Share News

AP Election Results: వైసీపీ ఘోర పరాజయంపై విజయసాయిరెడ్డి ఇంట్రెస్టింగ్ కామెంట్స్!

ABN , Publish Date - Jun 04 , 2024 | 06:04 PM

ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో ఊహించని రీతిలో వైసీపీ (YSR Congress) ఘోర పరాజయం పాలైంది..! వైనాట్ 175 అన్న వైసీపీ ఇప్పుడు సింగిల్ డిజిట్‌కే పరిమితం అయ్యింది..! బహుశా ఇంత దారుణంగా అధికార పార్టీ ఓడిపోతుందని వైసీపీ కలలో కూడా ఊహించి ఉండదేమో.! ఈ ఓటమిని ఆ పార్టీ కార్యకర్తలు, వీరాభిమానులు.. వైసీపీ నేతలు జీర్ణించుకోలేకపోతున్నారు.

AP Election Results: వైసీపీ ఘోర పరాజయంపై విజయసాయిరెడ్డి ఇంట్రెస్టింగ్ కామెంట్స్!

ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో ఊహించని రీతిలో వైసీపీ (YSR Congress) ఘోర పరాజయం పాలైంది..! వైనాట్ 175 అన్న వైసీపీ ఇప్పుడు సింగిల్ డిజిట్‌కే పరిమితం అయ్యింది..! బహుశా ఇంత దారుణంగా అధికార పార్టీ ఓడిపోతుందని వైసీపీ కలలో కూడా ఊహించి ఉండదేమో.! ఈ ఓటమిని ఆ పార్టీ కార్యకర్తలు, వీరాభిమానులు.. వైసీపీ నేతలు జీర్ణించుకోలేకపోతున్నారు. కనీసం ఈ ఓటమిపై పార్టీ నేతలు స్పందించలేని పరిస్థితి నెలకొందంటే సీన్ అర్థం చేసుకోవచ్చు. ఇప్పటి వరకూ కేవలం నలుగురంటే నలుగురు అభ్యర్థులు మాత్రమే గెలవడం గమనార్హం. ఇవన్నీ ఒక ఎత్తయితే కడప జిల్లాలో మూడు సీట్లకే వైసీపీ పరిమితం కావడం.. అందులోనూ జగన్ ఒక్కరు కావడమేంటి..? అని సొంత పార్టీ నేతలే ముక్కున వేలేసుకుంటున్న పరిస్థితి. ఇక ఉభయ గోదావరి జిల్లాల్లో అయితే టీడీపీ క్లీన్ స్వీప్ చేసేసింది. అసలు వైసీపీ ఊసే లేకుండా పోయింది.


సాయిరెడ్డి ఏమన్నారంటే..?

వైసీపీ పరాజయంపై నెల్లూరు ఎంపీ అభ్యర్థిగా పోటీచేసిన సీనియర్ నేత విజయసాయిరెడ్డి కౌంటింగ్ కేంద్రం నుంచి బయటికి వచ్చాక మీడియాతో మాట్లాడారు. ‘ఆంధ్రరాష్ట్ర ప్రజలందరూ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రజలు కూటమికి అనుకూలంగా తీర్పునివ్వడం జరిగింది. ప్రజాస్వామ్యలో ఎవరైనా ప్రజల తీర్పును శిరసావహించాల్సిందే విషయం అందరికీ తెలిసిందే.. అది రాజ్యాంగ బద్ధం కూడా. వైసీపీ ఎదుర్కొన్న ఈ ఓటమికి కారణాలేంటి..? అనే దానిపై సమీక్ష చేయాల్సి ఉంది. ఎక్కడ పొరపాటు జరిగింది..? ఆ పొరపాటును ఎలా సరిదిద్దుకోవాలి..? ప్రజలకు నచ్చని పని వైసీపీ ఏం చేసింది..? మేం చేసిన పనులు, సంక్షేమ పథకాలను ప్రజలు ఎందుకు ఆదరించలేదనే విషయాన్ని కూలంకుషంగా చర్చించి .. ప్రతి నియోజకవర్గం నాయకులందరితో సమీక్ష నిర్వహించి మా అధ్యక్షుల వారు తదుపరి కార్యాచరణ చేపడుతారు’ అని విజయసాయిరెడ్డి చెప్పుకొచ్చారు. కాగా.. మరికాసేపట్లో వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి కూడా మీడియా ముందుకు రాబోతున్నారు. ఓటమిపై ఏం మాట్లాడబోతున్నారు..? అనేదానిపై వైసీపీ శ్రేణులు ఎంతగానో ఎదురుచూస్తున్నాయి.

Updated Date - Jun 04 , 2024 | 06:04 PM