Share News

CM Chandrababu: ఇంటింటికి వెళ్లి పింఛన్లు పంపిణీ చేయనున్న సీఎం చంద్రబాబు

ABN , Publish Date - Dec 31 , 2024 | 10:59 AM

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మంగళవారం ఉదయం నుంచి ముమ్మరంగా ఎన్టీఆర్ భరోసా పింఛన్ల పంపిణీ కార్యక్రమం జరుగుతోంది. 63,77,943 మందికి పింఛన్ల పంపిణీ కోసం రూ.2717 కోట్లు ప్రభుత్వం విడుదల చేసింది. పల్నాడు జిల్లా, నర్సరావుపేట మండలం, ఎలమంద గ్రామంలో సీఎం చంద్రబాబు ఇంటింటికి వెళ్లి లబ్దిదారులకు పెన్షన్లు అందజేస్తారు.

CM Chandrababu:  ఇంటింటికి వెళ్లి పింఛన్లు పంపిణీ చేయనున్న సీఎం చంద్రబాబు

అమరావతి: ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు (CM Chandrababu Naidu) సామాజిక భద్రతా పింఛన్లను ఒక రోజు ముందుగానే రాష్ట్ర వ్యాప్తంగా పంపిణీ చేస్తున్నారు. అందులో భాగంగా మంగళవారం ఉదయం10:30 గంటలకు ఉండవల్లిలోని తన నివాసం నుంచి బయలుదేరి పల్నాడు జిల్లా (PalnaduDist.), నర్సరావుపేట మండలం (Narasarao Peta Mandalam), ఎలమంద గ్రామానికి (Ealamanda Village) వెళతారు. 11 గంటలకు ఎలమంద గ్రామంలో లబ్ధిదారులకు సామాజిక భద్రతా పింఛన్లను (Pensions) ఇంటింటికి (Door to door) వెళ్లి పంపిణీ చేయనున్నారు. 11:30 లకు ఎలమంద గ్రామంలో దేవాలయాన్ని సందర్శించనున్నారు. అనంతరం పెన్షన్ లబ్ధిదారులు, ఎలమంద గ్రామస్తులతో సమావేశం అవుతారు. మధ్యాహ్నం 12:40 గంటలకు ప్రజాప్రతినిధులు జిల్లా అధికారులతో సీఎం భేటీ అవుతారు. 1:45 గంటలకు కోటప్పకొండ త్రికోటేశ్వర స్వామిని దర్శించుకోనున్నారు. తిరిగి సాయంత్రం 3 గంటలకు హెలికాప్టర్ ద్వారా సీఎం చంద్రబాబు ఉండవల్లి తన నివాసానికి చేరుకుంటారు.


ఎన్టీఆర్ భరోసా పింఛన్ల పంపిణీ

రాష్ట్రంలో మంగళవారం ఉదయం నుంచి ముమ్మరంగా ఎన్టీఆర్ భరోసా పింఛన్ల పంపిణీ కార్యక్రమం జరుగుతోంది. 63,77,943 మందికి పింఛన్ల పంపిణీ కోసం రూ.2717 కోట్లు ప్రభుత్వం విడుదల చేసింది. కొత్త సంవత్సరం నేపథ్యంలో 31వ తేదీనే పింఛన్ల పంపిణీ కార్యక్రమాన్ని కూటమి ప్రభుత్వం చేపట్టింది. జనవరి 1కి ముందే పేదల ఇళ్లల్లో పింఛను డబ్బు ఉండాలని ఒక రోజు ముందుగానే పెన్షన్ పంపిణీ కార్యక్రమం చేపట్టింది. మంగళవారం ఉదయం నుంచి ఇప్పటి వరకు 83.45 శాతం మందికి పింఛన్ల పంపిణీ పూర్తి చేశారు. ఉదయం 10 గంటలకు సమయానికే 53,22,406 మందికి రూ.2256 కోట్లు పంపిణీ చేశారు. లబ్దిదారుల ఇళ్లను జీయో ట్యాగింగ్ చేసి పింఛన్ల పంపిణీ కార్యక్రమాన్ని అధికారులు పరిశీలిస్తున్నారు. ఇళ్ల వద్దే పింఛన్లు ఇస్తున్నారా లేదా అనే విషయాన్ని జీయో ట్యాగింగ్ ద్వారా గమనిస్తున్నారు. ప్రతి ఒక్కరికి ఇంటి వద్దనే పింఛన్లు ఇవ్వాలనే ఉద్దేశ్యంతో జీయో ట్యాగింగ్ విధానాన్ని ప్రభుత్వం తీసుకువచ్చింది. కాగా పల్నాడు జిల్లా, యల్లమంద గ్రామంలో మరి కొద్దిసేపట్లో పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో సీఎం చంద్రబాబు పాల్గొననున్నారు.


గుడివాడలో పింఛన్లు పంపిణీ చేసిన వెనిగండ్ల రాము

కృష్ణా జిల్లా, గుడివాడ 11వ వార్డులో ఎమ్మెల్యే వెనిగండ్ల రాము ఇంటింటికి వెళ్లి ఎన్టీఆర్ భరోసా పింఛన్లు పంపిణీ చేశారు. పలువురు లబ్ధిదారులకు ప్రభుత్వం నూతనంగా ప్రవేశపెట్టిన ఫౌజ్ పింఛన్ల నగదు కూడా ఎమ్మెల్యే అందించారు. ఈ సందర్భంగా వార్డులో ప్రజల సమస్యలు అడిగి తెలుసుకున్నారు. ‘మీ కోసం మీ వెనిగండ్ల’ కార్యక్రమాన్ని ఎమ్మెల్యే రాము నిర్వహించారు. ప్రజా సంక్షేమానికి కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందని ఆయన స్పష్టం చేశారు.

విశాఖ, గోపాలపట్నంలో ఎమ్మెల్యే గణబాబు

రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదేశాలు మేరకు ఒకరోజు ముందుగానే పెన్షన్లు పంపిణీ కార్యక్రమంలో ప్రభుత్వ విప్ పశ్చిమ నియోజకవర్గం ఎమ్మెల్యే గణబాబు పాల్గొన్నారు. మంగళవారం తెల్లవారుజామున ఆరు గంటలకే పెన్షన్ లబ్ధిదారుల ఇంటికి వెళ్లి స్వయంగా పెన్షన్లు ఆయన అందజేశారు. న్యూ ఇయర్‌కు ఒకరోజు ముందుగానే ఇంటింటికి వెళ్లి పెన్షన్లు అందజేయడంతో పెన్షన్ దారులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.


ఈ వార్తలు కూడా చదవండి..

నూతన సంవత్సర వేడుకల జోష్

రేషన్ బియ్యం మాయం కేసులో అరెస్టులు..

పీఎస్‌ఎల్‌వి-సి 60 విజయవంతంపై సీఎం చంద్రబాబు హర్షం

Read Latest AP News and Telugu News

Read Latest Telangana News and National News

Read Latest Chitrajyothy News and Sports News

Updated Date - Dec 31 , 2024 | 10:59 AM