Share News

Andhra Pradesh: ఏబీఎన్-ఆంధ్రజ్యోతి ఎఫెక్ట్ .. ఆర్థికమంత్రి పయ్యావుల సీరియస్

ABN , Publish Date - Aug 29 , 2024 | 11:08 AM

గత ప్రభుత్వంలో చేసిన బిల్లుల చెల్లింపు అంశంపై ఆర్థికమంత్రి పయ్యావుల కేశవ్ సీరియస్‌గా ఉన్నారు. తనకు తెలియకుండా నిధులు ఎలా విడుదల చేస్తారని ప్రశ్నించారు. దాంతో ఉన్నతాధికారులు ఆగమేఘాల మీద ఏం జరిగిందో తెలుసుకునే ప్రయత్నం చేశారు.

Andhra Pradesh: ఏబీఎన్-ఆంధ్రజ్యోతి ఎఫెక్ట్ .. ఆర్థికమంత్రి పయ్యావుల సీరియస్
Andhra Pradesh Finance Minister Payyavula Keshav

అమరావతి: ఆంధ్రప్రదేశ్ ఆర్థికమంత్రికి తెలియకుండానే గత ప్రభుత్వంలో జరిగిన బిల్లుల చెల్లింపు జరిగింది. ఈ విషయాన్ని ఏబీఎన్ ఆంధ్రజ్యోతి వెలుగులోకి తీసుకొచ్చింది. ఆంధ్రజ్యోతి కథనాలతో ఆర్థికశాఖ మంత్రి పయ్యావుల కేశవ్ (Payyavula Keshav) స్పందించారు. ఆ బిల్లుల చెల్లింపు గురించి ఆరా తీశారు. ఎవరు..? ఎలా విడుదలు చేశారని ప్రశ్నించారు. ఆర్థికమంత్రి ఆదేశాలతో ఉన్నతాధికారులు బిల్లుల చెల్లింపు అంశంపై విచారిస్తున్నారు.


cm chandrababu.jpg


పయ్యావుల సీరియస్..

గత ప్రభుత్వంలో చేసిన బిల్లుల చెల్లింపు అంశంపై ఆర్థికమంత్రి పయ్యావుల కేశవ్ సీరియస్‌గా ఉన్నారు. తనకు తెలియకుండా నిధులు ఎలా విడుదల చేస్తారని ప్రశ్నించారు. దాంతో ఉన్నతాధికారులు ఆగమేఘాల మీద ఏం జరిగిందో తెలుసుకునే ప్రయత్నం చేశారు. చివరికి యూసీల పేరుతో బిల్లుల చెల్లింపు జరిగిందని వివరించారు. నిధుల విడుదలకు సంబంధించి వ్యవహారంపై లోతుగా దర్యాప్తు చేస్తున్నారు. నిధుల విడుదల కోసం అడిగింది ఎవరు..? ఏ అధికారుల ఆదేశాలతో రిలీజ్ అయ్యాయనే అనే అంశాలపై నివేదిక రూపొందిస్తున్నారు.


chandrababu.jpg


సీఎంకు వివరణ

బిల్లుల చెల్లింపు అంశంపై అధికారులు నివేదిక సిద్దం చేస్తున్నారు. ఆ నివేదికను ముఖ్యమంత్రి చంద్రబాబుకు ఆర్థికమంత్రి పయ్యావుల కేశవ్ అందజేస్తారు. అసలు ఏం జరిగింది, తప్పు ఎక్కడ జరిగిందనే అంశంపై వివరిస్తారు. సీఎంకు నివేదిక అందజేసిన తర్వాత తదుపరి చర్యలు ఉంటాయి. బాధ్యులపై కఠిన చర్యలు ఉండే అవకాశం ఉంది.


Telangana-TDP.jpg


ఆనాటి బిల్లులు పెండింగ్..

ఆ బిల్లులు ఎవరు చెల్లించారని సర్వత్రా చర్చ నెలకొంది. ఆర్థికశాఖ మంత్రి ఆమోదం పొందకుండా ఎలా బిల్లులు చెల్లిస్తారని చర్చ జరుగుతోంది. 2014లో తెలుగుదేశం హయాంలో పెండింగ్ బిల్లులు ఉన్నాయి. వాటిని గత వైసీపీ ప్రభుత్వం విడుదల చేయలేదు. అదే విషయాన్ని కొందరు టీడీపీ నేతలు ప్రస్తావిస్తున్నారు. ఆర్థికమంత్రి పయ్యావుల కేశవ్ జిల్లా (అమరావతి) పర్యటనలో ఉండగా.. ఆయనకు తెలియకుండా ఎలా బిల్లులు విడుదల చేస్తారని ప్రశ్నిస్తున్నారు. జరిగిన తప్పిదంపై ప్రభుత్వం సీరియస్‌గా ఉంది. తప్పు చేసిన వారిపై చర్యలు ఉంటాయని స్పష్టం చేస్తోంది.


For
Latest News click here

Updated Date - Aug 29 , 2024 | 12:22 PM