Share News

YCP: పాలవెల్లువ కేంద్రాలపై వైసీపీ నేతల కన్ను.. పాలసేకరణకు బదులుగా వారు చేస్తున్నదేంటో తెలిస్తే...

ABN , Publish Date - Jan 20 , 2024 | 11:11 AM

Andhrapradesh: రాష్ట్రంలో వైసీపీ నేతలు చేస్తున్న అక్రమాలకు అంతేలేకుండాపోతున్న విషయం తెలిసిందే. పేద ప్రజల కోసం సంక్షేమ పథకాలు అంటూనే వాటిని తమకు అనుకూలంగా ఉపయోగించుకునేలా అధికారపార్టీ నేతలు వ్యవహరిస్తున్న పరిస్థితి.

YCP: పాలవెల్లువ కేంద్రాలపై వైసీపీ నేతల కన్ను.. పాలసేకరణకు బదులుగా వారు చేస్తున్నదేంటో తెలిస్తే...

పల్నాడు, జనవరి 20: రాష్ట్రంలో వైసీపీ నేతలు చేస్తున్న అక్రమాలకు అంతే లేకుండాపోతున్న విషయం తెలిసిందే. పేద ప్రజల కోసం సంక్షేమ పథకాలు అంటూనే వాటిని తమకు అనుకూలంగా ఉపయోగించుకునేలా అధికార పార్టీ నేతలు వ్యవహరిస్తున్న పరిస్థితి. పాలవెల్లువ కేంద్రాల పట్ల వైసీపీ నేతలు వ్యవహరిస్తున్న తీరే ఇందుకు నిదర్శనం. తాజాగా వైసీపీ నేతల కన్ను పాలవెల్లువ కేంద్రాలపై పడింది. పాలవెల్లువ కేంద్రంలో పాలసేకరణకు బదులుగా వైసీపీ నేతలు చేస్తున్న వ్యాపారం చూసి అందరూ ముక్కున వేలేసుకుంటున్నారు.


పక్కదారి పడుతున్న లక్ష్యం!

పాడిరైతులకు గిట్టుబాటు ధర కల్పించడమే లక్ష్యంగా ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి 2020 డిసెంబర్‌లో జగనన్న పాలవెల్లువ పథకానికి శ్రీకారం చుట్టారు. మహిళలు ఆర్థిక పురోభివృద్ధి దిశగా ముందుకు సాగేందుకు జగనన్న పాలవెల్లువ పేరుతో ప్రభుత్వం ఈ పథకాన్ని మొదలుపెట్టింది. అయితే ఈ పథకం ప్రకారం పాలవెల్లువ కేంద్రాల్లో పాలసేకరణ జరుగుతోంది. కానీ పల్నాడు జిల్లా గురజాల మండలం గోగులపాడు పాలవెల్లువ కేంద్రంలో పాలసేకరణకు బదులు మరో వ్యాపారానికి వైసీపీ నేతలు తెరతీశారు.

పాలవెల్లువ కేంద్రంలో వైసీపీ నేతలు ఎరువుల వ్యాపారానికి పూనుకున్నారు. జగనన్న పాలవెల్లువ కేంద్రం అంటూ గురజాల ఎమ్మెల్యే కాసు మహేష్ రెడ్డి నూతన భవనాన్ని నిర్మించారు. దాదాపు రూ. 15.74 లక్షల రూపాయలతో పాలవెల్లువ కేంద్రాన్ని వైసీపీ ప్రభుత్వం నిర్మించింది. అయితే ఆ కేంద్రంలో వైసీపీ నేతలు పాలసేకరణ చేయకుండా ఎరువుల వ్యాపారాన్ని చేస్తున్నారు. దీంతో పాలవెల్లువ కేంద్రంలో ఎరువుల వ్యాపారంపై గ్రామస్తులు విస్తుపోతున్నారు. ఇదేం విచిత్రం అంటూ గ్రామస్తులు ఆశ్చర్యపోతున్నారు. ఇంత జరుగుతున్నప్పటికీ పట్టించుకునే వారు లేరంటూ గ్రామస్థులు ఆగ్రహం వ్యక్తం చేశారు.

మరిన్ని ఏపీ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి...

Updated Date - Jan 20 , 2024 | 11:20 AM