Vidadala Rajini: యూట్యూబ్ ఛానల్స్‌పై మాజీ మంత్రి ఫిర్యాదు
ABN , Publish Date - Oct 31 , 2024 | 10:40 AM
Andhrapradesh: సోషల్ మీడియాలో తనపై అసభ్యకరమైన పోస్టింగ్స్ పెడుతున్నారంటూ మాజీ మంత్రి విడదల రజినీ పోలీసులకు ఫిర్యాదు చేశారు. కిరణ్ అనే యాంకర్ యూట్యూబ్‌లో అసభ్యకర పోస్టింగ్స్ పెడుతున్నారని ఫిర్యాదులో పేర్కొన్నారు. పోలీసులతో పాటు జాతీయ మహిళా కమీషన్, ఏపీ మహిళా కమీషన్, డీజీపీలకు కూడా రజినీ ఫిర్యాదు చేశారు.
గుంటూరు జిల్లా, అక్టోబర్ 31: మాజీ మంత్రి విడదల రజినీ (Vidadala Rajini) పోలీసులను ఆశ్రయించారు. సోషల్ మీడియాలో తనపై అసభ్యకరమైన పోస్టింగ్స్ పెడుతున్నారంటూ మాజీ మంత్రి పోలీసులకు ఫిర్యాదు చేశారు. కిరణ్ అనే యాంకర్ యూట్యూబ్‌లో అసభ్యకర పోస్టింగ్స్ పెడుతున్నారని ఫిర్యాదులో పేర్కొన్నారు. పోలీసులతో పాటు జాతీయ మహిళా కమీషన్, ఏపీ మహిళా కమీషన్, డీజీపీలకు కూడా రజినీ ఫిర్యాదు చేశారు. రెండు యూట్యూబ్ ఛానెల్స్‌పై కూడా పట్టాభిపురం పోలీసులకు ఫిర్యాదు చేశారు. వ్యక్తిత్వ హననానికి పాల్పడేలా పోస్టింగ్స్ పెడుతున్నారంటూ మాజీ మంత్రి విడదల రజినీ ఫిర్యాదులో పేర్కొన్నారు.
Viral: కోడిపుంజు ఉదయాన్నే ఎందుకు కూత వేస్తుంది.. ఇదీ అసలు రహస్యం..
కాగా... ఇటీవల విడదల రజినీ పార్టీ మారుతున్నారని జోరుగా ప్రచారం జరిగింది. ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో ఘోరంగా ఓడిపోయిన వైసీపీ కేవలం 11 సీట్లకు మాత్రమే పరిమితమైన విషయం తెలిసిందే. రాష్ట్రంలో పార్టీ పరిస్థితి దారుణంగా ఉన్న తరుణంలో అనేక మంది నేతలు పక్క పార్టీలవైపు పరుగులు పెడుతున్నారు. ఇప్పటికే ఆళ్లనాని, బాలినేని శ్రీనివాస్, సామినేని, మోపిదేవి, బీద మస్తాన్ వంటి నేతలు వైసీపీకి గుడ్‌బై చెప్పేయగా.. తాజాగా ఆ లిస్టులో విడదల రజినీ చేరతారనే వార్తలు వినిపిస్తున్నాయి. ఈ మధ్య కాలంలో విడదల రజినీ పార్టీ కార్యక్రమాల్లో కనిపించడం లేదు. ఈ క్రమంలో ఆమె జనసేనలో చేరతారని పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది. రజినీ చేరికకు ఇప్పటికే జనసేన అధినేత పవన్ ఓకే చెప్పేశారని.. ఇక పార్టీలో చేరడమే తరవాయి అని విశ్వనీయ వర్గాల సమాచారం. మరి విడదల రజినీ పార్టీని వీడతారా లేదా అనేది సర్వత్రా చర్చనీయాంశంగా మారింది.
Hanumakonda: తండ్రిని పట్టించుకోని కొడుక్కి తగిన శాస్తి
స్వల్ప కాలంలో వైసీపీలో ఓరేంజ్‌లో ఎదిగిపోయిన నేత విడదల రజినీ. 2014లో మాజీ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు శిష్యురాలిగా తెలుగు దేశం పార్టీలో చేరిన ఆమె.. మహానాడు వేదికగా జగన్‌పై నిప్పులు చెరిగారు. అయితే 2019 ఎన్నికల్లో చిలకలూరిపేట నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యే టికెట్ ఆశించగా.. అక్కడ ప్రత్తిపాటి పుల్లారావు పోటీ చేస్తుండటంతో వెంటనే టీడీపీ గుడ్‌బై చెప్పేసి 2018లో వైసీపీ కండువా కప్పుకున్నారు. ఆమె 2019 ఎన్నికల్లో చిలకలూరిపేట నియోజకవర్గం నుంచి వైసీపీ అభ్యర్థిగా పోటీ చేసి టీడీపీ అభ్యర్థి ప్రత్తిపాటి పుల్లారావుపై 8301 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. అంతేకాదు జగన్ మంత్రివర్గంలో ఆరోగ్య, కుటుంబ సంక్షేమం, వైద్యవిద్య శాఖల మంత్రిగా పనిచేశారు. అతితక్కువ కాలంలో వైసీపీలో తన మార్క్ చూపించారు విడదల రజినీ. అయితే ఇటీవల జరిగిన ఎన్నికల్లో గుంటూరు పశ్చిమ నుంచి వైసీపీ అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి టీడీపీ అభ్యర్థి గళ్ళా మాధవి చేతిలో 51150 ఓట్ల తేడాతో ఓడిపోయారు. ఈ క్రమంలో విడదల రజనీ పార్టీని వీడతారనే టాక్ వినిపిస్తోంది. అయితే ఈ వార్తలను ఆమె వర్గీయులు మాత్రం కొట్టిపారేస్తున్నారు. విడదల రజనీ వైసీపీని వీడే ప్రసక్తే లేదని చెబుతున్నారు. మున్ముందు రజనీ ఎలాంటి నిర్ణయం తీసుకోబోతున్నారో చూడాలి మరి.
ఇవి కూడా చదవండి..
Read Latest AP News And Telugu News