Home » AP Election Results
ఉమ్మడి విశాఖపట్నం జిల్లాలో ఖాళీ అయిన ఎమ్మెల్సీ (స్థానిక సంస్థల కోటా) స్థానానికి వైసీపీ అభ్యర్థిగా బరిలోకి దిగిన మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ ఏకగ్రీవంగా ఎన్నిక అయ్యారు...
అవును.. అనుకున్నట్లే జరిగింది..! ఏపీ ప్రజలు కూటమికే ఓటేశారు.. కనివినీ ఎరుగని రీతిలో సీట్లు కట్టబెట్టి అధికారమిచ్చారు. పేరుగాంచిన ప్రాంతీయ, జాతీయ మీడియా.. సర్వే సంస్థలు చేసిన సర్వేలన్నీ అక్షరాలా నిజమయ్యాయి. ఊహించిన దానికంటే ఎక్కువే సీట్లు దక్కాయని టీడీపీ, జనసేన, బీజేపీ శ్రేణులు ఆనందంలో మునిగితేలుతున్నాయి. ఇక ఎక్కడా చూసినా పసుపు జెండాలే రెపరెపలాడుతున్నాయి.
అస్సలు గెలిచే ప్రసక్తే లేదు.. విజయవాడ పశ్చిమ కాకుండా వేరే ఏ నియోజకవర్గం అయినా బాగుండేది.. ఇక్కడ పోటీచేసి సుజనా చౌదరి అనవసరంగా ఓడిపోతారేమోనని కూటమి కార్యకర్తల్లో ఒకింత అనుమానం ఉండేది. సీన్ కట్ చేస్తే.. గెలుపే కాదు, ఊహించని మెజార్టీ దక్కించుకున్నారు..
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ(AP Assembly), లోక్ సభ ఎన్నికల సందర్భంగా రాష్ట్రంలో బెట్టింగ్(Betting) విపరీతంగా సాగింది. కోట్ల రూపాయలు చేతులు మారాయి. బెట్టింగ్ అంటే మనకు ముందుగా గుర్తొచ్చేది ఏపీఎల్. కానీ రాష్ట్రంలో దాన్ని మించి ఎన్నికల వేళ పందాలు వేసి బికారులుగా మారుతున్నారు. మరికొంత మంది సొమ్ము చెల్లించలేక ప్రాణాలు తీసుకుంటున్నారు.
ఏపీ సార్వత్రిక ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి (NDA Alliance) 164 సీట్లతో అధికారంలోకి వచ్చిన విషయం తెలిసిందే. ఈ ఎన్నికల్లో వైఎస్సార్సీపీ (YSRCP) కేవలం 11 సీట్లతో ఘోర ఓటమిని చవిచూసింది. ఎన్నికల్లో ఘోర పరాజయం నుంచి వైసీపీ నేతలు ఇంకా కోలుకున్నట్టు లేదు. ఆయా నేతలను ఇప్పటికీ ఓటమిని జీర్ణించుకోలేకపోతున్నారు.
ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో (AP Elections) వైసీపీ (YSR Congress) ఘోరాతి ఘోరంగా ఓడిపోవడం, కనీసం ప్రతిపక్ష హోదా లేకపోవడంతో పార్టీ ఉంటుందా..? ఊడుతుందా అనే విషయం కూడా తెలియట్లేదు.
ఐదేళ్ల కిందట చేసిన పనులకు కాంట్రాక్టర్లకు వైసీపీ పాలనలో బిల్లులు రాలేదు. వైసీపీ ఓటమి.. కూటమి ఘన విజయంతో తమ కష్టాలు తీరుతాయని వారు హర్షం వ్యక్తం చేస్తున్నారు. టీడీపీ ప్రభుత్వ హయాంలో 2019 వరకూ గుంతకల్లు మునిసిపాలిటీ పరిధిలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ నిధులతో వివిధ రకాల పనులు చేశారు. వైసీపీ అధికారంలోకి రాగానే ఆ పనుల బిల్లులన్నింటినీ అటకెక్కించేశారు. రాష్ట్ర ప్రభుత్వం వద్ద నిధులు లేవని అనుకున్నా, కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చిన నిధులనైనా ఇవ్వాల్సింది. కానీ.. అవి కూడా విడుదల చేయకుండా కాంట్రాక్టర్లను అప్పుల్లో ముంచేశారు. ఇక ...
రాజకీయాల్లో మనుగడ అనేది ఎంతో ముఖ్యం.. రాజకీయ పార్టీ భవిష్యత్తును నిర్ణయించేది అదే. ఓ నాయకుడు తీసుకునే నిర్ణయాలు పార్టీ మనుగడను నిర్దేశిస్తాయి. ఎన్నికల్లో గెలుపోటములు సహజం.. కానీ ఊహించని రీతిలో ఘోర పరాజయం ఎదురైనప్పుడు పార్టీ మనుగడ ప్రశ్నార్థకమవుతుంది.
ఏపీ ఎన్నికల్లో వైసీపీ ఘోర పరాజయంతో ఆ పార్టీ నాయకులు తీవ్ర ఆవేదన చెందుతున్నారు. ప్రజల తీర్పు ఇలా ఉంటుందని కలలో కూడా ఊహించలేదంటూ కొందరు నాయకులు బాధపడుతున్నారు. నియోజకవర్గంలో మంచి పనులు చేసినా ఎందుకు ఓడిపోయామో తెలియడం లేదంటూ మరికొందరు నేతలు కన్నీళ్లు పెట్టుకుంటున్నారు.
మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ పలువురు ఉపాధ్యాయుల వద్ద వేల కోట్ల రూపాయలు వసూల్ చేశారని తెలుగుదేశం పార్టీ పార్లమెంటు అధ్యక్షులు గండి బాబ్జి (Gandi Babji) సంచలన ఆరోపణలు చేశారు. టీచర్లను వారు కోరుకున్న ప్రాంతాలకు ట్రాన్స్ఫర్ చేస్తామని మాయ మాటలు చెప్పి బొత్స వసూలు చేశారని ఆరోపణలు వస్తున్నాయన్నారు.