Share News

AP Elections 2024: ఈ ప్రాంతాల్లో సాయంత్రం నాలుగు వరకే పోలింగ్

ABN , Publish Date - May 13 , 2024 | 06:50 AM

ఏపీలో నేటి అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికలకు(ap elections 2024) పోలింగ్(polling) కోసం సర్వం సిద్ధమైంది. ఈ క్రమంలో ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 వరకు అనేక ప్రాంతాల్లో పోలింగ్ జరగనుంది. కానీ అల్లూరి జిల్లా(Alluri Sitharama Raju district)లోని మూడు నియోజకవర్గాల్లో మాత్రం సాయంత్రం నాలుగు గంటల వరకే పోలింగ్ నిర్వహిస్తారు.

AP Elections 2024: ఈ ప్రాంతాల్లో సాయంత్రం నాలుగు వరకే పోలింగ్
Alluri district till polling update

ఏపీలో నేటి అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికలకు(ap elections 2024) పోలింగ్(polling) కోసం సర్వం సిద్ధమైంది. ఈ క్రమంలో ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 వరకు అనేక ప్రాంతాల్లో పోలింగ్ జరగనుంది. అయితే అల్లూరి జిల్లా(Alluri Sitharama Raju district)లోని మూడు నియోజకవర్గాల్లో మాత్రం సాయంత్రం నాలుగు గంటల వరకే పోలింగ్ నిర్వహిస్తారు. వాటిలో అరకు పార్లమెంట్ నియోజకవర్గం, రంప చోడవరం, పాడేరు నియోజకవర్గాలు ఉన్నాయి.


మరోవైపు పాలకొండ, కురుపాం, సాలూరులో సాయంత్రం ఐదు గంటల వరకు పోలింగ్ నిర్వహించనున్నట్లు అధికారులు(officers) ప్రకటించారు. ఇప్పటికే పోలింగ్ కోసం అందుకు సంబంధించిన ఏర్పాట్లను అధికారులు పూర్తి చేశారు. అయితే సమస్యాత్మక ప్రాంతాల్లో మాత్రం ఓటింగ్(voting) సమయాన్ని అధికారులు సాయంత్రం 4 వరకు పరిమితం చేయగా, మరికొన్ని ప్రాంతాల్లో సాయంత్రం 5 వరకు కుదించారు. ఈ నేపథ్యంలో ఓటర్లు స్వేచ్ఛగా వచ్చి తమ ఓటు హక్కు వినియోగించుకోవాలని అధికారులు కోరుతున్నారు.


ఇది కూడా చదవండి:


AP Elections 2024: రాష్ట్ర వ్యాప్తంగా ప్రారంభమైన మాక్ పోలింగ్

AP News: ఆంధ్రప్రదేశ్ ఎన్నిక‌ల స‌మాచారం...

Read Latest AP News And Telugu News

Updated Date - May 13 , 2024 | 06:53 AM