Share News

AP Elections: ఏజెంట్‌గా వెళ్తున్నారా..? రూ.2 కాయిన్ తీసుకెళ్లడం మరచిపోకండి..!!

ABN , Publish Date - May 10 , 2024 | 04:03 PM

పోలింగ్ కేంద్రంలో ఎన్నికల సిబ్బంది విధుల్లో ఉంటారు. ఒకరు ఓటరును గుర్తిస్తారు. మరొకరు సిరా చుక్క పెడుతుంటారు. ఈవీఎం పరిసరాల్లో మరొకరు ఉంటారు. వారి ఎదురుగా పోలింగ్ ఏజెంట్లు ఉంటారు. ఒక్కో పార్టీ తరఫున ఒకరు ఉంటారు. దొంగ ఓట్లు పడకుండా తగిన చర్యలు తీసుకుంటారు. పోలింగ్ ఏజెంట్లకు మరో బాధ్యత కూడా ఉంటుంది.

AP Elections: ఏజెంట్‌గా వెళ్తున్నారా..? రూ.2 కాయిన్ తీసుకెళ్లడం మరచిపోకండి..!!
voter

అమరావతి: మరో మూడు రోజుల్లో దేశవ్యాప్తంగా సార్వత్రిక ఎన్నికలు జరగనున్నాయి. ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) అసెంబ్లీకి ఎన్నిక కూడా జరగనుంది. పోలింగ్ ఏర్పాట్లలో అధికారులు బిజీగా ఉన్నారు. ఓటరు హక్కులు, పోలింగ్ ఏజెంట్ల బాధ్యతల గురించి తప్పనిసరిగా తెలుసుకోవాల్సిన అవసరం ఉంది.


బాధ్యత

పోలింగ్ కేంద్రంలో ఎన్నికల సిబ్బంది విధుల్లో ఉంటారు. ఒకరు ఓటరును గుర్తిస్తారు. మరొకరు సిరా చుక్క పెడుతుంటారు. ఈవీఎం (EVM) పరిసరాల్లో మరొకరు ఉంటారు. వారి ఎదురుగా పోలింగ్ ఏజెంట్లు ఉంటారు. ఒక్కో పార్టీ తరఫున ఒకరు ఉంటారు. దొంగ ఓట్లు పడకుండా తగిన చర్యలు తీసుకుంటారు. పోలింగ్ ఏజెంట్లకు మరో బాధ్యత కూడా ఉంటుంది.


రూ.2 ఇచ్చి ఛాలెంజ్

పోలింగ్ కేంద్రంలో ఓటర్లు అందరి గురించి ఏజెంట్లకు (agents) అవగాహన ఉంటుంది. అనుమానం వస్తే ప్రిసైడింగ్ అధికారి వద్దకు రావొచ్చు. రూ.2 ఇచ్చి దొంగ ఓటరు అని చెప్పొచ్చు. ఏజెంట్ రూ.2 కాయిన్ ప్రిసైడింగ్ అధికారికి సవాల్ చేయాలి. ఆ సమయంలో ఓటరు ఆధార్ కార్డ్, ఓటరు గుర్తింపు కార్డు వద్ద ఉన్న లెక్కలోకి తీసుకోరు. ఆ ఓటరుపై ప్రిసైడింగ్ అధికారి విచారణ చేస్తారు. విచారణ క్రమంలో ఆ ఓటు నిజమైన ఓటు అని తేలితే ఓటు వేసేందుకు అనుమతిస్తారు. దొంగ ఓటు అని తేలితే పోలీసులకు అప్పగిస్తారు. దొంగ ఓటు వేసేందుకు ప్రయత్నించారని ఫిర్యాదు ఇస్తారు. ఓటరు ఫేక్ అని తెలిస్తే తప్ప మిగతా వారిని ఇబ్బంది పెట్టొద్దని 1961 ఎన్నికల నియమావళిలో ఉంది.


అవగాహన లేదు

నిజానికి ఛాలెంజ్ ఓటు గురించి అందరికి అవగాహన ఉండదు. పోలింగ్ కేంద్రంలోకి (Polling Centre) దొంగ ఓటరు వస్తే గొడవ చేస్తుంటారు. ఆ ఓటు గురించి ఛాలెంజ్ చేస్తే సరిపోతుంది. పోలింగ్ కేంద్రంలో ఉన్న ప్రిసైడింగ్ అధికారి విచారణ జరిపి ఆ ఓటును నిర్ధారిస్తారు. దొంగ ఓటు అయితే కేసు నమోదు చేస్తారు. కాదని తేలితే ఓటు వేసేందుకు అవకాశం కల్పిస్తారు.


ఇవి కూడా చదవండి..

Hyd News: మద్యం ప్రియులకు కీలక అప్‌డేట్.. రేపటి నుంచి..

AP Election 2024: వైసీపీ కోసం.. లూప్‌లైన్‌ ‘వ్యూహం’


Read Latest
AP News And Telugu News

Updated Date - May 10 , 2024 | 04:57 PM