Kilari Rosaiah: వైసీపీకి మాజీ ఎమ్మెల్యే కిలారి రోశయ్య గుడ్ బై..
ABN , Publish Date - Jul 24 , 2024 | 02:50 PM
వైసీపీ(YSRCP)కి మరో గట్టి ఎదురుదెబ్బ తగిలింది. గుంటూరు పశ్చిమ మాజీ ఎమ్మెల్యే మద్దాలి గిరి ఇటీవల వైసీపీకి రాజీనామా చేసి నాలుగు రోజులు కాకముందే పొన్నూరు మాజీ ఎమ్మెల్యే కిలారి రోశయ్య(Kilari Venkata Rosaiah) సైతం రాజీనామా ప్రకటించడం సంచలనంగా మారింది. రాజీనామా సమయంలో ఆయన పార్టీపై తీవ్ర విమర్శలు గుప్పించారు.
గుంటూరు: వైసీపీ(YSRCP)కి మరో గట్టి ఎదురుదెబ్బ తగిలింది. గుంటూరు పశ్చిమ మాజీ ఎమ్మెల్యే మద్దాలి గిరి ఇటీవల వైసీపీకి రాజీనామా చేసి నాలుగు రోజులు కాకముందే పొన్నూరు మాజీ ఎమ్మెల్యే కిలారి రోశయ్య(Kilari Venkata Rosaiah) సైతం రాజీనామా ప్రకటించడం సంచలనంగా మారింది. రాజీనామా సమయంలో ఆయన పార్టీపై తీవ్ర విమర్శలు గుప్పించారు. పార్టీకి వ్యతిరేకంగా పని చేసిన వారికే పదవులు కట్టబెడుతున్నారని ఆయన మండిపడ్డారు. ఉమ్మారెడ్డి వేంకటేశ్వర్లుకి శాసన మండలి ఛైర్మన్ అన్నారని కానీ.. కనీసం ప్రతిపక్ష నేతగా కూడా ఆయనకు అవకాశం ఇవ్వలేదని దుయ్యబట్టారు. ఉమ్మారెడ్డి అనుభవాన్ని పార్టీ వినియోగించుకోలేదన్నారు.
విపక్షనేతగా అప్పిరెడ్డి ఎంపిక విషయంలోనూ కనీసం ఎవరితోనూ చర్చించలేదు. లోక్ సభ ఎన్నికల్లో ఎంపీ అభ్యర్థిగా నిలబెట్టి మానసికంగా తనను కుంగదీశారని ఆవేదన వ్యక్తం చేశారు. ఏసీ అసెంబ్లీ ఎన్నికల్లో అన్ని నియోజకవర్గాల్లో పార్టీ అభ్యర్థులకు డబ్బులు ఇచ్చారని, కానీ కాపు అభ్యర్థులకు మాత్రం ఇవ్వలేదని ఆరోపించారు. 2019లో ఏసురత్నం ఓటమికి కారణం ఎవరో అందరికి తెలుసని చెప్పుకొచ్చారు. వైసీపీలో తాను ఇక కొనసాగలేనని అందుకే పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నట్లు కిలారి రోశయ్య ప్రకటించారు.
గుంటూరు పార్లమెంట్ పరిధిలోని నాయకులతో బుధవారం రోజున మాజీ ఎమ్మెల్యే కిలారి వెంకట రోశయ్య ఆత్మీయ సమావేశం నిర్వహించారు. రాజీనామాపై వారితో సుదీర్ఘంగా చర్చించారు. ఈ సమావేశంలో ఆయన సొంత పార్టీ, నేతలపైనే తీవ్రంగా మండిపడ్డారు. పార్టీ పేరు చెప్పుకొని కొందరు పెద్ద మనుషులు ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. వైసీపీలో ఎన్నో అవమానాలు ఎదుర్కొన్నట్లు వారికి చెప్పారు. ఎంత కష్టపడినా కనీసం విలువ లేకుండా మాట్లాడుతున్నారు. ఆత్మాభిమానం దెబ్బతిన్న చోట తాను ఉండలేనని నిన్న జరిగిన సమావేశంలో ఆయన చెప్పారు. ఈ మేరకు తాజాగా వైసీపీకి రాజీనామా చేస్తున్నట్లు కిలారి రోశయ్య ప్రకటించారు.
ఇది కూడా చదవండి:
AP Assembly: అధికారులపై డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఫైర్