Share News

IAS, IPS officers: ఏపీలో ఐఏఎస్‌, ఐపీఎస్ అధికారులకు పదోన్నతులు

ABN , Publish Date - Dec 31 , 2024 | 05:12 PM

IAS officers: ఏపీలో సీనియర్‌ ఐఏఎస్‌, ఐపీఎస్ అధికారులకు కూటమి ప్రభుత్వం పదోన్నతులు కల్పిచింది. ఐదుగురు IAS అధికారులకు పదోన్నతులు కల్పించింది. పెట్టుబడులు, మౌలిక సదుపాయాల శాఖ సీఎస్‌గా సురేష్ కుమార్‌ను నియమించింది.

IAS, IPS officers: ఏపీలో ఐఏఎస్‌, ఐపీఎస్ అధికారులకు పదోన్నతులు
IAS, IPS officers

అమరావతి: ఏపీలో సీనియర్‌ ఐఏఎస్‌, ఐపీఎస్ అధికారులకు కూటమి ప్రభుత్వం పదోన్నతులు కల్పిచింది. ఐదుగురు ఐఏఎస్‌ అధికారులకు పదోన్నతులు కల్పించింది. పెట్టుబడులు, మౌలిక సదుపాయాల శాఖ సీఎస్‌గా సురేష్ కుమార్‌ను నియమించింది. ప్రస్తుతం కేంద్రంలో సాల్మన్ ఆరోక్య రాజ్ డిప్యుటేషన్‌పై ఉన్నారు. కార్తికేయ మిశ్రా, వీరపాండ్యన్, CH శ్రీధర్‌కు.. కార్యదర్శి హోదా కల్పిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రస్తుతం సీఎంఓలో సహాయ కార్యదర్శిగా కార్తికేయ మిశ్రా ఉన్నారు. కొత్తగా అక్కడే సీఎం కార్యదర్శిగా కార్తికేయ మిశ్రాకు పదోన్నతి కల్పించింది. గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ సీఈఓగా వీరపాండ్యన్‌ను నియమించింది. కడప జిల్లా కలెక్టర్‌గా CH శ్రీధర్ కొనసాగనున్నారు. ఇద్దరు ఐపీఎస్‌లు విక్రాంత్ పాటిల్, సిద్ధార్థ్ కౌశల్‌కు ఏపీ ప్రభుత్వం పదోన్నతులు కల్పిచింది.


ఈ వార్తలు కూడా చదవండి

Palla Srinivasa Rao: మంత్రుల మార్పుపై.. పల్లా శ్రీనివాసరావు షాకింగ్ కామెంట్స్

AP High Court: పేర్నినానికి హైకోర్టులో స్వల్ప ఊరట

AP News: చిత్తూరు జడ్పీ సమావేశంలో రచ్చ రచ్చ

AP News: న్యూఇయర్ వేడుకలకు దూరంగా ఏపీ మంత్రి.. కారణమిదే

Read Latest AP News And Telugu News

Updated Date - Dec 31 , 2024 | 05:50 PM