Share News

AP News: ఈ సారి మీకు టికెట్ ఇవ్వడం లేదు.. కీలక నేతకు టీడీపీ హైకమాండ్ నుంచి ఫోన్

ABN , Publish Date - Mar 14 , 2024 | 02:49 PM

పెనమలూరు నియోజకవర్గంపై టీడీపీ కసరత్తు మొదలుపెట్టింది. మాజీ ఎమ్మెల్యే, ప్రస్తుత నియోజకవర్గ ఇన్‌చార్జ్ బొడే ప్రసాద్‌కు ఈ సారి టికెట్ ఇవ్వడం లేదు. ఈ మేరకు ఆయనకు పార్టీ హైకమాండ్ నుంచి ఫోన్ వచ్చింది.

AP News: ఈ సారి మీకు టికెట్ ఇవ్వడం లేదు.. కీలక నేతకు టీడీపీ హైకమాండ్ నుంచి ఫోన్

కృష్ణా: పెనమలూరు నియోజకవర్గంపై టీడీపీ కసరత్తు మొదలుపెట్టింది. మాజీ ఎమ్మెల్యే, ప్రస్తుత నియోజకవర్గ ఇన్‌చార్జ్ బొడే ప్రసాద్‌కు ఈ సారి టికెట్ ఇవ్వడం లేదు. ఈ మేరకు ఆయనకు పార్టీ హైకమాండ్ నుంచి ఫోన్ వచ్చింది. ఈ సారి మీకు టికెట్ ఇవ్వలేకపోతున్నామని టీడీపీ హైకమాండ్ దూతలు ఆయనకు ఫోన్‌లో చెప్పారు. అంతేకాకుండా బోడే ప్రసాద్‌తో చంద్రబాబు సాయంత్రం నేరుగా మాట్లాడతారని చెప్పారు. మరో వైపు త్వరలో జరగనున్న అసెంబ్లీ ఎన్నికలకు టీడీపీ గురువారం తమ అభ్యర్థుల రెండో జాబితాను ప్రకటించింది. మొత్తంగా 34 మందితో ఈ జాబితాను ప్రకటించింది. ఇది వరకు ప్రకటించిన మొదటి జాబితాలో 94 మంది అభ్యర్థులను ప్రకటించింది. దీంతో టీడీపీ ఇప్పటివరకు 128 అసెంబ్లీ నియోజకవర్గాలకు అభ్యర్థులను వెల్లడించింది. కాగా ఈ ఎన్నికల్లో టీడీపీ.. జనసేన, బీజేపీతో కలిసి పోటీ చేస్తున్న సంగతి తెలిసిందే.

మరిన్ని ఏపీ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Updated Date - Mar 14 , 2024 | 02:53 PM