Share News

Nara Bhuvaneswari: ఏబీఎన్‌తో.. నారా భువనేశ్వరి స్పెషల్ ఇంటర్వ్యూ..

ABN , Publish Date - Dec 20 , 2024 | 07:36 PM

చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయిన తరువాత ఏపీ అభివృద్ధిలో దూసుకుపోతోందని నారా భువనేశ్వరి అన్నారు. ఆయన సీఎంగా బాధ్యతలు చేపట్టిన వెంటనే పరిశ్రమలు రావడం మొదలైందని.. ఆరు మాసాల వ్యవధిలోనే ఉపాధి అవకాశాలు మెరుగుపడ్డాయని చెప్పారు. చిత్తూరు పర్యటనలో ఉన్న ఆమె.. శుక్రవారం నాడు ఏబీఎన్-ఆంధ్రజ్యోతితో ప్రత్యేకంగా మాట్లాడారు. సీఎం చంద్రబాబు ఆరు నెలల పాలనా తీరుపై తన అభిప్రాయాలను పంచుకున్నారు. మరి, ఇంటర్వ్యూలో ఆమె ఏం చెప్పారో ఈ కథనంలో తెలుసుకుందాం..

Nara Bhuvaneswari: ఏబీఎన్‌తో.. నారా భువనేశ్వరి స్పెషల్ ఇంటర్వ్యూ..
Nara Bhuvaneswari

చిత్తూరు డిసెంబర్ 20: చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయిన తరువాత ఏపీ అభివృద్ధిలో దూసుకుపోతోందని నారా భువనేశ్వరి అన్నారు. ఆయన సీఎంగా బాధ్యతలు చేపట్టిన వెంటనే పరిశ్రమలు రావడం మొదలైందని.. ఆరు మాసాల వ్యవధిలోనే ఉపాధి అవకాశాలు మెరుగుపడ్డాయని చెప్పారు. చిత్తూరు పర్యటనలో ఉన్న ఆమె.. శుక్రవారం నాడు ఏబీఎన్-ఆంధ్రజ్యోతితో ప్రత్యేకంగా మాట్లాడారు. సీఎం చంద్రబాబు ఆరు నెలల పాలనా తీరుపై తన అభిప్రాయాలను పంచుకున్నారు. మరి, ఇంటర్వ్యూలో ఆమె ఏం చెప్పారో ఈ కథనంలో తెలుసుకుందాం..


చిత్తూరులో పర్యటిస్తున్న ఏపీ సీఎం సతీమణి నారా భువనేశ్వరి ఏబీఎన్‌తో ప్రత్యేకంగా ముచ్చటించారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఆంధ్రప్రదేశ్‌లో జరిగిన అభివృద్ధి కార్యక్రమాలపై పలు కామెంట్స్ చేశారు. వైసీపీ ఐదేళ్ల పాలనలో ప్రజా సమస్యలను పట్టించుకోకుండా రాష్ట్ర అభివృద్ధిని గాలికొదిలేయడంతో.. ప్రజలు, మరీ ముఖ్యంగా మహిళలు నరకం అనుభవించారని అన్నారు. ఆర్థిక పరిస్థితులు పూర్తిగా తలకిందులైన స్థితిలో సీఎంగా బాధ్యతలు చేపట్టిన చంద్రబాబుగారి పాలనలో ఏపీ అభివృద్ధి పరుగులు పెడుతోందని వ్యాఖ్యానించారు.


కూటమి ప్రభుత్వం ఆరు మాసాల వ్యవధిలోనే ఎన్నో అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు చేపట్టిందని చెప్పారు నారా భువనేశ్వరి. అందరూ గమనిస్తే గత వైసీపీ పాలనకు, కూటమి ప్రభుత్వ పాలనకు తేడా స్పష్టంగా కనిపిస్తుందని తెలిపారు. ఐదేళ్లు రాష్ట్రానికి రాకుండా వెళ్లిపోయిన పరిశ్రమలు ఇప్పుడు రావడమే అందుకు తార్కాణమని వెల్లడించారు. ఆరు మాసాల వ్యవధిలోనే గ్రామస్థాయిలో కూడా కూటమి ప్రభుత్వం తీసుకున్న అభివృద్ధి చర్యల ఫలితం ప్రత్యక్షంగా కళ్లకు కడుతోందని అన్నారు.


మౌలిక వసతులు, ఇళ్ల స్థలాలు,ఉపాధి అవకాశాలు, బిడ్డలకు ఉద్యోగాలు కావాలని ఎక్కువగా డిమాండ్ వినిపిస్తోందని చెప్పారు భువనేశ్వరి. ప్రజలు కోరుకున్న విధంగానే ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు రాష్ట్రంలోని అన్ని జిల్లాల అభివృద్ధి చెందాలని రేయింబవవళ్లు శ్రమిస్తున్నారని తెలిపారు. రాష్ట్రంలో విస్తృత స్థాయిలో అభివృద్ధి పనులు జరుగుతున్నా వైసీపీ పార్టీ రోడ్లపైకి వచ్చి ఆందోళనల పేరిట రాజకీయాలు చేస్తోందని విమర్శించారు. కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టి ఆరు నెలలు గడవకముందే ఇలా చేయడం వింతగా అనిపిస్తోందన్నారు.


ఇక మంగళగిరి అభివృద్ధిపై లోకేష్ ఫోకస్ చేస్తే.. తాను కుప్పం నియోజకవర్గం అభివృద్ధిపై దృష్టి సారించానని తెలిపారు భువనేశ్వరి. ఈ అంశంలో మా ఇద్దరి మధ్య చాలా పోటీ ఉందని సరదాగా వ్యాఖ్యానించారు. ఈ రెండు నియోజకవర్గాలతో పాటు రాష్ట్రంలోని ప్రతి నియోజకవర్గ అభివృద్ధికి కూటమి ప్రభుత్వం కృషి చేస్తుందని పేర్కొన్నారు.

Updated Date - Dec 20 , 2024 | 07:36 PM