Dulipalla Narendra: చంద్రబాబుపై సీఐడీ అధికారులు ఇంకా కక్షపూరితంగా వ్యవహరిస్తున్నారు
ABN , Publish Date - Jan 13 , 2024 | 09:37 PM
సీఐడీ అధికారులు టీడీపీ అధినేత చంద్రబాబుపై ఇంకా కక్షపూరితంగా వ్యవహరిస్తున్నారని టీడీపీ నేత దూళిపాళ్ల నరేంద్ర ( Dulipalla Narendra ) అన్నారు.
అమరావతి: సీఐడీ అధికారులు టీడీపీ అధినేత చంద్రబాబుపై ఇంకా కక్షపూరితంగా వ్యవహరిస్తున్నారని టీడీపీ నేత దూళిపాళ్ల నరేంద్ర ( Dulipalla Narendra ) అన్నారు. చంద్రబాబు నాయుడుపై ఇసుక కేసులో వ్యక్తిగత పూచికత్తి లక్షరూపాయిలు బాండ్స్ ఇచ్చారు. చంద్రబాబుకు వ్యక్తిగత పూచికత్తిపై మాజీ మంత్రి నక్కా ఆనందబాబు, ధూళిపాళ్ల నరేంద్ర సాక్షి సంతకాలు చేశారు. సంతకాలు అనంతరం గుంటూరు జిల్లా కుంచనపల్లిలోని సిట్ కార్యాలయానికి చంద్రబాబు వెళ్లారు. ఈ సందర్భంగా దూళిపాళ్ల నరేంద్ర మీడియాతో మాట్లాడుతూ... చంద్రబాబుని ఒక్క చోటకు పిలిచి సీఐడీ సంతకాలు చేయించుకోవచ్చని. అలా కాకుండా మూడు ప్రాంతాల్లో తిప్పి కక్షపూరితంగా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. తాము సీఐడీ అధికారులకి విజ్ఞప్తి చేసినప్పటికీ అవేమీ పట్టనట్లు వ్యవహరించారన్నారు. సీఐడీ అధికారులు చర్యల వల్ల చంద్రబాబుతో పాటు సామాన్య ప్రజలు కూడా ఇబ్బందులు పడ్డారని దూళిపాళ్ల నరేంద్ర తెలిపారు.