Share News

Andhra Pradesh News: లిక్కర్ లాటరీలో జోక్యంపై సర్కార్ సీరియస్

ABN , Publish Date - Oct 07 , 2024 | 05:06 PM

ఆంధ్రప్రదేశ్‌లో మద్యం షాపుల కోసం జారీచేసిన లాటరీ వ్యవహారం కాక రేపుతోంది. లాటరీ విషయంలో ఎమ్మెల్యేలు జోక్యం చేసుకుంటారని ఏబీఎన్ ఆంధ్రజ్యోతి వరస కథనాలు రాసింది. ఆ విషయం అధికారుల ద్వారా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తెలుసుకున్నారు.

Andhra Pradesh News: లిక్కర్ లాటరీలో జోక్యంపై సర్కార్ సీరియస్
Andhra Pradesh Government

అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో (Andhra Pradesh) మద్యం షాపుల కోసం జారీచేసిన లాటరీ వ్యవహారం కాక రేపుతోంది. లాటరీ విషయంలో ఎమ్మెల్యేలు జోక్యం చేసుకుంటారని ఏబీఎన్ ఆంధ్రజ్యోతి వరస కథనాలు రాసింది. లిక్కర్ లాటరీ వ్యవహారంలో ఆంధ్రజ్యోతి కథనాలతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం స్పందించింది. ఎమ్మెల్యేలు జోక్యం చేసుకోవద్దని సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు.


CM-Chandrababu.jpg


జోక్యం ఉండదు..

లిక్కర్ లాటరీ కోసం ఎక్సైజ్ శాఖ నోటిఫికేషన్ జారీ చేసింది. ఒక్కో షాపు కోసం రూ.2 లక్షల డీడీ ఇవ్వాల్సి ఉంటుంది. ఈ డబ్బులు నాన్ రీఫండబుల్. లిక్కర్ షాపులో విషయంలో అధికార పార్టీ ఎమ్మెల్యేలు జోక్యం చేసుకుంటారని తెలిసింది. ఇదే విషయాన్ని ఏబీఎన్ ఆంధ్రజ్యోతి వరసగా కథనాలు రాసింది. ఏబీఎన్ కథనాల గురించి సీఎం చంద్రబాబు అధికారులను ఆరా తీశారు. క్షేత్రస్థాయిలో ఏం జరుగుతుందో తెలుసుకున్నారు. మద్యం షాపులో ఎవరి జోక్యం ఉండదని స్పష్టం చేశారు. ఇదే విషయాన్ని ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర స్పష్టం చేశారు.


LIQUOR SHOP.jpg


బెదిరింపులు..

లిక్కర్ షాపుల కోసం అందరూ దరఖాస్తు చేసుకోవచ్చు. కొందరు వ్యాపారులను కూటమి ఎమ్మెల్యేలు బెదిరిస్తున్నారని తెలుస్తోంది. మెయిన్ సెంటర్లలో అప్లై చేసుకునే వారిపై కూటమి ఎమ్మెల్యేలు ఫోకస్ చేశారు. ఇదే విషయాన్ని ఏబీఎన్ ఆంధ్రజ్యోతి కథనాలు రాసి ప్రభుత్వాన్ని అప్రమత్తం చేసింది. లిక్కర్ షాపుల దరఖాస్తు కోసం 48 గంటల సమయం మాత్రమే ఉంది. దాంతో లిక్కర్ లాటరీకి సంబంధించి ఎవరి ప్రమేయం ఉండదని, ఎవ్వరూ జోక్యం చేసుకోవద్దని మంత్రి కొల్లు రవీంద్ర స్పష్టం చేశారు.


liquor-2.gif


ఏబీఎన్ కథనాలు..

లిక్కర్ లాటరీకి సంబంధించి ఏబీఎన్ వరస కథనాలు రావడంతో లిక్కర్ సిండికేట్లలో కలవరం మొదలైంది. ఏబీఎన్ ఆంధ్రజ్యోతి కథనాలతో తమకు ఎసరొచ్చే ప్రమాదం ఉందని భావిస్తోంది. వారికి తెలిసిన కొందరు ఎమ్మెల్యేలకు ఈ విషయం స్పష్టం చేసినట్టు తెలుస్తోంది. సదరు ఎమ్మెల్యేలు అధికారులకు ఫోన్ చేసి ఒత్తిడి చేసినట్టు సమచాారం. విషయం సీఎం చంద్రబాబు వరకు తెలియడంతో, ఏమి చేయలేమని.. నిబంధనల మేరకు షాపుల కేటాయింపు ఉంటుందని అధికారులు తెలియజేసినట్టు తెలుస్తోంది.

ఇవి కూడా చదవండి.

AP Govt: పీవీ సునీల్‌ కుమార్‌పై ప్రభుత్వం చర్యలు


మరిన్ని ఏపీ వార్తల కోసం

Updated Date - Oct 07 , 2024 | 05:36 PM