AP News: గుడివాడ గడ్డ - బెట్టింగ్ అడ్డా..
ABN , Publish Date - Apr 30 , 2024 | 09:33 AM
ఒకప్పుడు కేసినో.. ఇప్పుడు బెట్టింగ్ దందా. కాదేదీ గుడివాడకు అనర్హం అన్నట్టుగా అడ్డగోలు దందాలన్నీ కొనసాగుతున్నాయి. అధికార పార్టీ పైగా.. ఏదైనా చేయగల నేత కావడంతో పోలీసులు సైతం అటువైపు కన్నెత్తి చూసేందుకు కూడా జంకుతున్నారు. దీంతో సదరు నేత అనుచరులు మరింత రెచ్చిపోతుననారు. ప్రస్తుతం గుడివాడ గడ్డ.. బెట్టింగ్‌కు అడ్డాగా మారుతోంది.
గుడివాడ: ఒకప్పుడు కేసినో.. ఇప్పుడు బెట్టింగ్ దందా. కాదేదీ గుడివాడకు అనర్హం అన్నట్టుగా అడ్డగోలు దందాలన్నీ కొనసాగుతున్నాయి. అధికార పార్టీ పైగా.. ఏదైనా చేయగల నేత కావడంతో పోలీసులు సైతం అటువైపు కన్నెత్తి చూసేందుకు కూడా జంకుతున్నారు. దీంతో సదరు నేత అనుచరులు మరింత రెచ్చిపోతుననారు. ప్రస్తుతం గుడివాడ గడ్డ.. బెట్టింగ్‌కు అడ్డాగా మారుతోంది. బెట్టింగ్ వ్యామోహంతో ఎన్నో కుటుంబాలు చితికిపోతున్నాయి. గుడివాడ కేంద్రంగా బెట్టింగ్ ముఠాలు రెచ్చిపోతున్నాయి. ఎమ్మెల్యే కనుసన్నల్లోనే ప్రధాన క్రికెట్ బోర్డులు ఉండటం విశేషం.
మినీ ఇండియాలో.. ముక్కోణపు పోరు
బెట్టింగ్ బోర్డులకు సూత్రధారులుగా ఎమ్మెల్యే ప్రధాన అనుచరులు ఉన్నారు. గుడివాడలో యువత, మధ్యతరగతి ఉద్యోగులే లక్ష్యంగా బెట్టింగ్ బోర్డులు బరితెగిస్తున్నాయి. యువతను బుకీలు బెట్టింగ్ బానిసలుగా మార్చారు. బెట్టింగ్‌లో ఓడిపోతే అధిక వడ్డీలకు అప్పులు ఇచ్చి మరీ ఎమ్మెల్యే అనుచరులు లెక్కల్లో జమ చేసుకుంటున్నారు. కొడాలి నాని అనుచరులు కావడంతో పోలీసులు సైతం పట్టించుకోవడం లేదు. ఇకనైనా పోలీసులు మేల్కొని, ఎమ్మెల్యే అనుచరుల బెట్టింగ్ బోర్డుల ఆగడాలు అరికట్టి, కుటుంబాలు చితికిపోకుండా కాపాడాలని స్థానికులు కోరుతున్నారు.
AP Elections: ఇది నా ఆస్తి అని మనం రుజువు చేసుకోవాలా?.. జగన్‌పై మండిపడ్డ పవన్
Chandrababu: నేడు తెనాలిలో చంద్రబాబు నాయుడు పర్యటన
Read Latest AP News And Telugu News