Share News

Kesineni Chinni: వచ్చేది టీడీపీ, బీజేపీ, జనసేన ప్రభుత్వమే

ABN , Publish Date - Apr 01 , 2024 | 10:31 AM

Andhrapradesh: తూర్పు నియోజకవర్గంలో సమస్యలన్నీ పరిష్కరిస్తామని టీడీపీ పార్లమెంట్ అభ్యర్థి కేశినేని చిన్ని హామీ ఇచ్చారు. సోమవారం విజయవాడ తూర్పు నియోజకవర్గం గుణదలలో కేశినేని చిన్ని, గద్దె రామ్మోహన్ పర్యటించారు. అమ్మ కళ్యాణ మండపం వద్ద కేశినేని చిన్నికి, గద్దె రామమోహన్‌కు స్థానికులు మేళతాళాలతో ఘన స్వాగతం పలికారు.

Kesineni Chinni: వచ్చేది టీడీపీ, బీజేపీ, జనసేన ప్రభుత్వమే

విజయవాడ, ఏప్రిల్ 1: తూర్పు నియోజకవర్గంలో సమస్యలన్నీ పరిష్కరిస్తామని టీడీపీ పార్లమెంట్ అభ్యర్థి కేశినేని చిన్ని (Kesineni Chinni) హామీ ఇచ్చారు. సోమవారం విజయవాడ తూర్పు నియోజకవర్గం గుణదలలో కేశినేని చిన్ని, గద్దె రామ్మోహన్ పర్యటించారు. అమ్మ కళ్యాణ మండపం వద్ద కేశినేని చిన్నికి, గద్దె రామమోహన్‌కు స్థానికులు మేళతాళాలతో ఘన స్వాగతం పలికారు.

Andhra Pradesh: ఆ సినిమా ప్రదర్శనలను ఆపేయండి.. కోర్టును ఆశ్రయించిన దస్తగిరి..


ఈ సందర్భంగా కేశినేని చిన్ని మాట్లాడుతూ.. వచ్చేది టీడీపీ, బీజేపీ, జనసేన (TDP-BJP-Janasena) ప్రభుత్వమే ధీమా వ్యక్తం చేశారు. సంక్షేమం, అభివృద్ధి రెండు కళ్ళుగా రానున్న రోజుల్లో పాలన ఉండబోతుందన్నారు. యువతకు పెద్ద ఎత్తున ఉపాధికి ప్రణాళికలు రూపొందించామన్నారు. ప్రణాళికాబద్దంగా, నిర్ణీత కాల వ్యవధిలో అభివృద్ధికి బాటలు వేస్తామన్నారు. విజయవాడ పార్లమెంట్‌లో ప్రజలు టీడీపీకి బ్రహ్మరథం పడుతున్నారని కేశినేని చిన్ని పేర్కొన్నారు.

ఇవి కూడా చదవండి..

MS Dhoni: విశాఖలో ధోనీ విధ్వంసం.. సింగిల్ హ్యాండ్‌తో సిక్స్ ఎలా కొట్టాడో చూడండి..!

CM Jagan: నేడు జగన్ బెయిల్ రద్దుపై సుప్రీంలో విచారణ

మరిన్ని ఏపీ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి...

Updated Date - Apr 01 , 2024 | 03:15 PM