TDP Chief: కుర్చీ దిగిపోయే ముందూ వైసీపీ హింసా రాజకీయాలా?... చంద్రబాబు ఆగ్రహం
ABN , Publish Date - Mar 19 , 2024 | 12:35 PM
Andhrapradesh: గిద్దలూరులో టీడీపీ కార్యకర్త మూలయ్య, నంద్యాలలో ఇమామ్ హుస్సేన్ హత్యలపై టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు స్పందించారు. మంగళవారం మీడియాతో మాట్లాడుతూ... రాష్ట్రంలో రాజకీయ హింస, శాంతి భద్రతలపై ఎలక్షన్ కమిషన్ తక్షణమే దృష్టి పెట్టాలని కోరారు. మరో 50 రోజుల్లో కుర్చీ దిగి ఇంటికి పోయే ముందు కూడా జగన్ హింసా రాజకీయాలను ప్రోత్సహిస్తున్నారని చంద్రబాబు మండి పడ్డారు. గిద్దలూరులో టీడీపీ కార్యకర్త మూలయ్య, నంద్యాలలో ఇమామ్ హుస్సేన్ హత్యలను అధినేత ఖండించారు.
అమరావతి, మార్చి 19: గిద్దలూరులో టీడీపీ కార్యకర్త మూలయ్య, నంద్యాలలో ఇమామ్ హుస్సేన్ హత్యలపై టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు (TDP Chief Chandrababu Naidu) స్పందించారు. మంగళవారం మీడియాతో మాట్లాడుతూ... రాష్ట్రంలో రాజకీయ హింస, శాంతి భద్రతలపై ఎలక్షన్ కమిషన్ తక్షణమే దృష్టి పెట్టాలని కోరారు. మరో 50 రోజుల్లో కుర్చీ దిగి ఇంటికి పోయే ముందు కూడా జగన్ (CM Jagan) హింసా రాజకీయాలను ప్రోత్సహిస్తున్నారని చంద్రబాబు (TDP Chief) మండిపడ్డారు. గిద్దలూరులో టీడీపీ కార్యకర్త మూలయ్య, నంద్యాలలో ఇమామ్ హుస్సేన్ హత్యలను అధినేత ఖండించారు. ఎన్నికల వేళ వైసీపీ (YSRCP) మరింత రాజకీయ హింసకు దిగుతోందని అన్నారు. ఓటమి భయంతో తీవ్ర నైరాశ్యంలో ఉన్న వైసీపీ మూకలు టీడీపీ కార్యకర్తలపై (TDP Activists) దాడులు చేస్తున్నాయని ఆరోపించారు. ‘‘ప్రజాగళం’’ సభకు వచ్చారన్న కారణంతో గిద్దలూరు నియోజకవర్గం, గడికోటకు చెందిన మూలయ్యను గొడ్డళ్లతో నరికి దారుణంగా చంపేశారన్నారు. ఆళ్లగడ్డ నియోజకవర్గం, చాగలమర్రిలో ఇమామ్ హుస్సేన్ అనే 21 ఏళ్ల యువకుడిపై కత్తులతో దాడి చేసి బలి తీసుకున్నారని అన్నారు. మాచర్లలో టీడీపీ కార్యకర్త సురేష్ కారును తగలబెట్టారని తెలిపారు. ఈ మూడు ఘటనలపై పోలీసులు నిష్పక్షపాతంగా వ్యవహరించి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని టీడీపీ చీఫ్ డిమాండ్ చేశారు.
Crime News: కోటాలో కోచింగ్ స్టూడెంట్ కిడ్నాప్.. తండ్రికి కుమార్తె ఫోటోలు.. అసలు ఏమైందంటే?
వైసీపీ గూండాల హత్యా, ఫ్యాక్షన్ రాజకీయాలను తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. బాధిత కుటుంబాలకు టీడీపీ అండగా ఉంటుందన్నారు. ప్రకాశం జిల్లా ఎస్పీ పరమేశ్వరరెడ్డి, నంద్యాల ఎస్పీ రఘువీర్ రెడ్డి, పల్నాడు ఎస్పీ రవిశంకర్ రెడ్డి వైసీపీకి అత్యంత అనుకూలమైనవారే అని చెప్పుకొచ్చారు. వైసీపీ నేతలతో సన్నిహిత సంబంధాలున్న ముగ్గురు ఎస్పీల అండ చూసుకునే వైసీపీ గూండాలు చెలరేగుతున్నారన్నారు. కోడ్ అమల్లో ఉన్న నేపథ్యంలో ఎన్నికల కమిషన్ కూడా రాష్ట్రంలో శాంతి భద్రతలపై తక్షణం దృష్టి సారించాలని కోరారు. ఎన్నికల ముంగిట పెచ్చురిల్లుతున్న రాజకీయ హింస, శాంతి భద్రతల పరిస్థితిపై సమీక్షించి తగు చర్యలు తీసుకోవాలని చంద్రబాబు నాయుడు కోరారు.
ఇది కూడా చదవండి...
Arani Srinivasulu: నేను నాన్ లోకల్ కాదు.. లోకలే
SBI: ఎస్‌బీఐ ఫెలోషిప్ ప్రోగ్రామ్.. యువతకు మంచి ఆఫర్, రూ.70 వేలు
మరిన్ని ఏపీ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..