Share News

AP News: ఏపీ బేవరేజస్ కార్పొరేషన్ మాజీ ఎండీ వాసుదేవ రెడ్డిపై సీఐడీ కేసు

ABN , Publish Date - Jun 07 , 2024 | 10:33 PM

ఏపీ బేవరేజస్ కార్పొరేషన్ మాజీ ఎండీ వాసుదేవ రెడ్డి పై సీఐడీ కేసు నమోదు చేసింది. కంచికచర్ల మండలం మిగులూరుగ్రామానికి చెందిన గద్దె శివరామకృష్ణ ఇచ్చిన ఫిర్యాదు సీబీఐ అధికారులు కేసు నమోదు చేశారు.

AP News: ఏపీ బేవరేజస్ కార్పొరేషన్ మాజీ ఎండీ వాసుదేవ రెడ్డిపై సీఐడీ  కేసు

అమరావతి: ఏపీ బేవరేజస్ కార్పొరేషన్ మాజీ ఎండీ వాసుదేవ రెడ్డి పై సీఐడీ కేసు నమోదు చేసింది. కంచికచర్ల మండలం మిగులూరుగ్రామానికి చెందిన గద్దె శివరామకృష్ణ ఇచ్చిన ఫిర్యాదు సీబీఐ అధికారులు కేసు నమోదు చేశారు. ఈ నెల 6 వ తేదీన ప్రసాదంపాడు గ్రామంలో ఒక కార్లో ప్రభుత్వ ఫైళ్లు, కంప్యూటర్, ఇతర సామగ్రి వేసుకుని వెళ్తున్నట్టు శివరామకృష్ణ గమనించారు. ఇదేంటని ప్రశ్నిస్తే ఆయన అక్కడ నుంచి విసురుగా వెళ్లారని ఫిర్యాదు చేశారు.


ఆరా తీస్తే ఆయన బేవరేజస్ కార్పొరేషన్ ఎండీ వాసుదేవ రెడ్డి అని తేలిందని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ ఫిర్యాదుపై సీఐడీ కేసు నమోదు చేసింది. IPC లోని 427, 379 రెడ్ విత్ 120(B) సెక్షన్లు కింద కేసు నమోదు అయింది.నెల్లూరు సీఐడీ డీఎస్పీ P శ్రీనివాసులను దర్యాప్తు అధికారిగా నియమించారు. ఈ మేరకు సీఐడీ IG ఉత్తర్వులు జారీ చేశారు. ఈ ఫిర్యాదు మేరకు హైదరాబాద్‌లోని వాసుదేవ రెడ్డి నివాసంలో సీఐడీ తనిఖీలు చేపట్టిన విషయం తెలిసిందే.


ఏపీ బెవరేజెస్‌ ఎండీగా పనిచేసిన వాసుదేవరెడ్డి నివాసంలో సీఐడీ సోదాలు నిర్వహించింది. హైదరాబాద్‌ నానక్‌రామ్‌గూడలోని వాసుదేవరెడ్డి నివాసంలో ఉదయం నుంచి సోదాలు జరుగుతున్నాయి. జగన్‌ హయాంలో మద్యం దోపిడీ పర్వాన్ని ముందుండి నడిపించారని ఆరోపణలు వెల్లువెత్తడంతో సీఐడీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. వైసీపీకి కరడుగట్టిన మద్దతుదారుగా వాసుదేవరెడ్డి పని చేశారు.


వైసీపీకి అనుచిత లబ్ధి కలిగించేలా భారీ ఎత్తున మద్యం సరఫరా చేశారని ఫిర్యాదులు అందాయి. నూతన మద్యం విధానం పేరుతో వైసీపీ నేతలకు లబ్ధి కలిగేలా పనిచేశారని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఏపీలో జే-బ్రాండ్‌ మద్యం తీసుకురావడంలో వాసుదేవరెడ్డిది కీలకపాత్ర. డిస్టిలరీలన్నీ అనధికారికంగా వైసీపీ నేతల చేతుల్లోకి వెళ్లడంలో వాసుదేవరెడ్డిది కీలకపాత్ర. జే-బ్రాండ్‌ మద్యం ప్రభుత్వ దుకాణాల్లో అమ్మించిన ఘనత వాసుదేవరెడ్డిదేనని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.

For more AP News and Telugu News

Updated Date - Jun 07 , 2024 | 10:34 PM