AP News: వైసీపీలో తారాస్థాయికి వర్గపోరు.. ఆయనకు టికెట్ ఇస్తే ఓటమి ఖాయమంటున్న నేతలు
ABN , Publish Date - Mar 15 , 2024 | 03:06 PM
వెంకటగిరి వైసీపీలో వర్గపోరు తారాస్థాయికి చేరింది. వైసీపీ ఇంచార్జి నేదురుమల్లి రాంకుమార్ రెడ్డిపై సొంత పార్టీ శ్రేణుల్లో తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. దీంతో వైసీపీ సీనియర్ నేత కలిమిలి రాంప్రసాద్ రెడ్డి ఆధ్వర్యంలో రేణిగుంట విమానాశ్రయంలో మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిని నియోజకవర్గానికి చెందిన నేతలు కలిశారు.
నెల్లూరు: వెంకటగిరి వైసీపీలో వర్గపోరు తారాస్థాయికి చేరింది. వైసీపీ ఇంచార్జి నేదురుమల్లి రాంకుమార్ రెడ్డిపై సొంత పార్టీ శ్రేణుల్లో తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. దీంతో వైసీపీ సీనియర్ నేత కలిమిలి రాంప్రసాద్ రెడ్డి ఆధ్వర్యంలో రేణిగుంట విమానాశ్రయంలో మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిని నియోజకవర్గానికి చెందిన నేతలు కలిశారు. మంత్రిని కలిసిన వారిలో ఆరు మండలాల సర్పంచులు, ఎంపీపీలు, ఎంపీటీసీలు, జడ్పీటీసీలు, వైసీపీ నేతలు, కార్యకర్తలు ఉన్నారు. వెంకటగిరిలో వైసీపీ ఇంచార్జి నేదురుమల్లిని మార్చాలని మంత్రి పెద్దిరెడ్డిని వైసీపీ నేతలు కోరారు. నేదురుమల్లికి టికెట్ ఇస్తే వైసీపీకి తాము పని చేయమని సదరు నేతలు మంత్రి పెద్దిరెడ్డికి తేల్చి చెప్పారు. నేదురుమల్లికి టికెట్ ఇస్తే నియోజకవర్గంలో వైసీపీకి ఓటమి ఖాయమని స్పష్టం చేశారు. అయితే ఈ అంశంపై సానుకూలంగా స్పందించేందుకు మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఒక్క రోజు గడువు కోరారు.
మరిన్ని ఏపీ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.