Share News

AP Elections: సీనియర్ vs జూనియర్.. గెలిచేదెవరు..?

ABN , Publish Date - Apr 24 , 2024 | 05:55 PM

ఉమ్మడి విశాఖపట్టణం జిల్లాలోని అనకాపల్లి అసెంబ్లీ నియోజకవర్గంలో సీనియర్ వర్సెస్ జూనియర్ పోరు ఆసక్తికరంగా మారింది. పొత్తలో భాగంగా ఎన్డీయే నుంచి జనసేన అభ్యర్థి కొణతాల రామకృష్ణ పోటీ చేస్తుండగా.. వైసీపీ అభ్యర్థిగా ఇటీవల రాజకీయాల్లోకి వచ్చిన మలసాల భరత్ పోటీ చేస్తున్నారు. ఇద్దరి మధ్య హోరాహోరీ పోరు నడుస్తోంది. రాజకీయాల్లోసుదీర్ఘ అనుభవం ఉన్న కొణతాల రామకృష్ణను యువకుడు మలసాల భరత్ ఎలా ఢీకుంటారనేది ఆసక్తికరంగా మారింది.

AP Elections: సీనియర్ vs జూనియర్.. గెలిచేదెవరు..?
Konatala and Malasala bharat

ఉమ్మడి విశాఖపట్టణం జిల్లాలోని అనకాపల్లి అసెంబ్లీ నియోజకవర్గంలో సీనియర్ వర్సెస్ జూనియర్ పోరు ఆసక్తికరంగా మారింది. పొత్తలో భాగంగా ఎన్డీయే నుంచి జనసేన అభ్యర్థి కొణతాల రామకృష్ణ పోటీ చేస్తుండగా.. వైసీపీ అభ్యర్థిగా ఇటీవల రాజకీయాల్లోకి వచ్చిన మలసాల భరత్ పోటీ చేస్తున్నారు. ఇద్దరి మధ్య హోరాహోరీ పోరు నడుస్తోంది. రాజకీయాల్లోసుదీర్ఘ అనుభవం ఉన్న కొణతాల రామకృష్ణను యువకుడు మలసాల భరత్ ఎలా ఢీకుంటారనేది ఆసక్తికరంగా మారింది.


అభివృద్ధిలో..

విశాఖపట్టణం నగరానికి అతి సమీపంలో అనకాపల్లి పట్టణం ఉంటుంది. పేరుకు పట్టణ ప్రాంతమైనా.. అభివ‌ృద్ధిల్లో ఈ ప్రాంతం వెనుకబడే ఉంది. శారదా నది ఒడ్డునే ఉన్న అనకాపల్లి ప్రసిద్ధ వ్యవసాయ ఆధారిత ఉత్పత్తులకు అనువైన పట్టణంగా పేర్గాంచింది. 1878 లోనే మున్సిపాల్టీగా అవతరించిన అనకాపల్లి 2013లో విశాఖ మహానగర పాలక సంస్థలో విలీనమైంది. చెరకు రైతులు అధికంగా ఉండటంతో దేశంలోనే రెండవ అతిపెద్ద బెల్లం తయారీ కేంద్రంగా అనకాపల్లి ప్రసిద్ధి చెందింది.


అనకాపల్లి నియోజకవర్గం పరిధిలో 2లక్షల మందికి పైగా ఓటర్లు ఉన్నారు. కాశింకోట, అనకాపల్లి మండలాలు ఈ నియోజకవర్గం పరిధిలో ఉన్నాయి. నిరుద్యోగం నియోజకవర్గంలో ప్రధాన సమస్యగా ఉంది. చెరుకు రైతులకు గిట్టుబాటు ధర లేక ఎన్నో ఇబ్బందులు పడుతున్నారు. వ్యవసాయమే జీవనాధారంగా ఉన్న ఈ నియోజకవర్గంలో రైతులు పండించిన పంటలు నిల్వ చేసుకోవడానికి కోల్డ్ స్టోరేజీలు లేవు. దీంతో రైతులు తమ వ్యవసాయ ఉత్పత్తులకు సరైన ధర పొందలేకపోతున్నారు. ఉపాధి అవకాశాలు లేక ఈ ప్రాంతం ప్రజలు ఎక్కువుగా వలసలు వెళ్ళాల్సిన పరిస్థితులు నెలకొన్నాయి. అనకాపల్లికి ఘనమైన చరిత్ర ఉన్నా అభివృద్ధికి ఆమడ దూరంలో నిలిచిపోయింది. మారుమూల ప్రాంతాలకు ఇప్పటికీ సరైన రహదారులు లేవు. 2019లో వైసీపీ తరపున అనకాపల్లి ఎమ్మెల్యేగా ఎన్నికైన గుడివాడ అమర్‌నాధ్ జగన్ కేబినెట్‌లో ఐటీ శాఖ మంత్రిగా ఉన్నారు.


Yarlagadda Venkatarao: కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడం తధ్యం..

మలసాల బలం, బలహీనతలు..

ఈ ఎన్నికల్లో వైసీపీ తమ అభ్యర్థిగా మలసాల భరత్‌ను ప్రకటించింది. సిట్టింగ్ ఎమ్మెల్యే గుడివాడ అమర్‌నాథ్‌ను మార్చి కొత్త అభ్యర్థికి అవకాశం ఇచ్చింది. కశింకోట మండలానికి చెందిన మలసాల భరత్ రాజకీయాలకు కొత్త. ఆయన కుటుంబానికి రాజకీయ నేపథ్యం ఉన్నప్పటికీ.. మలసాల భరత్ చదవు తర్వాత అమెరికాలో వ్యాపారాలు చేశారు. రాజకీయాల్లోకి రావాలనే ఉద్దేశంతో ఏడాది క్రితం రాష్ట్రానికి తిరిగి వచ్చారు. ఆ తర్వాత వైసీపీలో చేరి ఎమ్మెల్యే టికెట్ తెచ్చుకోగలిగారు. గతంలో రాజకీయాల్లో లేకపోవడంతో వ్యక్తిగతంగా ఆయనపై ప్రజల్లో ఎలాంటి వ్యతిరేకత లేకపోవడం భరత్‌కు కలిసొచ్చే అంశం. ఇదే సమయంలో వైసీపీ ప్రభుత్వంపై వ్యతిరేకత ఆయనకు మైనస్‌ కానుంది. నియోజకవర్గం ప్రజలతో పెద్దగా పరిచయాలు లేవు. కేవలం పార్టీ గుర్తు, సీఎం వైఎస్ జగన్ ఇమేజ్‌ను మలసాల భరత్ నమ్ముకున్నారు. ప్రత్యర్థి బలమైన వ్యక్తి కావడం భరత్‌ గట్టి పోటీని ఎదుర్కొంటున్నారు.

Konatala and Malasala Bharat.jpg


కొణతాల బలం, బలహీనతలు

జనసేన అభ్యర్థిగా సీనియర్ రాజకీయ నేత, మాజీ మంత్రి కొణతాల రామకృష్ణ పోటీ చేస్తున్నారు. అనకాపల్లి ప్రజలకు కొణతాల రామకృష్ణ సుపరిచితులు. పార్లమెంట్ సభ్యులుగా, శాసన సభ్యుడిగా గతంలోపనిచేశారు. 40 ఏళ్లకు పైగా రాజకీయ అనుభవం కలిగిన నాయకుడు. టీడీపీ, బీజేపీ మద్దతు ఆయనకు కలిసొచ్చే అంశంగా మారనుంది. ప్రభుత్వ వ్యతిరేక ఓటు తమకే పడుతుందని కొణతాల రామకృష్ణ ఆశలు పెట్టుకున్నారు.


వీళ్ల ఓట్లే కీలకం..

అనకాపల్లి నియోజకవర్గం మొత్తం ఓటర్లలో 45 శాతంగా ఉన్న కాపు, 30 శాతంగా ఉన్న గవర్ల ఓట్లే కీలకం కానున్నాయి. ఈ రెండు సామాజిక వర్గాలు ఎవరికి మద్దతు ఇస్తే వారినే విజయం వరించే అవకాశాలు ఉన్నాయి. ప్రధానంగా పవన్ కళ్యాణ్ ఇమేజ్‌తో కాపుల్లో ఎక్కువ శాతం మంది జనసేన వైపు మొగ్గు చూపుతున్నట్లు తెలుస్తోంది. గవర్లు సైతం ఎన్డీయే కూటమికే మద్దుతు పలుకుతున్నట్లు సంకేతాలు వెలువడుతున్నాయి. దీంతో వైసీపీ కంటే ఎన్డీయే కూటమి అభ్యర్థి కొణతాల రామకృష్ణకు విజయవకాశాలు ఎక్కువుగా ఉన్నట్లు తెలుస్తోంది.


AP High Court: ఎన్నికల వేళ.. వైసీపీకి మళ్లీ దెబ్బ

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Read Latest Andhra Pradesh News And Telugu News

Updated Date - Apr 24 , 2024 | 06:11 PM