Share News

Chandrababu: సీఎస్, డీజీపీకి సీఎం చంద్రబాబు ఆదేశం

ABN , Publish Date - Aug 31 , 2024 | 12:35 PM

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా వర్షాలు దంచి కొడుతున్నాయి. కొన్ని చోట్ల భారీ వర్షం కురుస్తోంది. వర్ష ప్రభావంతో జనం ఇళ్లలోనే ఉండిపోయారు. కొన్ని చోట్ల బయటకు రాలేని పరిస్థితి నెలకొంది. వర్షాలపై మంత్రులు, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, డీజీపీ, జిల్లా కలెక్టర్లు, ఎస్పీలు సహా ఆయా శాఖల అధికారులతో సీఎం చంద్రబాబు టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు.

Chandrababu: సీఎస్, డీజీపీకి సీఎం చంద్రబాబు ఆదేశం
CM Chandrababu Naidu

అమరావతి: వాయుగుండం ప్రభావంతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. వర్షాలతో జనజీవనం ఎక్కడికక్కడ స్తంభించిపోయింది. వాగులు, వంకలు పొంగి పొర్లుతున్నాయి. కొన్ని గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. వర్ష ప్రభావం మరో రెండు, మూడు రోజులు ఉంటుందని వాతావరణ శాఖ ప్రకటించింది. వర్ష ప్రభావంతో ఆంధ్రప్రదేశ్ సీఎం నారా చంద్రబాబు నాయుడు (CM Chandrababu Naidu) ఎప్పటికప్పుడు అధికారులతో సమీక్ష నిర్వహిస్తున్నారు. వర్షాలతో ఓర్వకల్లు పర్యటనను రద్దు చేసుకొని మరి సమీక్షిస్తున్నారు.


rain.jpg


మరో 3 రోజులు వాన

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా వర్షాలు దంచి కొడుతున్నాయి. కొన్ని చోట్ల భారీ వర్షం కురుస్తోంది. వర్ష ప్రభావంతో జనం ఇళ్లలోనే ఉండిపోయారు. కొన్ని చోట్ల బయటకు రాలేని పరిస్థితి నెలకొంది. వర్షాలపై మంత్రులు, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, డీజీపీ, జిల్లా కలెక్టర్లు, ఎస్పీలు సహా ఆయా శాఖల అధికారులతో సీఎం చంద్రబాబు టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. ‘మరో మూడు రోజులు వర్షం ప్రభావం ఉండనుంది. అప్రమత్తంగా ఉండాలని యంత్రాంగాన్ని ఆదేశించా. భారీ వర్షాలు, వరదల సమయంలో ప్రభుత్వ యంత్రాంగం అప్రమత్తతో ఉంటే ప్రజల ఇబ్బందులను తగ్గించొచ్చు. ఇరిగేషన్ శాఖ, రెవెన్యూ శాఖ సమన్వయంతో చెరువుల పరిస్థితిని ఎప్పటికప్పుడు పరిశీలించాలి. పట్టణ ప్రాంతాల్లో రోడ్లపై భారీ స్థాయిలో నీరు చేరి ట్రాఫిక్‌కు ఇబ్బంది కలుగుతోంది. పరిస్థితికి అనుగుణంగా ట్రాఫిక్ మళ్లింపు చేపట్టి, ప్రజలు ఇబ్బందులు పడకుండా చూడాలి అని’ అధికారులకు సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు.


Rain.gif


సీజనల్ వ్యాధులు ప్రబలే అవకాశం

‘వర్షాలు, వరదల వల్ల తాగునీరు, ఆహారం కలుషితం అయ్యే అవకాశం ఎక్కువ ఉంది. అల్లూరి జిల్లాలో కలుషిత ఆహారం ఘటన జరిగింది. బాధితులకు మెరుగైన వైద్యసాయం అందించాలి. కలుషిత ఆహారం ఘటనకు గల కారణాలపై విచారణ జరిపి చర్యలు తీసుకోవాలి. సీజనల్ వ్యాధుల తీవ్రత దృష్ట్యా మరింత సమర్థవంతంగా పనిచేయాలని వైద్య శాఖ అధికారులకు ఆదేశించా. ఏజెన్సీలో జ్వరాల బారిన పడిన గిరిజనులకు మెరుగైన వైద్యం అందేలా చూడాలి. ఉధృతంగా ప్రవహిస్తున్న కాలువలు, వాగులు దాటేందుకు ప్రజలను అనుమతించవద్దు. వాట్సాప్ గ్రూప్‌ల ద్వారా వివిధ శాఖల అధికారులు నిత్యం సంప్రదింపులు జరుపుకుని సమన్వయంతో పనిచేయాలి. క్రైసిస్ మేనేజ్మెంట్ విషయంలో డ్రోన్లు వంటి టెక్నాలజీ వాడండి. డిజాస్టర్ మేనెజ్‌మెంట్ శాఖ ద్వారా ప్రజలకు ఎప్పటికప్పుడు వర్షాలపై సమాచారం ఇవ్వాలి. భారీ వర్షాలు, వరదలపై ఆయా ప్రాంతాల ప్రజల ఫోన్లకు అలెర్ట్ మెసేజ్ పంపించాలి. విపత్తు వచ్చిన సమయంలో ప్రభుత్వం తమకు ఆదుకుంటుందనే నమ్మకం వారికి కల్పించేలా అధికారులు చర్యలు తీసుకోవాలి. ఇరిగేషన్ ప్రాజెక్టుల్లో నీటి నిల్వలను నిరంతరం మానిటర్ చేయాలి.సాగునీటి ప్రాజెక్టుల నిర్వహణకు అవసరమైన నిధులు విడుదల కోసం ఆదేశాలు ఇచ్చా. ప్రాజెక్టుల నిర్వహణకు అత్యంత ప్రాధాన్యం ఇస్తాం. అధికారులు బాధ్యతగా ఉండాలి అని’ సీఎం చంద్రబాబు తేల్చి చెప్పారు.


rains3.jpg


మూడు రోజుల్లో పెన్షన్ల పంపిణీ పూర్తి

‘పెన్షన్ల పంపిణీ విషయంలో సచివాలయ ఉద్యోగులకు వెసులుబాటు ఇచ్చాం. రేపు సెలవు కాబట్టి ముందు రోజే పెన్షన్లు ఇవ్వాలని చూశాం. భారీ వర్షాల వల్ల పెన్షన్ల పంపిణీ సమయం పెంచాం. వచ్చే రెండు మూడు రోజుల్లో సచివాలయ ఉద్యోగులు పెన్షన్ల పంపిణీని పూర్తి చెయ్యవచ్చు. వర్షాలు లేని ప్రాంతాల్లో యధావిధిగా పెన్షన్ల పంపిణీ కొనసాగుతుంది. విజయవాడలో కొండచరియలు విరిగి ఇంటిపై పడిన ఘటన బాధ కలిగించింది. ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలను ప్రభుత్వం ఆదుకుంటుంది అని’ సీఎం చంద్రబాబు ప్రకటన చేశారు.


chandrababu.jpg

Updated Date - Aug 31 , 2024 | 12:35 PM