AP News: ముఖ్యమంత్రి చంద్రబాబుతో డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ కీలక భేటీ
ABN , Publish Date - Dec 02 , 2024 | 06:53 AM
అమరావతి: ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ సమావేశం కానున్నారు. సోమవారం మధ్యాహ్నం ఒంటి గంటకు సీఎం చంద్రబాబుతో ఆయన నివాసంలో భేటీ కానున్నారు. కాకినాడ పోర్టు వ్యవహారంతో పాటు, పలు ఇతర కీలక అంశాలు, తాజా రాజకీయ పరిణామాలపై చర్చించే అవకాశం ఉన్నట్లు సమాచారం.
అమరావతి: ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు (CM Chandrababu)తో డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ (Deputy CM Pawan Kalyan) సమావేశం కానున్నారు. సోమవారం మధ్యాహ్నం ఒంటి గంటకు సీఎం చంద్రబాబుతో ఆయన నివాసంలో భేటీ కానున్నారు. కాకినాడ పోర్టు (Kakinada Port) వ్యవహారంతో పాటు, పలు ఇతర కీలక అంశాలు, తాజా రాజకీయ పరిణామాలపై చర్చించే అవకాశం ఉన్నట్లు సమాచారం. కాగా రాష్ట్ర మంత్రివర్గ సమావేశాన్ని ఒక రోజు ముందే నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ముందుగా ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం ఈ నెల 4న ఈ భేటీ జరగాలి. తాజాగా మంగళవారం జరపాలని నిర్ణయించారు. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరబ్‌కుమార్ ప్రసాద్ ఆదివారం ఉత్తర్వులు జారీ చేశారు. 3వ తేదీ ఉదయం 11 గంటలకు సచివాలయంలో కేబినెట్ సమావేశం జరుగుతుందని.. అధికారులు తమ శాఖలకు సంబంధించిన ప్రతిపాదనలు వెంటనే సిద్ధం చేసి.. జీఏడీకి పంపించాలని ఆదేశించారు.
కాగా కాకినాడ నుంచి యథేచ్ఛగా రేషన్ బియ్యం విదే శాలకు తరలిపోతున్న వైనంపై డిప్యూటీ సీఎం పవ న్‌కళ్యాణ్ నిప్పులు చెరిగారు. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా అధికారులు పద్ధతి మార్చు కోకుండా మాఫియాకు సహకరిస్తున్నారంటూ ధ్వజ మెత్తారు. రేషన్ బియ్యం విదేశాలకు తరలిపోయేలా అధికారులే సహకరిస్తున్నారంటూ శివాలెత్తారు. డీఎస్‌వో, కలెక్టర్, పోర్టు అధికారులను పిలిచి ఏం చేస్తున్నారు మీరంతా అంటూ మండిపడ్డారు. కాకి నాడ జిల్లా ఎస్పీకి ఎన్నిసార్లు చెప్పినా కనీసం స్పం దన లేదని దునుమాడారు. తాను జిల్లాకు ఎప్పుడు వచ్చినా సెలవుపై ఉంటున్నారు.. అంటూ ఆయనకు నోటీసులు పంపాలని ఆదేశించారు. కాకినాడ పోర్టు ప్రమాదకరంగా మారిందని, దీనిపై ప్రధాని, కేంద్ర హోంమంత్రికి లేఖ రాస్తానని హెచ్చరించారు.
యాంకరేజ్ పోర్టులో బియ్యం పరిశీలన
కాకినాడ పోర్టులో పవన్‌కల్యాణ్ శుక్రవారం మధ్యాహ్నం పర్యటించారు. తొలుత 12.45గంటలకు యాంకరేజ్ పోర్టులో బార్జిలో తనిఖీలు చేశారు. ఇం దులో రేషన్ బియ్యం ఎగుమతి అవుతుండడంతో ఇటీవల అధికారులు పట్టుకున్నారు. నేరుగా పవన్ బార్జి ఎక్కి బియ్యం ప్లేటులో వేసి పరిశీలించారు. రేషన్ బియ్యం ఆనవాళ్లను గుర్తించారు. అక్కడే ఉన్న డీఎస్‌వో, కలెక్టర్, పోర్టు అధికారి, ఇతర అధి కారులపై తీవ్రంగా మండిపడ్డారు. రేషన్ మాఫి యాకు మీరంతా సహకరించకపోతే ఇలా ఎలా దేశాలు దాటిపోతోందని శివాలెత్తారు. ఉద్యోగాలు చేస్తున్నారా.. మాఫియాకు వంత పాడుతున్నారా? అంటూ మండిపడ్డారు. పక్కనే ఉన్న టీడీపీ ఎమ్మె ల్యే కొండబాబును ఉద్దేశించి దీనిపై మరింత గట్టి పోరాటం చేయాలని, నెమ్మదిగా ఉండకూడదని పేర్కొన్నారు. అనంతరం అక్కడినుంచి మధ్యాహ్నం ఒంటి గంట తర్వాత డీప్‌వాటర్ పోర్టుకు చేరుకుని అక్కడి నుంచి టగ్ ఎక్కి సముద్రంలోకి వెళ్లారు.
సముద్రం అల్లకల్లోలంగా ఉన్నా..
తుఫాను నేపథ్యంలో సముద్రం అల్లకల్లోలంగా ఉండడంతో పవన్ సముద్రంలోకి వెళ్తారని అధికారులు అనుకోలేదు. కానీ అనూహ్యంగా ఆయన టగ్ ఎక్కి తొమ్మిది నాటికల్ మైళ్ల దూరంలో ఉన్న పశ్చి మ ఆఫ్రికా నౌక స్టెల్లా ఎల్ పనామా వద్దకు బయ లుదేరారు. సముద్రం భయానకంగా ఉండడంతో అధికారులు వద్దని వారించారు. అయినా పవన్ వినలేదు. నౌకవద్దకు వెళ్లిన తర్వాత పైకి ఎక్కి ఎగుమతికి సిద్ధంగా ఉన్న 640 టన్నుల బియ్యాన్ని పరిశీలించాలి. కానీ వాతావరణం బాగోలేదని, నౌకపైకి ఎక్కొద్దని అధికారులు పవన్‌కు తెలిపారు. సముద్ర ప్రయాణం మధ్యలో పవన్ ఎమ్మెల్యే కొండబాబు సమక్షంలో అధికారులపై మండిపడ్డారు. రేషన్ మాఫియాపై ప్రభుత్వం సీరియస్‌గా ఉన్నా క్షేత్ర స్థాయిలో పరిస్థితులు భిన్నంగా ఉన్నాయని అసహనం వ్యక్తంచేశారు. ఈ విషయంలో మొత్తం సివిల్ సప్లయిస్ డిపార్ట్‌మెంట్ ఫెయిల్ అయ్యిందన్నారు. డీఎస్‌ఓ ప్రసాద్, జిల్లా ఎస్పీ విక్రాంత్‌పాటిల్, జిల్లా కలెక్టర్ షాన్‌మోహన్, పోర్టు అధికారి ధర్మ శాస్త్ర, డీఎస్పీ రఘువీర్‌పై ఆయన తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. పీడీఎస్ బియ్యం ఉన్న స్టెల్లా ఎల్ పనా మా భారీ నౌకను సీజ్ చేయాలని డిప్యూటీ సీఎం పవన్‌కల్యాణ్ ఆదేశించారు. కాకినాడ యాం కరేజ్ పోర్టులో అధికారులు దృష్టిపెట్టాల న్నారు. పోర్టులోని రెండు చెక్‌పోస్టుల వద్ద 24 గంటలు నిఘా ఉండాలన్నారు.
కాకినాడలో రేషన్ మాఫియా
మధ్యాహ్నం 3 గంటల తర్వాత తిరిగి డీప్‌వాటర్ పోర్టుకు చేరుకున్న పవన్ విలేక రుల సమావేశంలో ప్రసంగించారు. రేషన్ మాఫియా కాకినాడలో దారుణంగా ఉందని, తనను నౌక ఎక్కనీయకుండా అధికారులు అడ్డు కున్నారని పేర్కొని సంచలన వ్యాఖ్యలు చేశా రు. రెండు నెలలుగా కాకినాడ పోర్టులో తనిఖీలకు తనను రాకుండా అధికారులు ఏవో సాకులు చెప్పి అడ్డుకుంటున్నారని గుర్తుచేసి బాంబుపేల్చారు. తాను ఢిల్లీ నుంచి అమరావతి వెళ్లాలని, కానీ రేష న్ మాఫియా తీవ్రత నేపథ్యంలో కాకి నాడ పర్యటనకు వచ్చానని తెలిపారు. విలేకరుల సమావేశం అనంతరం పవన్ అమరావతికి బయలుదేరి వెళ్లారు.
గ్రీన్‌ఛానల్ ద్వారా తరలింపు
అంతకుముందు మంత్రి నాదెండ్ల మనోహర్ మాట్లాడుతూ గత జూన్‌లో కాకినాడలో తనిఖీ చేసి నప్పుడు 26వేల మెట్రిక్ టన్నులు పీడీఎస్ బియ్యం పట్టుకున్నామన్నారు. బియ్యం మాఫియా గుంటూ రు, చిత్తూరు, శ్రీకాకుళం జిల్లా నుంచి గ్రీన్ ఛానల్ ఏర్పాటుచేసుకుని కాకినాడ పోర్టు నుంచి విదేశాల కు అక్రమంగా తరలిస్తున్నారన్నారు. పీడీఎస్ బి య్యాన్ని అక్రమంగా త రలిస్తే కఠిన చర్యలు ఉంటాయన్నారు. కాకినాడ సిటీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు మాట్లాడుతూ అధికారంలో ఉన్నప్పుడు ద్వారంపూడే వ్యాపారం చేశారనీ, ఇప్పుడు బినా మీలు ఈ దందా చేస్తున్నారని ఆరోపించారు.
ఈ వార్తలు కూడా చదవండి..
Read Latest AP News and Telugu News
Read Latest Telangana News and National News
Read Latest Chitrajyothy News and Sports News