Share News

Chandrababu: చంద్రబాబు పెన్షన్ల పంపిణీ షెడ్యూల్ ఇదే..

ABN , Publish Date - Jun 30 , 2024 | 08:03 PM

ఆంధ్రప్రదేశ్(Andhra Pradesh) అసెంబ్లీ ఎన్నికల్లో భాగంగా ఇచ్చిన ప్రతీ హామీని సీఎం చంద్రబాబు(CM Chandrababu) ఒక్కొక్కటిగా నేరవేరుస్తున్నారు. హామీల్లో భాగంగా పెంచిన పెన్షన్(Pension) రూ.4వేలు ఇచ్చేందుకు జులై 1నుంచి శ్రీకారం చుట్టనున్నారు. ఈ కార్యక్రమానికి తాడేపల్లి మండలం పెనుమాక గ్రామం వేదిక కానుంది.

Chandrababu: చంద్రబాబు పెన్షన్ల పంపిణీ షెడ్యూల్ ఇదే..

అమరావతి: ఆంధ్రప్రదేశ్(Andhra Pradesh) అసెంబ్లీ ఎన్నికల్లో భాగంగా ఇచ్చిన ప్రతీ హామీని సీఎం చంద్రబాబు(CM Chandrababu) ఒక్కొక్కటిగా నేరవేరుస్తున్నారు. హామీల్లో భాగంగా పెంచిన పెన్షన్(Pension) రూ.4వేలు ఇచ్చేందుకు జులై 1నుంచి శ్రీకారం చుట్టనున్నారు. ఈ కార్యక్రమానికి తాడేపల్లి మండలం పెనుమాక గ్రామం వేదిక కానుంది. ఈ మేరకు సీఎం పెనుమాక గ్రామంలో సోమవారం రోజున పర్యటించనున్నారు.


ముఖ్యమంత్రి చంద్రబాబు రేపు(సోమవారం) ఉదయం 5:45గంటలకు ఉండవల్లి నివాసం నుంచి బయలుదేరి 06:00గంటలకు పెనుమాక గ్రామానికి చేరుకోనున్నారు. ఉదయం 6నుంచి 6:20గంటల వరకు ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో భాగంగా ఎస్టీ కాలనీలో లబ్ధిదారుల ఇళ్లకు వెళ్లి నేరుగా ఆయన పింఛన్లు పంపిణీ చేయనున్నారు. 6:30నుంచి 7:15వరకు పెనుమాక మసీదు సెంటర్‌లో ప్రజావేదిక కార్యక్రమంలో భాగంగా లబ్ధిదారులు, ప్రజలతో మాట మంతి నిర్వహిస్తారు. కార్యక్రమం అనంతరం ఉండవల్లి నివాసానికి చేరుకుంటారు. అయితే జులై 1నుంచి సాధారణ పింఛనుదారులకు నెలకు రూ.4 వేలతోపాటు మూడు నెలల బ్యాలెన్స్‌ రూ.3వేలు కలిపి మొత్తం రూ.7వేలు అందించనున్నారు. దివ్యాంగులకు రూ.6వేల చొప్పున పింఛను పంపిణీ చేయనున్నారు.

Updated Date - Jun 30 , 2024 | 08:32 PM