AP Govt: ఎక్కడికి వెళ్తారు..లెక్కలు తేలేవరకు ఆగాల్సిందే..!!
ABN , Publish Date - Jun 08 , 2024 | 06:48 PM
ఆంధ్రప్రదేశ్‌లో పలువురు ఐపీఎస్ అధికారులు డిప్యుటేషన్‌పై వెళ్లేందుకు సిద్ధమవుతున్నారు. ఐపీఎస్ రూల్స్‌కు విరుద్ధంగా వైసీపీ రూల్స్‌ను అమలు చేసిన అధికారులు చాలామంది రాష్ట్రంలో ఉన్నారు. ఆ అధికారులంతా ఎన్డీఏ కూటమి అధికారంలోకి రావడంతో భయపడుతున్నట్లు తెలుస్తోంది.
అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో పలువురు ఐపీఎస్ అధికారులు డిప్యుటేషన్‌పై వెళ్లేందుకు సిద్ధమవుతున్నారు. ఐపీఎస్ రూల్స్‌కు విరుద్ధంగా వైసీపీ రూల్స్‌ను అమలు చేసిన అధికారులు చాలామంది రాష్ట్రంలో ఉన్నారు. ఆ అధికారులంతా ఎన్డీఏ కూటమి అధికారంలోకి రావడంతో భయపడుతున్నట్లు తెలుస్తోంది. డెప్యుటేషన్ కోసం అడిగిన అధికారుల దరఖాస్తులను ఏపీ ప్రభుత్వం (AP Govt) తిరస్కరిస్తుంది. గత వైసీపీ (YSRCP) ప్రభుత్వంలో ఎవరైతే ఇష్టానుసారంగా వ్యవహారించిన పోలీసు అధికారులు ఉన్నారో వారంతా ఆందోళన చెందుతున్నారు. గతంలో జగన్ ప్రభుత్వం చెప్పినట్లు నడుచుకోవడంతో పాటు ప్రతిపక్షాలపై అక్రమ కేసులు నమోదు చేసి వారిని జైళ్లకు పంపించారు.
ఏపీలో ప్రభుత్వం మారడంతో వారంతా భయాందోళనలకు గురవుతున్నట్లు తెలుస్తోంది. తప్పుచేసిన పోలీస్ అధికారులపై చట్టప్రకారం కేసులు నమోదు చేస్తామని కూటమి నేతలు వార్నింగ్ ఇస్తున్నారు. వారందరూ కూడా భయాందోళనలకు గురవుతున్నారు. సీఐడీ నుంచి సంజయ్, సిట్ నుంచి కొల్లి రఘురామిరెడ్డి నుంచి ఏపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరబ్ కుమార్ తప్పించారు. దీంతో ఏపీ డీజీపీ హరీశ్ కుమార్ గుప్తాకు అదనంగా రెండు బాధ్యతలను అప్పగించారు. వైసీపీకి సహకరించిన అధికారులకు పూర్తి స్థాయిలో చెక్ పెట్టేందుకు సిద్ధం అవుతున్నారు.
ఈ మేరకు ఓ జాబితాను రెడీ చేశారు. జగన్ సహకారంతో వారంతా రెచ్చిపోయారు. ఈ అధికారులు ఎన్డీఏ ప్రభుత్వం రాష్ట్రంలో ఏర్పడటంతో మెల్లగా జారుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. ఇప్పటికే ఐపీఎస్ సంజయ్ సెలవులను జీఏడీ రద్దు చేసింది. ప్రభుత్వం మారగానే డిప్యుటేషన్‌పై రెవెన్యూ ఇంటెలిజెన్స్ చీఫ్ రాజేశ్వరరెడ్డి వెళ్లారు. అయితే రాజేశ్వరరెడ్డిని జీఏడీ వెనక్కి పిలిచింది. సీఎంఓలో ఉన్న రేపు ముత్యాలరాజు, పూనం మాలకొండయ్య, భరత్ గుప్తాల బదిలీలను నిలిపివేసింది. వారికి తిరిగి సీఎస్ నీరబ్ కుమార్ పోస్టింగ్ ఇవ్వలేదు. లెక్కతేలేవరకు వారంతా ఏపీలోనే ఉండాలని సీఎస్ నీరబ్ ఆదేశించారు.