశ్‌లో రాజకీయ పరిణామాలు వేగంగా మారుతున్నాయి. ఈ నేపథ్యంలో ఆ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో అధికారం ఎవరి హస్తగతం కానుందనే విషయం ఎవరికి అంతగా అంతుపట్టకుండా ఉంది. ఇటువంటి పరిస్థితుల్లో రాజకీయ పార్టీలు.. ఓటర్లను తమ వైపు తిప్పుకొనేందుకు వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నాయి.
అమరావతి/హైదరాబాద్, ఏప్రిల్ 26: ఆంధ్రప్రదేశ్‌లో రాజకీయ పరిణామాలు వేగంగా మారుతున్నాయి. ఈ నేపథ్యంలో ఆ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో అధికారం ఎవరి హస్తగతం కానుందనే విషయం ఎవరికి అంతగా అంతుపట్టకుండా ఉంది. ఇటువంటి పరిస్థితుల్లో రాజకీయ పార్టీలు.. ఓటర్లను తమ వైపు తిప్పుకొనేందుకు వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నాయి.
AP Elections: ఎన్నికల బరి నుంచి కొడాలి నాని ఔట్..!
ఆ క్రమంలో ఆంధ్రప్రదేశ్ వెలుపల... అంటే తెలంగాణలో మరి ముఖ్యంగా హైదరాబాద్‌లో ఉన్న ఆంధ్ర ఓటర్లను ఆకట్టుకొనేందుకు ఆంధ్రా రాజకీయ నాయకులు తమ వంతు ప్రయత్నాలను ముమ్మరం చేశారు.. చేస్తున్నారు.
AP Elections 2024: ఎన్నికల ముందే నీరుకారిపోయిన వంశీ
అందులోభాగంగా హైదరాబాద్ నగరంలోని ఆంధ్ర ఓటర్లతో.. కూకట్‌పల్లి, హైటెక్‌సిటీ, చందానగర్, అమీర్‌పేట తదితర ప్రాంతాల్లో.. అదీ కూడా సెలవు దినాల్లో మరి ముఖ్యంగా శని, ఆదివారాల్లో సమావేశాలు ఏర్పాటు చేస్తున్నారు.
రాష్ట్ర భవిష్యత్తు, భవిష్యత్తు తరాల భవిష్యత్తుతోపాటు రాజ్యాంగం కల్పించిన ఓటు హక్కు వినియోగించుకోవాలని సదరు రాజకీయ పార్టీల నాయకులు... హైదరాబాద్‌లోని ఆంధ్ర ఓటర్లకు విజ్జప్తి చేస్తున్నారు. మరి ముఖ్యంగా చిరు ఉద్యోగులపై ఆ యా పార్టీల నేతలు ప్రధానంగా దృష్టి సారించారు.
AP Elections 2024: ఎన్నికల వేళ వైసీపీకి బిగ్ షాక్.. కీలక నేత జంప్..
పలు అపార్ట్‌మెంట్లలో సెక్యూరిటీ గార్డులు, ఇళ్లలో పని చేసుకునే వారు.. విధిగా సొంత ఊర్లకు వచ్చి ఓటు వేయాలని సదరు నాయకులు సూచిస్తున్నారు. పోలింగ్‌కు ఒకటి లేదా రెండు రోజుల ముందే సొంత ఊర్లకు హైదరాబాద్ నుంచి వెళ్లేందుకు వాహన సౌకర్యం కల్పిస్తామంటూ వారికి భరోసా సైతం కల్పిస్తున్నారు. మరికొందరు తాము సొంతంగా వస్తామని చెబుతుంటే.. వారికి తగిన మొత్తంలో నగదు కూడా అందజేస్తుండడం గమనార్హం.
ఈ సమావేశం అనంతరం పసందైన విందు భోజనం ఏర్పాటు చేసి ఆంధ్రఓటర్లకు ఆకట్టుకొనే ప్రయత్నం చేస్తున్నారు. మరోవైపు తమ ఓటు హక్కు వినియోగించుకొనేందుకు రెండు రోజుల ముందే తాము స్వస్థలాలకు వెళ్తామని.. ఇప్పటికే వాచ్‌మెన్లు, పని వారు.. తమ తమ యజమానులను కోరుతున్నారు.
CM Revanth: రుణమాఫీ చేసి తీరుతాం... హరీష్ రాజీనామా రెడీగా పెట్టుకో.. రేవంత్ కౌంటర్
ఇంకోవైపు సాప్ట్‌వేర్ ఇంజనీర్లు ఎన్నికలకు కొద్ది రోజుల ముందే ఆంధ్రప్రదేశ్‌లోని తమ స్వస్థలాలకు పయనమవ్వాలని నిర్ణయించారని సమాచారం. ఆ క్రమంలో వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తామని సదరు కంపెనీ యజమానుల నుంచి ముందస్తుగా సాప్ట్ వేర్ ఇంజినీర్లు అనుమతి తీసుకున్నారనే ఓ ప్రచారం సైతం సాగుతుంది.
Lok Sabha Polls 2024: వీవీప్యాట్ల కేసులో సుప్రీంకోర్టు తీర్పుపై ఎన్నికల సభలో మోదీ స్పందన
ఏదీ ఏమైనా ఇటీవల జరిగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ఓటరు స్పష్టమైన తీర్పు ఇచ్చిన విషయం విధితమే. అలాగే ఆంధ్రప్రదేశ్‌లో ఏ పార్టీకి ఓటరు పట్టం కడతాడనేది తెలియాలంటే.. జూన్ 4వ తేదీ వరకు వేచి చూడాల్సిందే.
Read National News and Telugu News