AP Elections: నయవంచకుడు నుంచి మిమ్మల్ని కాపాడేందుకే వచ్చా: పవన్
ABN , Publish Date - May 01 , 2024 | 09:14 PM
ఏపీ సీఎం వైఎస్ జగన్‌పై జనసేన అధినేత పవన్ కల్యాణ్ తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. అనకాపల్లి జిల్లా అచ్చుతాపురంలో జరిగిన బహిరంగ సభలో మాట్లాడారు. సీఎం జగన్ నయవంచుకుడు, గుండా, దోపిడి దారుడు అని తీవ్రస్థాయిలో విమర్శించారు.
అనకాపల్లి జిల్లా: ఏపీ సీఎం వైఎస్ జగన్‌పై (CM Jagan) జనసేన అధినేత పవన్ కల్యాణ్ తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. అనకాపల్లి జిల్లా అచ్చుతాపురంలో జరిగిన బహిరంగ సభలో మాట్లాడారు. సీఎం జగన్ నయవంచుకుడు, గుండా, దోపిడి దారుడు అని తీవ్రస్థాయిలో విమర్శించారు. అతని నుంచి కాపాడేందుకు మీ గొంతుకై వచ్చానని స్పష్టం చేశారు. తాను ముఖ్యమంత్రిని అవుతానో లేదో కాలం నిర్ణయిస్తుందని వివరించారు. ఇక్కడి ఎమ్మెల్యే, ఎంపీ అభ్యర్థులు విజయ్ కుమార్, సీఎం రమేష్‌ను గెలిపించాలని కోరారు.
ఏపీలో తమ ప్రభుత్వం ఏర్పడితే మెగా డీఎస్పీ వేస్తామని పవన్ కల్యాణ్ హామీనిచ్చారు. ఉత్తరాంధ్రాకు ప్రత్యేక ఎంప్లాయిమెంట్ జోన్ ఏర్పాటు చేస్తామని వివరించారు. ‘జగన్ ల్యాండ్ టైటిల్ యాక్ట్ అమలయితే హైకోర్టులో తప్పితే మరెక్కడ మాట్లాడడానికి వీలు లేదు. జగన్‌కి, కన్నబాబుకు ఓటేస్తే.. మీ ఆస్తులు, మీ ఇల్లు గాల్లో దీపం లాంటి పరిస్థితి ఎదుర్కొంటుంది. శాంతి భద్రతల విషయంలో తేడా రానీయబోము అని’ పవన్ కల్యాణ్ స్పష్టం చేశారు.
‘ఒక్క ఛాన్స్ ఇవ్వాలని అడిగితే జగన్‌కు అవకాశం ఇచ్చారు. ఈ సారి మీ భవిష్యత్తు నిర్ణయించుకోవడానికి ఛాన్స్ తీసుకోండి. వైసీపీ ఎమ్మెల్యే కన్నబాబు భూములు దోచేస్తున్నాడు. కన్నబాబు లేఔట్ల కోసం చుట్టుపక్కల ఉన్న భూములను కబ్జా చేస్తున్నాడు. 22 ఏలో ఉన్న భూములు తన పేరు మీద మార్చుకుంటున్నాడు. సింహాచలం ఆలయ భూమి ఆక్రమించుకొని, నిర్మాణం చేసే దిక్కులేదు. కన్నబాబు లాంటి వారు ఉంటే, న్యాయం జరగదు. నేను బాధ్యతగా ఉంటా. ఇక్కడ పోటీ చేసే అభ్యర్థి బాధ్యతగా ఉంచే బాధ్యత నాది. మీ సమస్యలను తీరుస్తా అని’ పవన్ కల్యాణ్ భరోసా కల్పించారు.
Read Latest AP News And Telugu News